Tuesday, May 15, 2012

P.G.medical education ,పి.జి.వైద్య చదువుల సమాచారము



రాష్ట్రంలో యాజమాన్య కోటా కింద పీజీ వైద్యసీట్లు దాదాపు 550 వరకున్నాయి. వీటిలో ప్రధానంగా రేడియాలజీ, ఆర్థోపెడిక్‌, గైనకాలజీ, డెర్మటాలజీ, పిడియాట్రిక్స్‌, పల్మనాలజీ విభాగాలకు డిమాండ్‌ ఉంది. ఈ సీట్లకు ప్రభుత్వం ఏడాదికి రూ.5.50 లక్షల ఫీజు నిర్ణయించినా, యాజమాన్యాలు మాత్రం ఒక్కో సీటుకు కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం ఎంబీబీయస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రతిభను దృష్టిలో ఉంచుకుని యాజమాన్య కోటా కింద సీట్లు భర్తీ చేయాలి. కానీ ప్రైవేటు వైద్యకళాశాలల్లో ఈ నిబంధనలను పట్టించుకుంటున్న పరిస్థితులు లేవు. దీనిపై కొన్నేళ్లుగా ఆరోపణలున్నా, ఈసారి మాత్రమే ఎంసీఐకి పూర్తిస్థాయి ఆధారాలతో ఫిర్యాదులు అందడంతో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. దీంట్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు వైద్యకళాశాలల్లో గత ఏడాది జరిగిన పీజీ ప్రవేశాలు, అందులో సీట్లు పొందిన విద్యార్థులను కూడా కమిటీ విచారించనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గతంలో జరిగిన పీజీ కోర్సు ప్రవేశాలపై కూడా ఎంసీఐ చర్యలు తీసుకోవచ్చని సమాచారం. దీంతో ప్రైవేటు వైద్యకళాశాలల యాజమాన్యాలు విచారణను మొక్కుబడిగా ముగించడానికి రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకొచ్చే పనిలో పడినట్లు తెలుస్తోంది.


The total Number of PG seats = 1085 (as on 13March 2008) .

9 Govt. and 5-pravate medical colleges. Govt.college seats = 665.

private college seats = 149.

management quota seats = 132.

pending for IMC approval seats = 139.

Total = 1085

Note : in the year 2008 total Number of Students appeared = 5960. Selected for councelling = 3680.

పీజీ మెడికల్‌లో అదనంగా 170 సీట్లు(Date: 15/04/2012)

విజయవాడ: పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఈ ఏడాది కొత్తగా మూడు ప్రభుత్వ కళాశాలల్లో 26, 16 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 144 సీట్లు అదనంగా వచ్చి చేరాయి. దీంతో ప్రభుత్వ కళాశాలలో 1139, ప్రైవేటు వైద్య కళాశాలలో 1174 సీట్లతో కలిపి 2313 సీట్లను అందుబాటులో ఉంచగా, ప్రైవేటు కళాశాలలో 594 సీట్లను(50శాతం) మాత్రమే యూనివర్సిటీ కన్వీనర్ కోటాలో భర్తీ చేయనుంది. సోమవారం నుంచి ఈమేరకు కౌన్సిలింగ్ జరగనుంది.

NTR Helth University.com
  • ====================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -