Thursday, April 19, 2012

Scannig Centres in Srikakulam , శ్రీకాకుళం లో స్కానింగ్ సెంటర్లు


  • image : courtesy with Vijayalaxmi scanning center -Srikakulam

శ్రీకాకుళం లో సుమారు 77 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి . ప్రతి పట్టణము లోను , శ్రీకాకుళం టౌన్‌ లోనూ ఎక్కువగా ఉన్నాయి. 1989 లో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొద్టి స్కానింగ్ సెంటరు డా.వండానశేషగిరిరావు " విజయలక్ష్మీ స్కానింగ్ సెంటర్ " అనే పేరుతో చిన్నబరాటం వీదిలో డా. బి.టి.చెట్టి గారి సహాయముతో ప్రారంభంచారు . అప్పటికి జిల్లాలో అదే మొదటిది మరియు జిల్లా అంతటికీ ఒకేఒక్కటి. తరువాత మెడినోవా డయగ్నోస్టిక్స్ వారు 7 రోడ్ జంక్షన్‌ లో ప్రారంబంచారు .

స్కానింగ్ అనేది వ్యాధి నిర్ధాణకోసము చేసే ఒక పరీక్ష . దీనిలో ఉదరబాగము (Abdomibal Organs) , గుండె వ్యాధులుకోసము (Ecocardiogram ) మెదడు వ్యాధులకోసము (CTscan) , బాడీ స్కాన్‌(MRI) మున్నగునవి ఉన్నాయి.

స్కానింగ్‌ సెంటర్లను రేడియోలిస్ట్‌, ఆరు నెలలు శిక్షణ పొందిన వైద్యుల నేతృత్వంలోనే నిర్వహించాలన్నారు. సంబంధిత రికార్డులను ఎఫ్‌ఫాం ఫైల్స్‌లలో రోగుల తాలుకూ సమచారాన్ని పొందపర్చాలన్నారు. స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు జరపడం చట్టవిరుద్ధమని, స్కాన్ చేసినవారితో పాటు చేయించుకున్నవారు, వీరిని ప్రోత్సహించినవారు కూడా శిక్షార్హులని తెలిపారు.

స్కానింగ్‌ అంటే ఏంటి? దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు? దానివల్ల ఉపయోగాలేంటి?

అల్ట్రాసౌండ్‌ అంటే అతిధ్వనులు. అంటే చాలా హెచ్చు పౌనఃపున్యం గల ధ్వని తరంగాలు. తరంగాల పౌనఃపున్యాన్ని హెర్ట్‌జ్‌ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. 20 హెర్ట్‌జ్‌లు మొదలు 20వేల హెర్ట్‌జ్‌ల పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను మానవ చెవి గ్రహించి శబ్దాలు లేదా స్పీచ్‌గా స్వీకరిస్తుంది. 20 వేల హెర్ట్‌జ్‌లను మించిన పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను కంపనాల ద్వారా ఒక ప్రవాహిలో పుట్టిస్తారు. ఈ తరంగాలు ప్రవాహి గుండా ఒక అడ్డును ఢీకొన్నప్పుడు అందులో కొన్ని తరంగాలు పరావర్తనం చెంది మరికొన్ని అడ్డుగుండా దూసుకుని వెళ్లిపోతాయి. ఈ తరంగాలను ఉత్పత్తి చేసిన ట్రాన్స్‌డ్యూసర్‌ వెనుతిరిగి వచ్చిన తరంగాలను గ్రహించగల్గుతుంది. ఈ విధంగా అడ్డుగా నిలిచిన వస్తువు ప్రతిబింబాన్ని ఈ పరావర్తన తరంగాలు ఏర్పరుస్తాయి. ఘనరూపంలో వుండే వస్తువుల ప్రతిబింబాలు కాంతివంతంగా కన్పిస్తాయి. తక్కువ సాంద్రత గల వస్తువుల ప్రతిబింబాలు నల్లగా కన్పిస్తాయి. ఈ ప్రతిబింబాలను బట్టి అడ్డుగా వచ్చిన వస్తుసాంద్రతను కూడా తెలుసుకోవచ్చు.

అతిధ్వనుల పరిణామక్రమం

గబ్బిలాలు అతిధ్వని సాంకేతిక శాస్త్రాన్ని వినియోగించుకుని ఎగురుతాయి. టైటానిక్‌ సముద్రంలో మునిగిపోయినప్పుడు దాని ఉనికి తెలుసుకునేందుకు ఈ అతిధ్వనుల టెక్నిక్‌ను ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ అతిధ్వనులను ఉపయోగించి సముద్రంలో మునిగిన సబ్‌మెరైన్లను గుర్తించి నాశనం చేశారు. 1950లో స్కాట్లాండ్‌కు చెందిన ప్రొఫెసర్‌ లాన్‌ డోనాల్డ్‌ గర్భిణీలపై తొలిసారిగా ఈ అతిధ్వనులు ప్రయోగించి ఆమెకు స్కానింగ్‌ చేశాడు. ఒక స్థూపాకారపు పాత్రలో నీరు నింపి గర్భిణీని అందులో ఉంచి స్కాన్‌ చేశాడు. వచ్చిన చిత్రాలు నలుపు తెలుపుగా వున్నాయి. భారీ నిర్మాణం యొక్క వెలుపలి గీతలు మాత్రమే కన్పించాయి. 1870లో ప్రొఫెసర్‌ వెల్స్‌ దీనిని బాగా అభివృద్ధి పరిచి గ్రేస్కేలు రూపొందించాడు. దీనివల్ల శరీరంలోని వేరు వేరు కణాలను కూడా ఇది గుర్తించగల్గుతుంది. దీని సహాయంతో శరీరంలోని అంతర్గత అవయవాల యొక్క ప్రామాణిక చిత్రాలను తీయగలిగారు. వీటి సహాయంతో ఎవరికైనా స్కాన్‌ చేసినప్పుడు వారి శరీరంలోని అసాధారణాలను, రోగాలను గుర్తించగలిగేవారు.

స్కానింగ్‌ యంత్రాలు

తొలి రోజుల్లో ఆవిర్భవించిన స్కానింగ్‌ యంత్రాలు శరీర అంతర్భాగాల్లోని చిత్రాలను స్పష్టంగా, వివరంగా తీయగలిగాయి. కానీ ఈ చిత్రాలు చాలా పెద్దవిగా ఉండి, కదల్చడానికి వీలులేనివిగా ఉండేవి. కాలక్రమేణా కొత్త కొత్త స్కానింగ్‌ యంత్రాలు ఆవిర్భవించాయి. ఇప్పుడు వీటి సహాయంతో గర్భిణీ కడుపులోని శిశువు వివరాల్నీ తెలుసుకోగల పరిస్థితి ఉత్పన్నమైంది. గర్భస్థ శిశువు శ్వాస, కదలికలు, గుండె కొట్టుకునే రేటు, రక్తప్రవాహ తీరు వీటన్నింటిని అధ్యయనం చేయడం సాధ్యమౌతోంది. ట్రాన్స్‌డ్యూసర్‌ లేదా ప్రోబ్‌ విద్యుత్‌ శక్తిని హెచ్చు పౌనఃపున్యం గల ధ్వనిగా మార్పు చెందించి ధ్వని తరంగాలను గర్భిణీ శరీరంలోకి పంపడమే గాక తిరిగి వచ్చే ప్రతిధ్వనులను అతిధ్వని ప్రతిబింబాలుగా మార్చి తెరమీద చూపించగల్గుతున్నాయి.

చిత్రం ఎలా తయారవుతుంది?

శరీరంపై ప్రోబ్‌ ఉంచుతారు. ఇది అతిధ్వని తరంగాలను శరీరంలోకి పంపి పరీక్ష చేయవలసిన ప్రాంతంలోకి వెళ్లి అక్కడ అడ్డులను డీకొని తిరిగి ప్రతిధ్వని తరంగాలుగా వెనుదిరిగి వస్తాయి. ఈ ప్రతిధ్వని ఒక చుక్కగా ఎలక్ట్రానికల్‌గా మారి తెరమీద కన్పిస్తుంది. ఇటువంటి అనేక చుక్కలు కలిసి తెరమీద చిత్రాన్ని ఏర్పరుస్తాయి. చిత్రంలోని నలుపు - తెలుపు గీతలు పరిశీలిస్తే నలుపు గీతలు ప్రవాహి తాలూకు చిత్రంగానూ, తెలుపు గీతలు ఎముకలు వంటి కణాలవిగానూ గుర్తిస్తారు.

స్కానింగ్‌ ఎందుకు?
  • image : courtesy with prajasakti news paper.

