Friday, July 1, 2011

Medical colleges in A.P. and India, భారతదేశము-ఆంధ్రప్రదేశె లో వైద్యకళాశాలలు



భారతదేశము లో వైద్య సేవలు వ్యాపారము గా మారిపోయినవి . కార్పోరేట్ హాస్పిటల్ పుట్టుకొచ్చి వైద్య ఖరీదు ను బాగా పెంచేసాయి. సామాన్యుడికి నిపుణుల వైద్యము అందడము లేదు . ప్రభుత్వము ఎన్ని ప్రజాసేవ పథకాలు పెట్తినా ప్రయోజనకు లేకపోతుంది . రోజు రోజుకి ప్రవేటు మెడికల్ కాలేజీలు పెరిగి్పోతున్నాయి. ఆ మేరకు విద్యా ప్రమాణాలు నాణ్యత తగ్గిపోతుంది .

భారతదేశంలో వైద్యవిధానం - స్థితిగతులు
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో వైద్యవిద్యకు సంబంధించిన పలు వైద్యకళాశాలలు, వైద్య విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ సహకారంతో ప్రాంభమైనాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పలు వైద్యకళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడుతున్నాయి. దీంతో దేశంలో వైద్యవిద్యారంగం చాలావరకు అభివృద్ధి చెందింది. దేశ అవసరాలకు అనుగుణంగా వైద్య విద్యాలయాలు ప్రారంభించబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో సమాజంలో ఏ మేరకు వైద్యవిధానం అమలవుతుందనే విషయాన్ని వైద్య నిపుణులను, వైద్య విద్యావేత్తలను, విద్యనందించే పలు విద్యాలయాలను...... సమాజం ప్రశ్నిస్తోంది. ఎంతటి మెరుగైన వైద్యసేవలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తోందని సమాజం ప్రశ్నిస్తోంది.

వైద్య వృత్తి అనేది గౌరవప్రదమైన వృత్తి. తమ వద్దకు వచ్చే రోగులకు న్యాయబద్దంగా, అత్యంత విలువైన వైద్యసేవలను అందించాలి. ఇది చాలా సాధారణమైన విషయం. దీనిని ప్రతి వైద్యుడు పాటించాల్సిన కనీస ధర్మమని అభిప్రాయపడాలి .

దేశంలో '''మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' '" గుర్తింపు కలిగిన వైద్యవిశ్వవిద్యాలయాలే వైద్యవిద్యను అందిస్తాయి. ఈ విశ్వవిద్యాలయాలలో ఎప్పటికప్పుడు విధివిధానాలను మార్పు చేస్తుంటుంది ఈ " ఎమ్‌సీఐ ". ఈ ఎమ్‌సీఐ వైద్యవిధానంలో తీసుకోవలసిన మార్పులు చేర్పులు, విధివిధానాలలో రూపాంతరం చేసేందుకు ప్రభుత్వ అనుమతిని తీసుకుంటుంటుంది. తమ దేశంలోనున్న న్యాయస్థానాలు ప్రజల ఫిర్యాదులకు అనుగుణంగా వారికి సహాయసహకారాలు కూడా అందిస్తుంటాయి .

వైద్యరంగంలో, వివిధ వైద్యరంగానికి చెందిన సలహా సంఘాల్లో, పరిశోధనా విభాగాల్లో, వైద్యవిద్యను బోధించడంలో, వైద్యులను ఎంపిక చేయడం, వైద్యరంగానికి చెందిన పలు అధ్యాపక సంఘాలలో సలహాలు పొందడము ఈ MCI పర్యవేక్షిస్తూ ఉంటుంది .

ప్రస్తుతం మన భారతదేశంలో వైద్యరంగానికి సంబంధించినంత మేరకు అత్యవసరమైనవ వాటిగురించి చెప్పదలచుకున్నాను...

** 1 వైద్య విద్యను బోధించే ఉపాధ్యాయులు, స్థానికంగా ఉండేటటువంటి వైద్యులు, విద్యార్థులు.
** 2 పరిపాలనాపరంగా మెరుగైన సెవలుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
** 3 ప్రైవేట్ వైద్యకళాశాలలు, విశ్వవిద్యాలయాలను క్రమబద్దీకరించడం తరచూ జరుగుతుండాలి.

మనదేశము లో :
దేశములో వైద్యకళాశాలల్ సంఖ్య =335 ( 01-జూలై 2011 నాటికి),
ప్రవేటు రంగము లో ఉన్న కళాశాలలు = 185.
ప్రభుత్వ రంగము లో ఉన్న కళాశాలలు = 150.
భారతదేశము లో మొత్తము మీద MBBS సీట్లు = 39785 ,

ఆంధ్రప్రదేశ్ రాస్ట్రం లో ప్రభుత్వ, ప్రైవేటు అధ్వర్యంలోని 36 వైద్యకళాశాలు ఉన్నాయి .



Medical colleges in Andhra pradesh

NTR health university portal
http://www.educationinfoindia.com/medical/andhramed.html
http://dme.ap.nic.in/dme_medcolleges.html
http://www.indiaedu.com/andhra-pradesh/colleges/med.htm


  • ========================================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -