Sunday, September 11, 2011

కొంతమంది డాక్టర్లు - కొన్నిహాస్పిటల్ ల ఫోన్‌ నంబర్లు శ్రీకాకుళం జిల్లా , Some Doctors and hospitals phones Srikakulam




ప్రభుత్వ ఆసుపత్రి
* సామాజిక ఆసుపత్రి -------- పలాస -------- ఫోను: 08945 241063
* ప్రాంతీయ ఆసుపత్రి----------- పాలకొండ ----- ఫోను: 08941-220130
* సామాజిక ఆసుపత్రి ---------- కోటబొమ్మాళి -- ఫోను: 08942 238380
* సామాజిక ఆసుపత్రి ---------- సోంపేట --------ఫోను: 08947-234350
* సామాజిక ఆసుపత్రి - ---------బారువ ---------ఫోను: 08947-235131
* ప్రభుత్వ ఆసుపత్రి ------------ వీరఘట్టం ------ఫోను: 94419 20931
* 30 పడకల ఆసుపత్రి --------- పొందూరు ----- ఫోను: 94408 57257
* ముప్పైపడకల ఆసుపత్రి------ సీతంపేట ------ ఫోను: 97040 04566
* సామాజిక ఆసుపత్రి -----------పాతపట్నం---- ఫోను: 99487 65449

ప్రైవేటు ఆసుపత్రులు :


శ్రీకాకుళం టౌన్‌ (జిల్లా కేంద్రము ) నర్శింగ్ హోమ్‌లు :
*రిమ్స్‌ క్యాజువాల్టీ - శ్రీకాకుళం - 08942-279161,
*కృష్ణా నర్శింగ్‌హోమ్‌ - డా.రమేష్‌ - ఫోను: 94403 48378,
* కమల హాస్పిటల్‌ - శ్రీకాకుళం - 9848438010,
* కూన మాధురి హాస్పిటల్‌ - శ్రీకాకుళం - 9440436059,
* విజయహర్ష హాస్పిటల్‌ - శ్రీకాకుళం - 9866027295,
* సీపాన సోమశేఖర్‌ - శ్రీకాకుళం - 08942-228855,
* సాయిగాయత్రి క్లీనిక్‌ - శ్రీకాకుళం - 9440436093,
* ఆదిత్య సర్జరికల్‌ స్కిన్‌అండ్‌ క్లీనిక్‌ - శ్రీకాకుళం - 08942 222722,
* శ్రీసూర్య ఆర్థోకేర్‌ - శ్రీకాకుళం - 9440584162,
* డేఅండ్‌నైట్‌ హాస్పిటల్‌ - శ్రీకాకుళం - 08942-222222,
* బగ్గు సరోజినిదేవి ఆసుపత్రి - శ్రీకాకుళం - 9866396547,
*వందన నర్శింగ్ హోమ్‌ ----శ్రీకాకుళం - 08942 222727,

కొంతమంది వైధ్యులు :శ్రీకాకుళం టౌన్‌ (జిల్లా కేంద్రము ) :
* చెక్క నారాయణరావు ఇఎన్‌టి - శ్రీకాకుళం - 9440112957,
* డి.పి.ఇ.ఎన్‌.రాజు - శ్రీకాకుళం - 9440121377,
* డా.ఎం.కె.ప్రసాదు, హెచ్‌.ఐ.వి. - శ్రీకాకుళం - 9440230678,
* డా.మెట్టమధు, ఫిజీషియన్‌ - శ్రీకాకుళం - 9908090928,
* డా.శ్రీదేవి, గైనకాలజిస్ట్‌ - శ్రీకాకుళం - 9440436093,
* డా.రమేష్‌, దంతవైద్యనిపుణులు - శ్రీకాకుళం - 944075962,
* డా.రోష్‌ మల్లికార్జునరావు - శ్రీకాకుళం - 94401959536,
* డా. పల్లి ప్రభాకరరావు, ప్రభుత్వ హోమియో వైద్యులు - శ్రీకాకుళం - 9440199362,
* డా.పార్వతి, గైనకాలజిస్ట్‌ - శ్రీకాకుళం - 9440251699,
* డా.బి.వి.కామేశ్వరరావు, సింధూర ఆసుపత్రి - శ్రీకాకుళం - 9440196677,
* డా.ఉబలా ప్రశాంతకుమార్‌ , ఆర్థోపెడిక్‌ - శ్రీకాకుళం 9440106058,
* డా.శాంతారాం, పిల్లల వైద్యులు - శ్రీకాకుళం - 9441290066,
* డా.దానేటి శ్రీధర్‌, కిమ్స్‌ ఆసుపత్రి - శ్రీకాకుళం - 9966624499,
* డా.వండాన శేషగిరిరావు , వందన నర్శ్హింగ్ హోం - శ్రీకాకుళం-- 9616316797,
* డా.సునీల్‌నాయక్‌, ఫిజీషియన్‌ - శ్రీకాకుళం - 9440828299,
* గిరిబాబు డాక్టర్‌, రిమ్‌స్ హాస్పిటల్ - శ్రీకాకుళం - 9440436067,
* డాక్టర్‌ తిరుపతిరావు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త - శ్రీకాకుళం , 9490722419,
* డాక్టర్‌ లక్ష్మణరావు, ఫిజియోథెరపిస్ట్‌ - శ్రీకాకుళం - 9440496993,
* డా.టి.వి .రమణారావు, చర్మవైద్యనిపుణులు - శ్రీకాకుళం - 9440412989,
* డా.ఎన్‌.కె.ప్రసాదు, హెచ్‌.ఐ.వి.వైద్యనిపుణులు - శ్రీకాకుళం - 9440230618,
* డా.అంబేద్కర్‌ రిమ్స్‌ మెడికల్‌ సూపరింటిండెంట్‌ - శ్రీకాకుళం - , 984912520,

కాశీబుగ్గ- పలాస :
* రాజేశ్వరి నర్శింగ్‌హోం - డిగ్రీ కాలేజీ రోడ్డు - కాశీబుగ్గ - ఫోను: 08945 242165,
* సేఫ్‌ ఆసుపత్రి - కె.టి రోడ్డు - పలాస - ఫోను: 99491 75851,
* సుశ్రుత నర్శింగ్‌హోం - కె.టి. రోడ్డు - కాశీబుగ్గ - ఫోను: 94401 06493,
* హరిక్రిష్ణ నర్శింగ్‌ హోం - డిగ్రీ కళాశాల రోడ్డు - కాశీబుగ్గఫోను: 94405 43266,
* కావ్య నర్శింగ్‌ హోం, సుభద్రానగర్‌ - కాశీబుగ్గ - ఫోను: 94404 48277,
* శివదుర్గ, విష్ణుప్రియ నర్శింగ్‌ హోం - కె.టి. రోడ్డు - కాశీబుగ్గ - ఫోను: 08945 241345,
* సాయిక్రిష్ణ ప్రసూతి వైద్యశాల - దంతంవీధి - కాశీబుగ్గ - ఫోను: 93468 11674,
* డాక్టర్‌ గోపాలక్రిష్ణ మెమోరియల్‌ ఆసుపత్రి - అక్కుపల్లి రోడ్డు, కాశీబుగ్గ - ఫోను: 08945 241130,
* శ్రీసాయి శ్రీనివాస నర్శింగ్‌ హోం - శ్రీనివాసలాడ్జి జంక్షన్‌ - కాశీబుగ్గ - ఫోను: 94415 70159,
* సీతారామ నర్శింగ్‌ హోం - ఆంధ్రాబ్యాంకు రోడ్డు - కాశీబుగ్గ- ఫోను: 08945 242347,
* డాక్టర్‌ తెప్పల ఆనందరావు ఆసుపత్రి - రామక్రిష్ణ పోలీసు కాలనీ - కాశీబుగ్గ - ఫోను: 94403 95368,
* శ్రీ వెంకటేశ్వర నర్శింగ్‌హోం - పూండి - ఫోను: 08945 247666.,
* దంత నర్శింగ్‌ హోం - దంతం వీధి - కాశీబుగ్గ - ఫోను: 08945 241129.,

నరసన్నపేట
* వాత్సల్య ఆసుపత్రి - నరసన్నపేట - ఫోన్‌: 08942 277655.
* మమత నర్శింగ్‌హోం - నరసన్నపేట - ఫోన్‌: 80089 84777.
* వెంకటసాయి నర్సింగ్‌హోం - నరసన్నపేట - ఫోన్‌: 94401 97989.
* ఆండాళ్‌ దంత వైద్యశాల - నరసన్నపేట - ఫోన్‌ 08942 277811.
* డాక్టర్‌ మాతల ఆనందరావు - నరసన్నపేట - ఫోన్‌ 08942 277229
* సంతోషిమాత నర్సింగ్‌ హోం - నరసన్నపేట - ఫోన్‌: 98852 07480.
* స్వామి క్లినిక్‌ - నరసన్నపేట - ఫోన్‌: 94406 5050.
* బి.ఆర్‌. దంత వైద్యశాల - నరసన్నపేట - 99668 13536.

పాలకొండ ఏరియా :
* ఆయుర్వేదిక్‌ ఆసుపత్రి - సీతంపేట - ఫోను: 94409 96571,
* సాయినిఖిత ఆసుపత్రి - పాలకొండ - ఫోను: 92980 52251,
* రవీంద్రకుమార్‌ చిన్నపిల్లల ఆసుపత్రి - పాలకొండ - ఫోను: 94403 34604,
* శ్రీనివాస క్లినిక్‌ - పాలకొండ - ఫోను: 94410 58389,
* వెంకటసాయినాధ్‌క్లినిక్‌ - పాలకొండ - ఫోను: 94410 9523,
* శ్రీనివాస నర్సింగ్‌హోం - పాలకొండ - ఫోను: 08941-220258,
* డాక్టర్స్‌ ప్లాజా - పాలకొండ - ఫోను: 90002 73773,
* పల్లవి నర్సింగ్‌హోం - సీతంపేట - ఫోను: 98497 31977,
* డా.రమణ ఆసుపత్రి - సీతంపేట - ఫోను: 94405 97330,
* స్వామి క్లినిక్‌ - వీరఘట్టం - ఫోను: 94400 02173,
* రామకృష్ణ క్లినిక్‌ - వీరఘట్టం - ఫోను: 94409 63335,
* షిర్డీసాయి క్లినిక్‌ - వీరఘట్టం - ఫోను: 94408 89589,
* సత్యసాయి క్లినిక్‌ - వీరఘట్టం - ఫోను: 94404 13919,


పిహెచ్‌సీలు(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం):
  1. * గంగువాడ వైద్యాధికారిణి - ఫోను: 94400 58933,
  2. * బైదలాపురం వైద్యాధికారిణి ఫోను: 98661 14762,
  3. * ఎల్‌.ఎన్‌.పేట - ఫోను: 99852 37008,
  4. * హిరమండలం ఫోను: 87908 45205,
  5. * చొర్లంగి ఫోను: 08946-212144,
  6. * కురిగాం ఫోను: 93470 30605,
  7. * సీహెచ్‌ఎన్‌ఒ, కొత్తూరు ఫోను: 94942 02799,
  8. * మెళియాపుట్టి ఫోను: 90528 24435,
  9. * చాపర ఫోను: 90528 24435,
  10. * కరజాడ ఫోను: 92466 99330,
  11. * మర్రిపాడు - ఫోను: 94404 16654,
  12. * దోనుబాయి - ఫోను: 94911 90291,
  13. * బొద్దాం - ఫోను: 98486 96992,
  14. * పొగిరి - ఫోను: 98851 47040,
  15. * తొగరాం- ఫోను: 94402 00964,
  16. * దూసి- ఫోను: 99664 90465,
  17. * సరుబుజ్జిలి - ఫోను: 99851 09358,
  18. * అక్కులుపేట- ఫోను: 90008 97525,
  19. * కింతలి- ఫోను: 94412 78876,
  20. * కె.కొత్తూరు, టెక్కలి - ఫోను: 93900 48729,
  21. * సంతకవిటి - ఫోను: 94900 11424,
  22. * మందస - ఫోను: 94942 03970,
  23. * బొడంబో - మందస మండలం - ఫోను: 94942 03920,
  24. * సిరిపురం - మందస మండలం-,
  25. * హరిపురం - మందస మండలం - ఫోను: 92466 99905,
  26. * అక్కుపల్లి - వజ్రపుకొత్తూరు మండలం - ఫోను: 99082 04460,
  27. * గోవిందపురం, వజ్రపుకొత్తూరు మండలం - ఫోను: 94906 42059,
  28. * వెంకటాపురం - ఫోను: 97039 57754,
  29. * ఉర్లాం - ఫోన్‌: 94400 69327,
  30. * జలుమూరు - ఫోన్‌: 08942 275338,
  31. * అచ్చుతాపురం - ఫోన్‌: 90008 14991,
  32. * అన్నవరం - ఫోను: 94405 44527,
  33. * ఎం.సింగుపురం - ఫోను: 94404 14727,
  34. * బిటివాడ - ఫోను: 99083 69914,
  35. * బత్తిలి- ఫోను: 94937 03230,
  36. * బాలేరు - ఫోను: 94405 59729,
  37. * భామిని - ఫోను: 94928 14821,
  38. * రేగిడి - ఫోను: 90009 75585,
  39. * వంగర - ఫోను: 99851 67006,
  40. * గుత్తావల్లి - ఫోను: 94408 91981,
  41. * బూర్జ - ఫోను: 94927 47947,
  42. * పొందూరు - ఫోను: 94412 78876,
  43. * నందిగాం - ఫోను: 94411 55679,
  44. * దండుగోపాలపురం - ఫోను: 08945 236219,
  45. * నౌపడా - ఫోను: 94941 93869,
  46. * బోరుబద్ర - ఫోను: 94900 41221,
  47. * బట్టిగళ్లూరు - 9052910032,
  48. * కొర్లాం - ఫోను: 9440319931,
  49. * కంచిలి - 98660 58711,
  50. * ఎం.ఎస్‌.పల్లి - 9490046772,
  51. * కుశిమి - ఫోను: 98853 69971,

Nursing Homes :

రాజాం :
* జి.ఎం.ఆర్‌. కేర్‌ ఆసుపత్రి - రాజాం - టోల్‌ఫ్రీ: 08941 251834,
* జి.ఎం.ఆర్‌.కేర్‌ ఆసుపత్రి - రాజాం - ఫోను: 94405 63274,
* సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి - రాజాం - ఫోను: 08941 251255,
* గోరింట్ల నర్శింగ్‌హోమ్‌ - రాజాం - ఫోను: 94403 47589,
* సత్యవాణి నర్శింగ్‌హోమ్‌ - రాజాం - ఫోను: 90009 75585,
* క్రిష్ణా నర్శింగ్‌హోమ్‌(ఈఎన్‌టీ) - రాజాం - ఫోను: 97900 16379,
* బాలాజీ నర్శింగ్‌ హోమ్‌ - రాజాం - ఫోను: 98486 96992,

* సత్యసాయి నర్శింగ్‌హోమ్‌ - సంతకవిటి - ఫోను: 08941 257773,

పొందూరు :
* ప్రశాంతి నర్సింగ్‌ హోమ్‌ - పొందూరు - ఫోను :94411 59676,
* కాకర్ల నర్సింగ్‌ హోమ్‌ - పొందూరు - ఫోను: 08942 242784,
* శ్రీవెంకటేశ్వరా క్లినిక్‌ - పొందూరు - ఫోను: :94414 67930,
* శ్రీనివాసా క్లినిక్‌ - పొందూరు - ఫోను : 94417 29698,
* త్రిపుర సందరీ క్లినిక్‌ - పొందూరు - ఫోను : 94415 69094.

ఆమదాలవలస
* 30 పడకల ఆసుపత్రి - ఆమదాలవలస - ఫోను: 92478 81586, 08942-286222,
* అన్నపూర్ణ నర్సింగ్‌ హోమ్‌ - ఆమదాలవలస - ఫోను: 94410 17482,
* శ్రీనివాస నర్సింగ్‌హోమ్‌ - ఆమదాలవలస- ఫోను: 93466 48330,
* శ్రీసత్యసాయి నర్శింగ్‌ హోమ్‌ - ఆమదాలవలస - ఫోను: 98480 49218,
*
టెక్కలి :
* వైద్యవిధానపరిషత్‌ ప్రాంతీయాస్పత్రి - టెక్కలి - ఫోను: 08945 244262,
* శ్రీనివాస క్లినిక్‌ - టెక్కలి - ఫోను: 94401 96867,

సోంపేట :
* మౌర్య నర్శింగ్‌ హోం - సోంపేట - ఫోన్‌: 99592 28349,
* మహలక్ష్మి నర్శింగ్‌ హోం - సోంపేట - ఫోను: 94403 47548,
* శ్రీవెంకటేశ్వర నర్శింగ్‌హోం - సోంపేట - ఫోను: 08947-234230,
* శ్యామల నర్శింగ్‌హోం - సోంపేట - ఫోన్‌: 94401 06160,
* చక్రధర నర్శింగ్‌హోం - సోంపేట - ఫోన్‌: 94404 36664,
* బాలాజీ నర్శింగ్‌హోం - సోంపేట - ఫోను: 94410 37694,
* పిల్లల ఆసుపత్రి - సోంపేట - ఫోను: 94402 83727,
* అన్నపూర్ణ ఆసుపత్రి - సోంపేట - ఫోన్‌: 94404 15028,
* రామకృష్ణ నర్శింగ్‌హోం - సోంపేట - ఫోను: 08947-234310,
* ఆరోగ్యవరం కంటి ఆసుపత్రి - సోంపేట- ఫోన్‌: 08947-234334,


  • ================================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Friday, July 1, 2011

Medical colleges in A.P. and India, భారతదేశము-ఆంధ్రప్రదేశె లో వైద్యకళాశాలలు



భారతదేశము లో వైద్య సేవలు వ్యాపారము గా మారిపోయినవి . కార్పోరేట్ హాస్పిటల్ పుట్టుకొచ్చి వైద్య ఖరీదు ను బాగా పెంచేసాయి. సామాన్యుడికి నిపుణుల వైద్యము అందడము లేదు . ప్రభుత్వము ఎన్ని ప్రజాసేవ పథకాలు పెట్తినా ప్రయోజనకు లేకపోతుంది . రోజు రోజుకి ప్రవేటు మెడికల్ కాలేజీలు పెరిగి్పోతున్నాయి. ఆ మేరకు విద్యా ప్రమాణాలు నాణ్యత తగ్గిపోతుంది .

భారతదేశంలో వైద్యవిధానం - స్థితిగతులు
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో వైద్యవిద్యకు సంబంధించిన పలు వైద్యకళాశాలలు, వైద్య విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ సహకారంతో ప్రాంభమైనాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పలు వైద్యకళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడుతున్నాయి. దీంతో దేశంలో వైద్యవిద్యారంగం చాలావరకు అభివృద్ధి చెందింది. దేశ అవసరాలకు అనుగుణంగా వైద్య విద్యాలయాలు ప్రారంభించబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో సమాజంలో ఏ మేరకు వైద్యవిధానం అమలవుతుందనే విషయాన్ని వైద్య నిపుణులను, వైద్య విద్యావేత్తలను, విద్యనందించే పలు విద్యాలయాలను...... సమాజం ప్రశ్నిస్తోంది. ఎంతటి మెరుగైన వైద్యసేవలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తోందని సమాజం ప్రశ్నిస్తోంది.

వైద్య వృత్తి అనేది గౌరవప్రదమైన వృత్తి. తమ వద్దకు వచ్చే రోగులకు న్యాయబద్దంగా, అత్యంత విలువైన వైద్యసేవలను అందించాలి. ఇది చాలా సాధారణమైన విషయం. దీనిని ప్రతి వైద్యుడు పాటించాల్సిన కనీస ధర్మమని అభిప్రాయపడాలి .

దేశంలో '''మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' '" గుర్తింపు కలిగిన వైద్యవిశ్వవిద్యాలయాలే వైద్యవిద్యను అందిస్తాయి. ఈ విశ్వవిద్యాలయాలలో ఎప్పటికప్పుడు విధివిధానాలను మార్పు చేస్తుంటుంది ఈ " ఎమ్‌సీఐ ". ఈ ఎమ్‌సీఐ వైద్యవిధానంలో తీసుకోవలసిన మార్పులు చేర్పులు, విధివిధానాలలో రూపాంతరం చేసేందుకు ప్రభుత్వ అనుమతిని తీసుకుంటుంటుంది. తమ దేశంలోనున్న న్యాయస్థానాలు ప్రజల ఫిర్యాదులకు అనుగుణంగా వారికి సహాయసహకారాలు కూడా అందిస్తుంటాయి .

వైద్యరంగంలో, వివిధ వైద్యరంగానికి చెందిన సలహా సంఘాల్లో, పరిశోధనా విభాగాల్లో, వైద్యవిద్యను బోధించడంలో, వైద్యులను ఎంపిక చేయడం, వైద్యరంగానికి చెందిన పలు అధ్యాపక సంఘాలలో సలహాలు పొందడము ఈ MCI పర్యవేక్షిస్తూ ఉంటుంది .

ప్రస్తుతం మన భారతదేశంలో వైద్యరంగానికి సంబంధించినంత మేరకు అత్యవసరమైనవ వాటిగురించి చెప్పదలచుకున్నాను...

** 1 వైద్య విద్యను బోధించే ఉపాధ్యాయులు, స్థానికంగా ఉండేటటువంటి వైద్యులు, విద్యార్థులు.
** 2 పరిపాలనాపరంగా మెరుగైన సెవలుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
** 3 ప్రైవేట్ వైద్యకళాశాలలు, విశ్వవిద్యాలయాలను క్రమబద్దీకరించడం తరచూ జరుగుతుండాలి.

మనదేశము లో :
దేశములో వైద్యకళాశాలల్ సంఖ్య =335 ( 01-జూలై 2011 నాటికి),
ప్రవేటు రంగము లో ఉన్న కళాశాలలు = 185.
ప్రభుత్వ రంగము లో ఉన్న కళాశాలలు = 150.
భారతదేశము లో మొత్తము మీద MBBS సీట్లు = 39785 ,

ఆంధ్రప్రదేశ్ రాస్ట్రం లో ప్రభుత్వ, ప్రైవేటు అధ్వర్యంలోని 36 వైద్యకళాశాలు ఉన్నాయి .



Medical colleges in Andhra pradesh

NTR health university portal
http://www.educationinfoindia.com/medical/andhramed.html
http://dme.ap.nic.in/dme_medcolleges.html
http://www.indiaedu.com/andhra-pradesh/colleges/med.htm


  • ========================================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Friday, June 3, 2011

పశువైద్యశాలలు శ్రీకాకుళం లో , Veterinary health centers in Srikakulam dist





పశువైద్య వృత్తి ఒక ప్రత్యేకమైన వృత్తి. సవాళ్లతో కూడుకున్న వృత్తి. ఎందుకంటే, అనారోగ్యంతో వైద్యశాలకు వచ్చే మూగజీవాలు (పశువులు, జంతువులు) బాధను, భావాలను వ్యక్తపరచలేవు. వాటి యజమానులు కూడా జంతువుల అవస్థను, వివరాలను పశువైద్యులకు పూర్తిగా అందించలేరు. మరోవైపు వ్యాధి నిర్ధారణకు
సంబంధించి, మనుషుల వైద్యశాలలో ఉండేటన్ని పరికరాలు కానీ, సౌకర్యాలు కానీ పశువైద్యశాలలో ఉండవు. ఇలాంటి ప్రతికూల పరిస్థితితో వ్యాధిని అర్ధం చేసుకుని, రైతు ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా, సత్వర చికిత్సను అందించవలసిన క్లిష్టతరమైన బాధ్యత పశువైద్యులది

పశువులకు వైద్యసేవలు అందించేందుకు వీలుగా మండలకేంద్రాలలో పశువైద్యశాలలు , గ్రామీణ ప్రాంతాలలో ఉపకేంద్రాలు ఏర్పాటుచేసారు . వీటిద్వారా వందలాది మూగజీవులు మృత్యువాత పడకుండా కాపాడుతున్నారు .

శ్రీకాకుళం జిల్లాలో 38 మండలాలలో 57 ప్రధాన పశువైద్య కేంద్రాలు , 123 ఉపకేంద్రాలు ఉన్నాయి. వీటిద్వారా కోట్లాది పశువులు ఉదా: ఆవులు , ఎద్దులు , గేదెలు , దున్నలు , మేకలు , గొర్రెలు , కుక్కలు , పక్షులు మున్నగు మూగజీవులు లభ్దిపొందుతున్నాయి .

సాదారణముగా పశువులకు ...సోకే జబ్బులలో గొంతువాపు వ్యాది , జబ్బవాపు వ్యాది , గాలికుంటు వ్యాధి లు ముఖ్యమైనచి . కుక్కలకు ' రాబీస్ ' వ్యాధి అతి భయకరమైనది

పశువైద్యశాలల ముఖ్యమైన విధులు :
  • పశు రోగాలను నయం చేయడం ,
  • వ్యాధినిరోధక టీకాయలు వేయడం ,
  • వ్యవసాయ రైతులకు పశు సంపద , సహాయం అందజేయడం ,
  • పాడిపరిశ్రమను అభివృద్ధి కి దోహదం పడడం ,
  • పశుసంపద అభివృద్ది, గోజాతి, పెంపుడు, అడవి జంతువులు, పక్షులు, గుర్రాలలో సాధారణ వచ్చు ఉత్పత్తి, అంటు వ్యాధుల వైద్య0.


  • ================================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Sunday, April 3, 2011

రాజాం జీఎంఆర్‌ కేర్‌ ఆసుపత్రి , GMR care hospital.Rajam





రాజాం సిగలో జీఎంఆర్‌ కేర్‌ ఆసుపత్రి : రాజాం పట్టణంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం గ్రంధి మల్లిఖార్జునరావు (జీఎంఆర్‌) అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన కేర్‌ ఆసుపత్రిని శనివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్రమంత్రులు, ప్రముఖులు ప్రారంభించి సేవలకు పచ్చజెండా ఊపారు.జిల్లా ముంగిట్లోకి అత్యంత ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.మెట్రోపాలిటన్‌ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్‌ వైద్యాన్ని రాజాం లాంటి మారుమూల ప్రాంతానికి అందుబాటులోకి తీసుకురావటాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ.. గ్రంధి మల్లిఖార్జునరావును అభినందించారు. జీఎమ్మార్‌ స్ఫూర్తిగా పారిశ్రామికవేత్తలు సామాజిక సేవలు విస్తరించాలని ప్రముఖులంతా పిలుపునిచ్చారు. 120 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒరిస్సాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రజలకు విస్తృతస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో రూ. 50 కోట్లతో ఆసుపత్రిని నిర్మించారు. ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చినట్లు జీఎంఆర్‌ కేర్‌ యూనిట్‌ మెడికల్‌ డైరెక్టర్‌ రాజేంద్ర తెలిపారు. ప్రస్తుతం 130 పడకలతో ఆసుపత్రి ప్రారంభిస్తున్నామని,వచ్చే ఏడాది నాటికి 200 పడకల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించి నట్లు ఆయన తెలిపారు. అనంతరం రెండేళ్లలో 500 పడకలకు పెంచుతామన్నారు. అన్ని విభాగాలకు సంబంధించి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని, ఐసీయూ, శస్త్ర చికిత్స విభాగాలను పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా పారామెడికల్‌ విద్యను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఆరు నెలల్లో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. జీఎంఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా పేదలకు ఆర్థికసాయం అందించి ఇక్కడ సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిగిలిన వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు ఫౌండేషన్‌ ద్వారా అవగాహన కల్పించి వైద్య బీమా పథకంలో అందరినీ చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

అత్యాధునిక పరికరాలు
* అత్యాధునిక 4 శస్త్ర చికిత్స గదులు, అత్యవసర విభాగం అందుబాటులోకి తీసుకొచ్చారు.
* అత్యాధునిక సిటీ స్కాన్‌, డిజిటల్‌ ఎక్స్‌రే సమకూర్చారు.
* ఆటో ఎనలైజర్స్‌ ద్వారా అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించే వెసులుబాటు కల్పించారు. ఇక్కడ 100 నమూనాలను ఒకే సారి పరీక్ష చేయవచ్చు.
* సియోనెటాలజీ విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనిని చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

పేదలకు వూరట
జీఎమ్మార్‌ వరలక్ష్మి కేర్‌ ద్వారా పేదలకు 33 శాతం నుంచి 100 శాతం ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని గ్రంధి మల్లిఖార్జునరావు ప్రకటించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. విశాఖపట్టణంతో పోలిస్తే 30 శాతం తక్కువకే వైద్యం అందిస్తామని ఆయన ప్రకటించారు.

  • ==============================
Visit My Website - > Dr.Seshagirirao.com