గర్భిణీలకు స్కానింగ్‌ ఒక వరం. స్కానింగ్‌ వల్ల ప్రసవం ఎప్పుడు అయ్యేది తెలుస్తుంది. గర్భస్థ శిశువులో అవయవ లోపాలు ఉంటే తెలుస్తాయి. గర్భంలో ఉన్నది కవలలా, ఇంకా ఎక్కువమంది ఉన్నారా? అనే విషయం తెలుస్తుంది. గర్భస్థ శిశువుకు అంతర్గతంగా శారీరకంగా ఉండే అనేక విషయాలు తెలుస్తాయి. గర్భస్థ శిశువుకు ఉండే జన్యులోపాలు, క్రోమోజోముల్లో అసాధారణత్వం వంటివి వెల్లడవుతాయి. గర్భంలో ప్లాసెంటా స్థానాన్ని సరిచూసేందుకు స్కానింగ్‌ ఉపయోగపడుతుంది. ప్లాసెంటా గర్భంలో కిందికి ఉంటే గర్భాశయం నుండి బిడ్డ బయటికి వచ్చే మార్గాన్ని ఇది మూసేస్తుంది. ప్లాసెంటా ఇలా మార్గాన్ని మూసేస్తే నొప్పులు, వాటి ఫలితంగా విపరీత రక్తస్రావం జరుగుతుంది. సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది.

జీవసంబంధిత ఫలితాలు

శక్తి ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. అదే విధంగా అల్ట్రాసౌండ్‌ (అతిధ్వని) కూడా ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ వేడి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఈ లక్షణాన్ని ఉపయోగించి ఫిజియోథెరపిస్టులు తమ వైద్యచికిత్సలో ఈ ఉష్ణాన్ని వాడుకుంటున్నారు. ప్రసవానంతరం పెరీనియంను జాగ్రత్తగా ఉంచడంలో ఈ వైద్యచికిత్స చేస్తున్నారు. స్కానింగ్‌తో రోగనిర్ణయం కోసం ఉపయోగిస్తున్న ఈ అల్ట్రాసౌండ్‌ పూర్తిగా క్షేమదాయకమని అనేక అధ్యయాల్లో వెల్లడయింది. దీన్ని ప్రత్యేక అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలి. ఇతర పనులకు దీన్ని వాడకూడదు. స్కాన్‌ చేసేవారికి తగిన శిక్షణ అవసరం. తెరపై కన్పించే ప్రతి బింబాన్ని సరిగా వివరించగల నేర్పరితనం అవసరం. గర్భిణీకి స్కానింగ్‌ ఏ విధమైన నొప్పినీ కలుగజేయదు. అల్ట్రాసౌండ్‌ పరికరంతో గర్భస్థ శిశువుకు రోగనిర్ణయమే కాక చికిత్స కూడా సాధ్యమౌతోంది. తల్లి గర్భస్థ శిశువుల రక్తం పొసగని రీతిలో ఉంటే శిశువులో రక్త హీనత వస్తుంది. స్కానింగ్‌ లో ఈ విషయం తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో గర్భస్థ శిశువుకు 'బ్లాడర్‌' లో సమస్యలు ఎదురవుతాయి. నీరుడు బయటకు వచ్చేందుకు వీలులేక అది వెనుకను తన్ని మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. అల్ట్రాసౌండ్‌ పరికరంతో బ్లాడర్‌ నుండి బిడ్డ చుట్టూ ఉండే ద్రవపదార్థాలకు చిన్న షంట్‌ ఏర్పాటు చేస్తారు. ప్రసవం అయ్యేవరకు ఈ ఏర్పాటు వల్ల గర్భస్థ శిశువు మూత్రపిండాలకు హాని ఉండదు. ఆ తరువాత బిడ్డకు సంపూర్ణంగా చికిత్స చేస్తారు.

గర్భస్త శిశువుకు స్కానింగ్‌ హాని చేస్తుందా?

గర్భవతికి స్కానింగ్‌ చేయిస్తే, గర్భస్థ శిశువు మీద ఆ ప్రభావం ప్రసరించి, శిశువుకు హాని కలుగుతుందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ, ఆ మాట వాస్తవం కాదు. అది కేవలం వారి అపోహ మాత్రమే. గర్భస్థ శిశువు సక్రమంగా ఉన్నదా లేదా, ఎదుగుదల ఏ విధంగా ఉన్నదీ, గర్భస్థ శిశువు ఇబ్బందులను గుర్తించి, వాటిని నివారించేందుకు తోడ్పడుతుంది స్కానింగ్‌. స్కానింగ్‌ చేయడం వల్ల గర్భిణికి కానీ, గర్భస్థ శిశువుకు కానీ ఎటువంటి అనారోగ్యమూ కలుగదు.

గర్భం ధరించినప్పటి నుంచీ, తొమ్మిది నెలల వరకూ డాక్టరు సలహాపై స్కానింగ్‌ చేయించుకోవచ్చు. స్కానింగ్‌ చేయడం వల్ల, గర్భసంచీలోపల ఉన్న శిశువు పరిస్థితిని గర్భసంచిలోపల ఉన్న గోడలు శిశువునకు అనుకూలంగా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. అల్ట్రా సౌండ్‌ తరంగాలు, ఉమ్మనీటితో తేలే గర్భస్థ శిశువును చక్కగా గుర్తించి, బిడ్డ గురించిన సమాచారాన్ని అందజేస్తాయి. గర్భిణికి నాలుగు నెలలు దాటిన తర్వాత స్కానింగ్‌ చేయించినట్లయితే, గర్భస్థ శిశువు సక్రమంగా వయసు తగినట్లుగా ఎదుగుతున్నాడా లేదా అవయవాల గురించి వివరాలన్నింటినీ తెలుసు కోవచ్చును. ఆ సమయంలో ఉమ్మనీరు అధికంగా ఉన్నదీ, లేనిదీ తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టవచ్చు. స్కానింగ్‌ చేయడం వల్ల గర్భస్థ శిశువు కదలికలే కాక, ఏవయినా వ్యాధులుంటే ముందుగానే గుర్తించి చికిత్స చేయించవచ్చు. ఉమ్మనీరు లోపం ఏర్పడితే ఆ నీటిని పెంచేవిధంగా డాక్టరు చికిత్స జరిపిస్తారు.

ఉమ్మనీటిశాతం తగ్గితే బిడ్డకు ప్రాణపాయం ఏర్పడవచ్చు. అంగవైకల్యం లాంటివి గుర్తించి, తగిన చర్యలు తీసుకోటా నికి స్కానింగ్‌ ఉపయోగపడుతుంది. గర్భసంచీలో ఎదయినా ఇబ్బందులు, సమస్యలు ఏర్పడినట్లయితే ముందుగానే గుర్తించి, గర్భస్రావం కాకుండా నివారించవచ్చు. అయితే , పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అన్న విషయాన్ని తల్లిదండ్రులకు ముందుగా తెలియ చేయడమన్నది చట్టవిరుద్ధం. లింగ నిర్దారణ పరీక్షలను ప్రభుత్వం నిషేధించింది.

నెలలు పూర్తవుతూ, ప్రసవపు తేదీ దగ్గర పడుతూంటే, డాక్టరు ఆదేశాను సారం, స్కానింగ్‌ చేయించు కోవడం వల్ల తల్లి, శిశువు పరిస్థితిని అర్ధం చేసుకునే వీలుంటుంది. ముఖ్యంగా గర్భస్థ శిశువు అవయవాలు, శిశువు ఎదుగుదల, శిశువు ఏ పొజిషన్‌లో ఉన్నదీ, రక్తప్రసరణ, బొడ్డు తాడు మెడకు చుట్టుకోవడం, శిశువు ఎదురుకాళ్ళతో బయటకు రావడానికి చేరడం లాంటి చర్యలను నివారించి, కానుపు సవ్యంగా జరిగేం దుకు, గర్భస్థ శిశువు ప్రాణానికి హాని కలుగకుండా నివారించే అవకాశం ఉంటుంది. ఆధునిక వైద్య విధానాన్ని అనుసరించి గర్భిణీ స్త్రీ స్కానింగ్‌ చేయించు కోవడం వల్ల హాని కలుగక పోగా మేలే జరుగుతుందని తెలుసు కోవాలి.
Scanning centers in Srikakulam Town: తేదీ : 02/02/2014..

 వరుస సంఖ్య --- స్కానింగ్ సెంటర్ పేరు --------------- అడ్రస్
  1. రఫా స్కానింగ్ & మెడికల్ సెంటర్  -----------డే & నైట్ జం. ,రైతుబజార్ రోడ్ ,ఆపోజిట్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసు (Dr.Baburao-DMRD), Ph: 08942-651214
  2. శ్రీకృష్ణ స్కాన్స్ --------------------------------------ఆర్ట్స్ కాలేజీ రోడ్ , ఆపోజిట్ కోడిరామమూర్తి స్టేడియం(డా.పేడాడ క్రిష్ణ DMRD). ph: 9440121476.
  3. సిందూరా డయాగ్నోస్టిక్స్ .----------------------.డే & నైట్ .జం. న్యూబ్రిడ్జ్ రోడ్(2014 లో ప్రారంభం(P.B.Kameswararao-MS(ENT) .ph:08942-228455
  4. శ్రీ వెంకటేస్వర స్కాన్‌ సెంటర్ .-------------------- ఫారెస్ట్ ఆఫీసు ఎదురుగా(తిరుమల మెడికల్ సెంటర్ వెనుక) డే & నైట్ జం. ,రైతుబజార్ రోడ్(Dr.Sandeep Kumar-MBBS , DNB (radiology)(02-02-2014.opened) , ph:08942-645745 
  5. Aditya scan center --------------------------- Govt.Arts college Rd.Near SBI(adb) ,(Dr.B.Lavakumar-MD.DMRD)opened in Nov/2013.
  • =====================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -