Monday, July 16, 2012

ఫార్మశీ కోర్సులు అవగాహన - Pharmacy courses Awareness,ప్రకాశిస్తున్న ఫార్మసీ


  • Pharmacy courses Awareness
ఇంజినీరింగ్‌, మెడికల్‌ కోర్సులు కాకుండా మేలైన ఇతర కోర్సుల కోసం అన్వేషించేవారికి ఫార్మసీ ఓ ప్రత్యామ్నాయం. 1950లో 10 కోట్ల టర్నోవర్‌ కలిగిన భారత్‌ ఫార్మా పరిశ్రమ గత ఏడాది 1.10 లక్షల కోట్ల రూపాయలు దాటింది. ఉపాధి సాధనకు బహుముఖ అవకాశాలున్న ఈ కోర్సు విశేషాలూ, ప్రవేశాలకు అవసరమైన ఎంసెట్‌ ర్యాంకుల వివరాలూ తెలుసుకుందాం!

రాబోయే పదేళ్లు ఫార్మా రంగానికి స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. అందుచేతనే ఫార్మసీ డిగ్రీని విదేశాలలో ఉన్నత విద్యనందించే 'రెడీమేడ్‌ పాస్‌పోర్టు'గా ఫార్మసీ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సాంప్రదాయిక కోర్సులకు ఉద్యోగావకాశాలు అడుగంటుతున్న నేటి తరుణంలో చాలామంది ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ ఆశాజ్యోతి ఫార్మసీ డిగ్రీ అని చెప్పవచ్చు.

మనిషి మనుగడ ఉన్నంత కాలం, అనారోగ్యాలు వెన్నాడుతున్నంత కాలం.. ఫార్మసీ రంగానికి మాంద్యం ఉండదు. గతంలో ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది కంప్యూటర్‌, సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌, మౌలిక వసతుల రంగాల్లోని వారు ఉద్యోగాలు కోల్పోయారు. కానీ అప్పుడు కూడా ఫార్మా రంగంలోని వారికి ఆ సెగ తగలకపోవడం విశేషం. అందుకనే నేడు వేలమంది ఇంటర్‌ విద్యార్థులు ఫార్మా కోర్సుల వైపు ఆసక్తి చూపుతున్నారు.

ఇంటర్‌లో ఎంపీసీ, బైపీపీ - రెండు గ్రూపుల వారూ చేరగలిగిన కోర్సు ఫార్మసీ!
  • ఫార్మసీలో మూడు రకాల కోర్సులు ఉన్నాయి.
* డి. ఫార్మసీ (2 సంవత్సరాలు)
* బి. ఫార్మసీ (4 సంవత్సరాలు)
* ఫార్మా.డి (6 సంవత్సరాలు).
చివరి రెండు కోర్సుల్లో సగం సీట్లు ఇంటర్‌ ఎంపీసీ వారికీ, మిగిలిన సగం బైపీసీ వారికీ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ప్రాతిపదికపై కేటాయిస్తారు.
  • బి. ఫార్మసీలో ఏం చెబుతారు?
ఈ కోర్సులో ఫార్మా పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలు ఎక్కువగా ఉంటాయి. ఔషధాల తయారీ, వాటి నాణ్యత, విశ్లేషణ మొదలైన అంశాలు బోధిస్తారు. కోర్సులో భాగంగా ప్రతి విద్యార్థికీ 30- 45 రోజుల ప్రాయోగిక శిక్షణ (ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌) ఫార్మా పరిశ్రమలో తప్పనిసరి. మనదేశంలో బి. ఫార్మసీ ఇండస్ట్రీ ఓరియంటెడ్‌గా ఉండటం వల్ల ఇక్కడి ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు అన్ని దేశాలలో గిరాకీ ఉంది.
  • బి.ఫార్మసీ కాలేజీలు - సీట్లు
మనదేశంలో 1180 ఫార్మసీ కళాశాలలు ఉండగా వాటిలో సుమారు 85 వేల బి.ఫార్మసీ సీట్లు ఉన్నాయి. వీటిలో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన కళాశాలలు 748 మాత్రమే. మనరాష్ట్రంలో 7 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండగా వాటిలో 2 యూనివర్సిటీలు ఆంధ్రా రీజియన్‌లో, 3 తెలంగాణాలో, 2 రాయలసీమలో ఉన్నాయి. వీటిలో 360 బి.ఫార్మసీ సీట్లున్నాయి. ఒక డీమ్డ్‌ యూనివర్సిటీలో 60 సీట్లున్నాయి.

రాష్ట్రంలో 292 ప్రైవేటు ఫార్మసీ కళాశాలలు ఉండగా వాటిలో 29200 సీట్లున్నాయి. వీటిలో 169 కళాశాలలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో, 87 ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో, 36 కాలేజీలు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి.
  • ఫార్మా.డి. కాలేజీలు
మనదేశంలో 87 ఫార్మా.డి. కళాశాలలకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది. వీటిలో 32 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. 16 తెలంగాణాలో, 10 ఆంధ్రా ప్రాంతంలో, 6 రాయలసీమలో ఉన్నాయి. ఒక్కో కళాశాలలో 30 సీట్లు మాత్రమే ఉంటాయి.
ఫార్మా.డి (డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ)
ఆరేళ్ల ఫార్మా.డి. కోర్సు పూర్తిగా క్లినికల్‌ ఓరియంటెడ్‌గా ఉంటుంది. ఈ కోర్సులో క్లినికల్‌ ఫార్మసీ, డ్రగ్‌ ఇన్ఫర్మేషన్‌, పేషెంట్‌ కౌన్సెలింగ్‌, ఫార్మకో కైనిటిక్స్‌, ఫార్మకో డైనమిక్స్‌ వంటి అంశాలు బోధిస్తారు.

ఫార్మా.డి. విద్యార్థులకు 2,3,4 సంవత్సరాల్లో తరగతి లెక్చర్లతో పాటు ఆస్పత్రి సందర్శనలు కూడా ఉంటాయి. ఐదో సంవత్సరంలో ప్రతిరోజూ ఉదయంపూట ఆస్పత్రిలో పేషెంట్‌ బెడ్‌ సైడ్‌ రౌండ్లు ఉంటాయి. ఆరో సంవత్సరం పూర్తిగా ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేయాలి.

అందుచేతనే ప్రతి ఫార్మా.డి. కాలేజీకి కనీసం మూడొందల పడకలు గల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో ఒప్పందం ఉండాలి. ఈ ఫార్మా.డి. కోర్సుని మనదేశంలో 2008లో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. మొదటి ఫార్మా.డి. బ్యాచి 2014లో కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తోంది.

  • మన రాష్ట్రంలో...
భారత్‌లో తయారవుతున్న ఔషధ పదార్థాల్లో మూడో వంతు ఆంధ్రప్రదేశ్‌లో తయారవుతుండటం విశేషం. అలాగే ఫార్మా ఫార్ములేషన్లు, ఫార్మా బయోటెక్‌ రంగాల్లో కూడా మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది. అంతర్జాతీయంగా పేరొందిన ఫార్మా సంస్థలు మన రాష్ట్రంలో ఉండటం వల్ల ఫార్మసీ చదివినవారికి మనరాష్ట్రంలో అవకాశాలు ఎక్కువ.
  • ఔషధ పరిశోధనలు
వీటిలో క్లినికల్‌ రీసెర్చి అత్యంత కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ట్రయల్స్‌ జరుగుతుంటే భారత్‌లో 1200 క్లినికల్‌ ట్రయల్స్‌ మాత్రమే జరుగుతున్నాయి. ఈ ట్రయల్స్‌ జరపటానికి మనది చాలా అనుకూలమైన దేశం. త్వరలో అనేక వేల క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లో మొదలు కానున్నాయి. ఈ పరిశోధనల నిమిత్తం వేలమంది ఫార్మారంగ నిపుణులు ముఖ్యంగా ఫార్మా.డి. చదివినవారు అవసరమవుతారు.

  • ఔషధ నియంత్రణ శాఖలో...
కేంద్ర, రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగాల్లోని డ్రగ్స్‌ ఇన్స్‌పెక్టర్‌ ఉద్యోగానికి ఫార్మసీ చదివినవారు మాత్రమే అర్హులు. ఇవేకాక ప్రభుత్వ రంగంలోని గవర్నమెంట్‌ ఎనలిస్టు, డ్రగ్‌ ఎనలిస్టు, కెమికల్‌ ఎగ్జామినర్‌ ఉద్యోగాలకు కూడా ఫార్మసీ వారికి ప్రాధాన్యం ఇస్తారు. కల్తీ మందులు అరికట్టడంలో, ఔషధాల నాణ్యత పరీక్షించి వాటిని సరసమైన ధరలకు అందేట్లు చూడటంలో డ్రగ్స్‌ ఇన్స్‌పెక్టర్లు కీలకపాత్ర వహిస్తారు.

ఇటీవల 40 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ నివేదికలో నూతన ఔషధాలకు అనుమతులు జారీ చేయటంలో జరిగిన అవకతవకలను ఎత్తి చూపారు. ఈ లోటుపాట్లు సరిదిద్దటానికీ, కల్తీ మందులు అరికట్టటానికీ దేశవ్యాప్తంగా కొన్ని వేల డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో రానున్నాయి.

  • ఇతర అవకాశాలు...
ఫార్మసీ చదివినవారికి కమ్యూనిటీ ఫార్మసిస్టుగా, హాస్పిటల్‌ ఫార్మసిస్టుగా, అప్రూవ్డ్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ లేబటెరీలో క్వాలిటీ కంట్రోల్‌ కెమిస్టులుగా దేశ విదేశాల్లో అవకాశాలున్నాయి. మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు ఫార్మా మార్కెటింగ్‌, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌లో రాణిస్తారు. ఫార్మా రెగ్యులేటరీ, ఫార్మకో విజిలెన్స్‌, క్లినికల్‌ డేటా ప్రాసెసింగ్‌లలో చాలా ఉద్యోగాలు ఫార్మసీ చదివినవారి కోసం ఎదురుచూస్తున్నాయి.
  • మంచి కళాశాల ఎంపిక ఎలా?
1. ఫార్మసీ కళాశాలకు స్వయంగా వెళ్ళి అక్కడి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి ఆ విద్యాసంస్థ ప్రమాణాలు తెలుసుకోవటం మంచిది.

2. అనుభవజ్ఞుడైన ప్రిన్సిపల్‌, సీనియర్‌ అధ్యాపకులు ఉన్న కళాశాలలను ఎంచుకోవటం ఉత్తమం.

3. గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం, జీప్యాట్‌లో ర్యాంకులు సాధించినవారి వివరాలు, ప్రాంగణ నియామక ఇంటర్వ్యూలు, పారిశ్రామిక సందర్శనలు ఉన్న కళాశాలలు మేలు.

4. ఫార్మా పరిశ్రమలోని నిపుణులతో లెక్చర్లు ఇప్పించే కళాశాల వైపు మొగ్గు చూపటం శ్రేయస్కరం.

5. పారిశ్రామిక శిక్షణలు, ఇతర ప్రత్యేక శిక్షణలను ఏర్పాటు చేసే కళాశాలలు ఉత్తమమని చెప్పవచ్చు.


-- Courtesy with Dr.Venkatareddy - director Sri datta pharmacy college




ఫార్మాలో రెండేళ్ల ఎం.ఎస్‌.

అటు ఇంజనీరింగ్‌ (ఈ) కేటగిరిలోకి, ఇటు అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌(ఎఎం) కేటగిరిలోకి కూడా వచ్చే కోర్సు ఫార్మశీ. ఈ కోర్సుకు బై.పి.సి, ఎంపిసి విద్యార్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వాతావరణ పరిస్థితుల కారణంగానో తీసుకొనే ఆహారం కారణంగానో ఆరోగ్య సంబంధమైన సమస్య లు ఉత్పన్నం కావడం సాధారణం అయి పోతున్న నేపథ్యంలో వైద్యులు అవసరమూ ఎక్కువుతోంది. ప్రాథమిక శాస్త్రీయ సిద్ధాంతాలను వ్యాధి లక్షణాలకు అనువర్తింప జేయడం ద్వారా కొత్త పాత్ర వహించే వాడు ఫార్మసిస్ట్‌. మందుల, పరిశోధన, రూపకల్పన, తయారీ అభివృద్ధి మొదలైన ముఖ్యమైన అంశాలపై కృషి చేసే సుశిక్షతులను ఔషధ రంగానికి అందించే కోర్సు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మశి. ఈ కోర్సుకాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. బి.పార్మసి చేసిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోని వివిధ డిపార్టు మెంటులలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌,డ్రగ్‌ ఎనలిస్ట్‌, డ్రగ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ వంటిఉద్యోగాలలో ప్రవేశిం చవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రు లలో హాస్పిటల్‌ ఫార్మసిస్ట్‌,క్లినికల్‌ ఫార్మసిస్ట్‌ హాస్పిటల్‌ మాన్యుఫాక్చ రింగ్‌ ఫార్మసిస్ట్‌

ఉద్యోగాలు పొంద వచ్చు.

ఈ కోర్సు చేసినవారికి స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విస్తరిస్తున్న మందుల పరిశ్రమలకు అవసర మయ్యే వివిధ రకాల ఉత్పత్తులు క్యాప్య్సూల్స్‌ (గొట్టాలు), సీసాల (యాంపుల్స్‌ వంటివి) తయారు చేసే ఆక్జిలరీ యూనిట్లు స్థాపించుకోవచ్చు. వివిధ కంపెనీలకు ట్రయల్‌ ప్రొడక్ట్స్‌ అందించే ప్లాంట్లను ఏర్పరచు కోవచ్చు. పెద్ద కంపెనీలకు అవసరమయ్యే జాబ్‌వర్క్‌ చేసి ఇచ్చే కుటరీ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. రీ ప్యాకింగ్‌ యూనిట్లు కూడా మంచి లాభదాయంగా ఉంటాయి.

భారతదేశంలో ఫార్మా పరిశ్రమ బాగా విస్తరిస్తోంది. అదే సమయంలో ఈ రంగం నిపుణులైన అభ్యర్థుల కొరతను ఎదుర్కొంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లోని ఏలియన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ ఫార్మాస్యూటికల్‌ అండ్‌ హెల్త్‌ సైన్సెస్‌, జేఎన్‌టీయూ (హైదరాబాద్‌)తో కలిసి రెండేళ్ల ఎం.ఎస్‌. ప్రోగ్రామ్‌లను రూపొందించింది. ఈ సంస్థ ఫార్మా పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూడు రకాల స్పెషలైజేషన్లతో ఎం.ఎస్‌. కోర్సులను అందిస్తోంది. అవి...

* ఇండస్ట్రియల్‌ ఫార్మాస్యూటిక్స్‌
* ఫార్మాస్యూటికల్‌ ఎనాలిసిస్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌
* డ్రగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేటరీ ఎఫైర్స్‌

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. బైలేయర్‌ ట్యాబ్‌లెట్‌ మెషీన్‌, ప్లానెటరీ మిక్సర్‌, వి బ్లెండర్‌, గ్రాన్యులేటర్‌, ప్రత్యేక హెచ్‌పీఎల్‌సీ ల్యాబ్‌, తదితర ఆధునిక పరికరాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. రెగ్యులేటరీ ఎఫైర్స్‌ స్పెషలైజేషన్‌తో ఎం.ఎస్‌. ఫార్మా కోర్సులు మనదేశంలో చాలా తక్కువ సంస్థల్లో ఉన్నాయి.

బోధనలో ఫార్మా కంపెనీలకు చెందిన ప్రముఖులు పాలుపంచుకుంటారు. పరిశ్రమల సందర్శన శిక్షణలో ముఖ్య భాగం. కోర్సు రెండో ఏడాదిలో ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాలి. ఎం.ఎస్‌. కోర్సులో ప్రవేశం కోసం జేఎన్‌టీయూహెచ్‌ ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష 9 ఆగస్టు 2012న జేఎన్‌టీయూలో జరగనుంది. ఇతర వివరాలు జేఎన్‌టీయూహెచ్‌ లేదా ఏలియన్స్‌ ఇనిస్టిట్యూట్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయి



1 Govt.Polytechnic for Women Srikakulam
2 Sri Venkateswara College of Pharmacy -Sri Venkateswara College of Pharmacy
Etcherla-532402, Srikakulam Dist., Phone: 9440322016 , Email: svcp@hotmail.com

2 Sri Sivani College of Pharmacy--NH-5, Chilakalapalem Jn, Etcherla (M), Srikakulam - 532 402.
Phone: 08942-231263/ 9704012603 ,principal_da@yahoo.com-mbvraju@yahoo.co.in


  • ==================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

వ్యవసాయ బీఎస్సీ కోర్సుల అవగాహన 2012, AgBsc coures Awareness 2012





వ్యవసాయ బీఎస్సీ కోర్సుల సీట్లకు తీవ్ర కొరత .డిమాండ్‌ అధికం.. సీట్లు స్వల్పం ---రాష్ట్రంలో ఉన్నవి 620. గతేడాది 11 వేల మంది పోటీ .17 రెట్ల అధిక డిమాండ్‌
సీట్లు, కళాశాలల పెంపుపై శ్రద్ధ చూపని సర్కారు
-
వ్యవసాయ అభివృద్ధే తమ ధ్యేయమని నిరంతరం చాటుకునే ప్రభుత్వం... రైతులకు సాయపడే వ్యవసాయ విద్యపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ డిగ్రీ కోర్సుల సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. వీటికి పోటీపడే విద్యార్థుల సంఖ్య చాలా అధికంగా (17 రెట్లు ఎక్కువ) ఉంటోంది. రాష్ట్రంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 8 కాలేజీల్లో 'వ్యవసాయ బీఎస్సీ'(ఏజీ బీఎస్సీ) కోర్సును నిర్వహిస్తోంది. గతేడాది వరకూ సీట్లు కేవలం 500 మాత్రమే ఉండగా ఈ విద్యాసంవత్సరం నుంచి మరో 120 పెంచడానికి సర్కారు తాజాగా అనుమతించింది. అంటే మొత్తం 620 కాగా ఇందులో 40 శాతం మాత్రమే రైతుల పిల్లలకు రిజర్వుచేశారు. వాస్తవానికి గతేడాది 500 సీట్లకు 11 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఎంసెట్‌లో 7 వేలలోపు ర్యాంకు వస్తే తప్ప ఏజీ బీఎస్సీ సీటు ఓపెన్‌ కేటగిరిలో రాని పరిస్థితి నెలకొంది. ఈ డిగ్రీ కోర్సు నిర్వహణకు కనీసం మరో వెయ్యి సీట్లు అదనంగా పెంచాలని ఐదేళ్ల క్రితమే విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి విన్నవించింది. కళాశాలల సంఖ్య పెంపునకు కూడా ప్రభుత్వం ఇష్టపడటం లేదు. ఉన్న కాలేజీల్లో కూడా కనీస సౌకర్యాలు లేవు. పాఠ్యాంశాల బోధనకు ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. వాటి భర్తీకి కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఉదాహరణకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో వ్యవసాయ కాలేజీ పెట్టి 20 సంవత్సరాలు దాటినా ఇంతవరకూ పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించలేదు. జగిత్యాల, రాజమండ్రి, మహానంది తదితర చోట్ల ఉన్న కాలేజీలదీ ఇదే దుస్థితి.

* రాష్ట్రంలో బాగా డిమాండు ఉన్న మరో కోర్సు 'గృహవిజ్ఞాన శాస్త్రం బీఎస్సీ'(హోంసైన్స్‌)దీ ఇదే దుస్థితి. హైదరాబాద్‌లో మాత్రమే ఈ కోర్సు ఉంది. ఎన్నో ఏళ్ల విన్నపాల అనంతరం ఈ ఏడాది నుంచి గుంటూరులోనూ ప్రారంభానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. కానీ అనుమతించలేదు. ఈ ఏడాది ఈ కోర్సులో అదనంగా 20 సీట్లు పెంచారు.

* ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో బాగా డిమాండు ఉన్న మరో కోర్సు 'కమర్షియల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌'(సీఏబీఎం). అయితే దీని గురించి విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదు. కానీ బీఎస్సీ(సీఎంబీఎం) చేసిన వారికి ఉద్యోగావకాశాలు బాగా ఉన్నాయి. దీని తరవాత ఇదే కోర్సులో ఎంబీఏ చేయడానికి కూడా అవకాశం ఉంది.

* ఈ ఏడాది నుంచి కొత్తగా 'ఆహారశాస్త్రం, పోషకాహారం-బీఎస్సీ'(ఫుడ్‌సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌) కోర్సును 25 సీట్లతో ప్రారంభిస్తున్నారు. ప్రజలకు ఆహారంపై అవగాహన పెరుగుతున్నందున ఈ కోర్సు చేసే ఉపాధి అవకాశాలు ఎక్కువే ఉంటాయి.
24 వరకూ దరఖాస్తు గడువు
వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు గడువు ఈ నెల 24 వరకూ ఇచ్చాం. ఇంటర్‌ బైపీసీలో చదివి ఎంసెట్‌ ర్యాంకు సాధించిన వారు వీటికి అర్హులు. రంగా వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడు చేసి నింపి పంపాలి. ఇలా పంపిన వారికి వెబ్‌ కౌన్సిలింగ్‌లో ఆప్లన్లు ఇవ్వడానికి వచ్చేనెల 22 తరవాత అవకాశం ఇస్తాం. ఈ తేదీలను తరవాత మళ్లీ ప్రకటిస్తాం. వెబ్‌ కౌన్సిలింగ్‌లో ఆప్షన్లు ఇవ్వడానికి 11 కేంద్రాలలో అవకాశం కల్పిస్తున్నాం. బీఎస్సీ హోంసైన్స్‌ కోర్సులకు మాత్రం నేరుగా వచ్చేనెల 6న కౌన్సిలింగ్‌ నిర్వహిస్తాం. పల్లెల్లో పదో తరగతి వరకూ చదివి, కనీసం 3 ఎకరాల పొలం ఉన్న రైతుల పిల్లలకు 'రైతుకోటా'లో 40 శాతం సీట్లు ఇస్తాం.

మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ www.angrau.net లో చూడవచ్చు లేదా సెల్‌ నెంబరు 9989623832కు ఫోన్‌చేయవచ్చు.

- మీనాకుమారి, రిజిస్ట్రార్‌, రంగా వర్సిటీ

  • ====================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Sunday, July 15, 2012

ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీటు rETu 2012 ,MBBS management Quota seat rate 2012





ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీటు రేటు రూ.30-70 లక్షలుయాజమాన్య కోటా భర్తీపై స్వచ్ఛందసంస్థ అభ్యంతరం--ప్రైవేట్‌ కళాశాలలు, ఎన్టీఆర్‌ వర్సిటీని వివరణ కోరిన హైకోర్టు.---- ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్య కోటాలోని ఒక్కో ఎంబీబీఎస్‌ సీటును రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు బహిరంగంగా అమ్ముకుంటున్నాయని.. ఈ ధోరణిని అడ్డుకోవాలని రాష్ట్ర హైకోర్టును హైదరాబాద్‌కు చెందిన సేవా మెరిట్స్‌ సొసైటీ అభ్యర్థించింది. వైద్యకళాశాలల్లో సీట్ల భర్తీని పర్యవేక్షించాల్సిన ఎన్టీఆర్‌ ఆరోగ్యశాస్త్రాల విశ్వవిద్యాలయం తగిన చర్యలు తీసుకోవటం లేదని, ఫలితంగా ఇంటర్‌లో 90 శాతం మార్కులు సాధించిన ప్రతిభావంతులకు కూడా వైద్య కోర్సుల్లో సీట్లు లభించటం లేదని తెలిపింది. 2012-13 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర వైద్యకోర్సుల్లో యాజమాన్య కోటా సీట్లను ప్రతిభ ఆధారంగా భర్తీ చేసేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ సేవా మెరిట్స్‌ సొసైటీ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సేవా మెరిట్స్‌ సంస్థ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వైద్యకోర్సుల్లో యాజమాన్యకోటా సీట్ల భర్తీకి సంబంధించిన జీవో 136లో నిర్దేశించిన నిబంధనలను కానీ, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కానీ ప్రైవేటు వైద్యకళాశాలలు పట్టించుకోవట్లేదని తెలిపారు. ఈ వ్యాజ్యంపై తీర్పు వెలువడేంత వరకు ప్రవేశాల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ప్రైవేటు కళాశాలల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. యాజమాన్య కోటాలో ఇప్పటికే మూడువేలవరకు సీట్లు భర్తీ అయ్యాయని, నిబంధనల ప్రకారమే అభ్యర్థుల జాబితా ఖరారైందని తెలిపారు. పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సేవా మెరిట్స్‌ సంస్థ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయకుండానే సీTu కోటా ప్రవేశాలు పూర్తయ్యాయని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర వైద్యకోర్సుల్లో యాజమాన్యకోటా సీట్లకేటాయింపునకు సంబంధించి వివరణతో కూడిన కౌంటర్‌ దాఖలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శిని, ఎన్టీఆర్‌ ఆరోగ్యశాస్త్రాల విశ్వవిద్యాలయాన్ని, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలను ఆదేశించింది. తీర్పు వచ్చేవరకు ప్రవేశాల ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

source : Eenadu news paper
  • ===========================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Admission chances of MBBS in 2012 ,ఎంబీబీఎస్‌లో ప్రవేశం...2012 ఎవరికెంత అవకాశం?



2012 ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి కొద్దిరోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఇంటర్‌ బోర్డు తాజా మార్కుల జాబితాను విడుదల చేయగా ఎంసెట్‌ ర్యాంకులను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా వైద్యవిద్య అభ్యసించదలిచిన విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు పొందే అవకాశాలేమిటో విశ్లేషిద్దాం!

ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌ విభాగంతో పోలిస్తే మెడికల్‌ సీట్ల విషయంలో విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువ. ఇంజినీరింగ్‌ సీట్ల సంఖ్య పరీక్ష రాసినవారి సంఖ్య కంటే అధికంగానే ఉంది కాబట్టి ఏదో ఒక కళాశాలలో చేరొచ్చనే భరోసా ఉంటుంది. కానీ మెడికల్‌ సీట్లు 4950 మాత్రమే ఉండగా ఈ విభాగంలో పరీక్షను 90,000 మందికి పైగా రాశారు! వీటిలో దాదాపు 500 సీట్లు మైనారిటీ కళాశాలల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి సీటుకూ 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పొచ్చు.

ఈ విభాగంలో ఏ విద్యార్థి అయినా సాధారణంగా మెడికల్‌ సీటు వస్తుందా, కనీసం బీడీఎస్‌ అయినా చేరే వీలుందా అనే ఆలోచిస్తుంటాడు. గత సంవత్సరం ర్యాంకుల విశ్లేషిస్తే సీట్ల లభ్యతపై నిర్థారణకు వచ్చే అవకాశం ఉంటుంది.

గత ఏడాది ర్యాంకుల పట్టికలన్నీ తుది విశ్లేషణలను తెలుపుతాయే కానీ తొలి కౌన్సెలింగ్‌ని కాదు. మెడికల్‌ విభాగంలో తుది కౌన్సెలింగ్‌నే ఆధారంగా తీసుకోవాల్సివుంటుంది. మొదటి కౌన్సెలింగ్‌కూ, రెండో కౌన్సెలింగ్‌కూ కనిపించే తేడా గమనిస్తే.. రిజర్వేషన్‌ విభాగాల్లోని విద్యార్థులు తొలి కౌన్సెలింగ్‌లో జనరల్‌ కేటగిరి సీటు సాధించి మళ్ళీ రిజర్వేషన్‌ ఉపయోగించుకుని వేరే కాలేజీకి మారవచ్చు. అలాంటపుడు ఆ సీట్ల భర్తీ కూడా రెండో కౌన్సెలింగ్‌లో జరుగుతుంది. ఇలా కొన్ని మార్పులు రెండో కౌన్సెలింగ్‌లో ఉంటాయి. ఆ తర్వాత జరిగే ఏ కౌన్సెలింగ్‌కూ పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు.

  • తొలి... తుది కౌన్సెలింగ్‌
గత ఏడాది తొలి కౌన్సెలింగ్‌లో- ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో 600 ర్యాంకు లోపలే సీట్లు భర్తీ అయ్యాయి. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 800 ర్యాంకు వరకూ, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పరిధిలో 1000 ర్యాంకు వరకూ ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లు లభించాయి. అయితే తుది కౌన్సెలింగ్‌లోకి వచ్చేటప్పటికి పరిస్థితి మారింది...

* ఉస్మానియా పరిధిలో- ప్రభుత్వ కళాశాలలో 1000 ర్యాంకులోపు, ప్రైవేటు కళాశాలల్లో కేటగిరి ఎ లో 1600 ర్యాంకు లోపు, బి లో 1750 ర్యాంకులోపు సీట్లు వచ్చాయి.

* ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో- ప్రభుత్వ కళాశాలలో 1250 ర్యాంకు లోపు, ప్రైవేటు కేటగిరీ ఎ లో 2100 ర్యాంకు లోపు, బి లో 2100 ర్యాంకు లోపు సీట్లు లభించాయి.

* శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పరిధిలో- ప్రభుత్వ కళాశాలలో 1700 ర్యాంకు లోపు, ప్రైవేటు కేటగిరీ ఎ లో 2200 ర్యాంకు లోపు, బి లో 2400 ర్యాంకు లోపు సీట్లు లభించాయి.

ఇక్కడ కేటగిరి ఎ-బి లలోని మార్పు ఫీజు మాత్రమే! మిగిలిన అంశాల్లో తేడా లేదు కాబట్టి కేటగిరి బి లో సీటు వచ్చినా సీటు తీసుకోవడం మంచిదే! ఈ ఏడాది విద్యార్థులు మంచి కాలేజీ కావాలనో, కేటగిరి బిలో సీటు వద్దనుకునో లాంగ్‌ టర్మ్‌లో చేరటం అర్థం లేని పనేనని చెప్పొచ్చు! ఎందుకంటే.. ఈ విద్యార్థులు లాంగ్‌ టర్మ్‌కు సిద్ధమయ్యేట్టయితే- పరీక్షా విధానం ఇంకా తెలియదు. మారిన సిలబస్‌ చదవాల్సివుంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం మేలు.

  • కనిష్ఠ వయసు...
కౌన్సెలింగ్‌లో కొందరు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నది- వయసు గురించి. ఎంబీబీఎస్‌ ప్రవేశానికి కనిష్ఠ వయసు నిబంధన ఉంది. విద్యార్థి 17 సంవత్సరం పూర్తిచేసివుంటేనే ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి అర్హత కల్పిస్తున్నారు. ఇలా ప్రతి ఏడాదీ 100లోపు ర్యాంకు సాధించి సీటు పొందలేకపోతున్నవారు ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. ఇది ఎంసీఐ నిబంధన కాబట్టి దీనిలో ఎలాంటి సడలింపూ ఉండదు. ఈ ఏడాది చేరేగోరే విద్యార్థులకు డిసెంబర్‌ 31, 2012లోపు కచ్చితంగా 17వ సంవత్సరం పూర్తయివుండాలి. ఒక్కరోజు తేడా ఉన్నా నిబంధనల్లో ఎలాంటి సడలింపూ ఉండదు.

  • లోకల్‌, నాన్‌ లోకల్‌ విషయాలకొస్తే...
రాష్ట్రాన్ని మూడు విశ్వవిద్యాలయాల (ఉస్మానియా, ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర) పరిధులుగా విభజించారు. ఒక్కో విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న సీట్లను 85 శాతం లోకల్‌ విద్యార్థులకూ, మిగిలిన 15 శాతం నాన్‌ లోకల్‌ (మిగతా రెండు యూనివర్సిటీల పరిధుల) విద్యార్థులకూ కేటాయిస్తారు. ఏ యూనివర్సిటీ పరిధిలో గత ఏడేళ్ళలో అధికశాతం- అంటే 4 సంవత్సరాలు/ఆపైన ఉండటం, చదువుకోవడం జరుగుతుందో ఆ
యూనివర్సిటీ పరిధిలో లోకల్‌ అని నిర్ణయిస్తారు.

  • గత ఏడాది సీట్లు సాధించిన చివరి ర్యాంకులు
గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3 విశ్వవిద్యాలయాల పరిధిలో నిర్వహించిన ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లలో తుది ర్యాంకులు
ఇతర కోర్సులూ ఉన్నాయ్‌...
ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆస్కారం లేని ఎంసెట్‌ ర్యాంకులు వచ్చినవారు ఏం చేయాలి? వీరు ఇతర వైద్య కోర్సుల్లో చేరే విషయం పరిశీలించవచ్చు. అలాంటి వారికోసం- ప్రత్యామ్నాయ సనాతన, సంప్రదాయ వైద్యం, పారామెడికల్‌ కోర్సుల్లో చేరేందుకు కావలసిన అర్హతలు, అవకాశాలను ఇక్కడ ఇస్తున్నాం.

  • ఆయుర్వేద డిగ్రీ (బి.ఎ.ఎం.ఎస్‌) కోర్సు
రాష్ట్రంలో మొత్తం నాలుగు ప్రభుత్వ, మూడు ప్రైవేటు ఆయుర్వేద కళాశాలలున్నాయి. 170 సీట్లను కన్వీనర్‌ కోటాలో హెల్త్‌'వర్సిటీ భర్తీ చేస్తుంది. ఎంసెట్‌- 2012 బైపీసీ కోర్సులో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు మెరిట్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ను చేపడతారు. కౌన్సెలింగ్‌ తేదీకి ఆయుష్‌ విభాగ అనుమతులున్న కళాశాలల్లో సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్‌ చేపడతారు.
  • * డాక్టర్‌ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (విజయవాడ): 30 సీట్లు
  • * అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (వరంగల్‌): 50 సీట్లు
  • * డాక్టర్‌ బి.ఆర్‌.కె.ఆర్‌ ప్రభుత్వ ఆయుర్వేద (హైదరాబాద్‌): 50 సీట్లు
  • * శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల (తిరుపతి): 40 సీట్లు
  • * ఎం.ఎన్‌.ఆర్‌.ఆయుర్వేద ప్రైవేటు కళాశాల (సంగారెడ్డి): 50 సీట్లు
  • * వాగ్దేవి ఆయుర్వేద ప్రైవేటు కళాశాల (వరంగల్‌): 50 సీట్లు
  • * వాగీశ్వరి ఆయుర్వేద ప్రైవేటు కళాశాల (కరీంనగర్‌): 50 సీట్లు
హోమియో (బి.హెచ్‌.ఎం.ఎస్‌.) కోర్సు
మొత్తం నాలుగు ప్రభుత్వ, రెండు ప్రైవేటు హోమియో కళాశాలల్లో 280 వరకూ సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేయనున్నారు. ఎంసెట్‌ మెరిట్‌ ఆర్డర్‌ ప్రకారమే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఉంటుంది.
  • * డాక్టర్‌ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల (రాజమండ్రి): 50 సీట్లు
  • * డా.గురురాజ్‌ హోమియో వైద్య కళాశాల (గుడివాడ): 40 సీట్లు
  • * జె.ఎస్‌.పి.ఎస్‌ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల (హైదరాబాద్‌): 60 సీట్లు
  • * ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల (కడప): 30 సీట్లు
  • * మహారాజ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ హోమియో ప్రైవేటు కళాశాల ( విజయనగరం): 50 సీట్లు
  • * దేవ్స్‌ హోమియో ప్రైవేటు కళాశాల (హైదరాబాద్‌): 50 సీట్లు

యునానీ (బి.యు.ఎం.ఎస్‌.) కోర్సు :
రాష్ట్రంలో రెండు యునానీ కళాశాలలున్నాయి. దీనికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష (బి.యు.ఎం.ఎస్‌.సెట్‌)ను హెల్త్‌'వర్సిటీ నిర్వహించి ర్యాంకులు, మెరిట్‌ ఆర్డర్‌ను ప్రకటిస్తుంది. మొత్తం 110 సీట్లున్నాయి.
  • * నిజామియా టిబ్బి ప్రభుత్వ యునానీ కళాశాల (హైదరాబాద్‌): 60 సీట్లు
  • * డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ యునానీ కళాశాల (కర్నూలు): 50 సీట్లు.

నాచురోపతి (బి.ఎన్‌.వై.ఎస్‌.) కోర్సు
రాష్ట్రంలో ఇక ప్రభుత్వ, రెండు ప్రైవేటు నాచురోపతి కళాశాలలున్నాయి. వాటిల్లో 80 సీట్లను మాత్రమే కన్వీనర్‌ కోటాలో యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే కౌన్సెలింగ్‌ చేపడతారు.
  • * గాంధీ న్యూరోపతిక్‌ వైద్య కళాశాల (హైదరాబాద్‌): 30 సీట్లు
  • * నారాయణ యోగా అండ్‌ నాచురోపతి ప్రైవేటు వైద్య కళాశాల: 100 సీట్లు
  • * దేవ్స్‌ నాచురోపతి వైద్య కళాశాలకు కొత్తగా ఈ ఏడాది అనుమతి లభించింది.

ఫిజియోథెరపీ (బి.పి.టి.) కోర్సు

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం 38 ఫిజియోథెరపీ కళాశాలలున్నాయి. 1640 సీట్లను కన్వీనర్‌ కోటాలో హెల్త్‌'వర్సిటీ భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ప్రాతిపదికన మెరిట్‌ ఆర్డర్‌ కేటాయించి కౌన్సెలింగ్‌ చేపడతారు. ప్రైవేటు కళాశాలలో సీట్లను 60 శాతం కన్వీనర్‌ కోటా, 40 శాతం యాజమాన్య కోటాలో భర్తీ చేయనున్నారు.

  • బీఎస్సీ నర్సింగ్‌ (నాలుగేళ్లు) కోర్సు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆరు ప్రభుత్వ, 205 ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలున్నాయి. వాటిల్లో సుమారు 10,400 సీట్లు అందుబాటులో ఉంచారు. ఇంటర్‌ బైపీసీ గ్రూపులో చదివిన విద్యార్థులు ఎంసెట్‌-2012 ర్యాంకు ఉన్నవారు మాత్రమే అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఇప్పటికే పొందుపర్చి, జులైలో కౌన్సెలింగ్‌ నిర్వహించడానికి హెల్త్‌'వర్సిటీ కసరత్తు చేస్తోంది.

  • బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సు
రాష్ట్రంలో 9 ప్రభుత్వ, 54 ప్రైవేటు ల్యాబ్‌ టెక్నాలజీ కళాశాలలుండగా వాటిల్లో 2,035 సీట్లను కన్వీనర్‌ కోటాలో హెల్త్‌'వర్సిటీ భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు లభిస్తాయి. ఎంసెట్‌ ర్యాంకుల మెరిట్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

- (న్యూస్‌టుడే, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం)

  • ======================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Saturday, July 14, 2012

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ 2012 , MBBS councelling 2012




* రాష్ట్రంలోని నాలుగు ఆన్‌లైన్‌ కేంద్రాల్లో...* ఈనెల 20 నుంచి 27వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌.........
ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, -రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈనెల 20 నుంచి 27వరకు నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.వేణుగోపాలరావు తెలిపారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీయూ, విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ చేపడతారు. ఎంసెట్‌ ర్యాంకుల మెరిట్‌ ఆధారంగా ఈనెల 20న 1-900 ర్యాంకుల వారికి, 21 న 901- 2400 ర్యాంకుల వరకు, 22న 2401- 5000 ర్యాంకుల వారికి, 23న 5001 నుంచి 7000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించి అదేరోజు నుంచి బీసీ అన్ని కేటగిరీలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ చేపడతారు. అభ్యర్థులు ఈ ఏడాది డిసెంబరు 31 కల్లా 17
సంవత్సరాలు నిండిన వారు మాత్రమే కౌన్సెలింగ్‌ అర్హులు. అనగా 02.01.1996 తేదీ తర్వాత పుట్టిన వారు కౌన్సెలింగ్‌కు అనర్హులుగా నిర్ణయించారు.

విద్యార్హతల్లో ఓసీ కేటగిరీ అభ్యర్థులు ఇంటర్‌, ఎంసెట్‌లో 50 శాతం (80 మార్కులు), బీసీ/ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 40శాతం (64 మార్కులు), వికలాంగులకు 45శాతం (72మార్కులు) ఉన్న వారికే కౌన్సెలింగ్‌కు అనుమతి ఇస్తారు. జీవో నెంబరు 42 ప్రకారం అన్‌ రిజర్వుడు సీట్లకు ముందు కౌన్సెలింగ్‌ చేపట్టిన అనంతరం లోకల్‌ ఏరియా సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ప్రత్యేక కేటగిరీ ఆంగ్లో ఇండియన్‌, స్పోర్ట్సు,గేమ్స్‌, ఆర్మీ సంతతి, ఎన్‌సీసీ, వికలాంగులు అభ్యర్థులకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్‌ తర్వాత ప్రకటిస్తారు. కౌన్సెలింగ్‌ సీట్లు పొందిన అభ్యర్థులు వారి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులు పూర్తి అయిన తర్వాత తప్పనిసరిగా ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలి. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆయా వైద్య, దంత కళాశాలల్లో తరగతులకు హాజరుకావల్సి ఉంటుంది. ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్‌
షెడ్యూలు, కౌన్సెలింగ్‌కు హాజరుకావడానికి తీసుకురావల్సి సర్టిఫికేట్ల వివరాలు, మార్గనిర్దేశకాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌http://ntruhs.ap.nic.inలో పొందుపర్చారు.

  • కౌన్సెలింగ్‌లో భర్తీ చేసే సీట్లివీ...
ఎంబీబీఎస్‌ కోర్సులో 14 ప్రభుత్వ కళాశాలలో2050 సీట్లు,
22 ప్రైవేటు కళాశాలల్లో 3050 సీట్లుండగా అందులో 1830 సీట్లను కన్వీనర్‌ కోటాలో హెల్త్‌'వర్సిటీ భర్తీ చేస్తుంది. అలాగే ఈ ఏడాది ఎంసీఐ

అనుమతులొచ్చిన మూడు మైనార్టీ కళాశాలల్లో 400 సీట్లుండగా వాటిని ఆయా యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి.
* బీడీఎస్‌ కోర్సులో మూడు ప్రభుత్వ కళాశాలలో 180 సీట్లుండగా, 16 ప్రైవేటు కళాశాలల్లో 1450 సీట్లుండగా అందులో ఎ,బి కేటగిరీ కోటా కింద 870 సీట్లను యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. అలాగే సికింద్రాబాద్‌లోని ఆర్మీ దంత కళాశాలలో ఉన్న 40 సీట్లలో ఆరుసీట్లను కన్వీనర్‌ కోటా కింద యూనివర్సిటీ భర్తీ చేస్తుంది.

  • వైద్యవిద్యకూ సుస్తీ!
నాణ్యత ప్రమాణాల రీత్యానే కాదు, ప్రవేశాలపరంగానూ వైద్య విద్యారంగం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా వైద్యవిద్య మెరుగుదలకు విశ్వసనీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరంపై వూకదంపుడు ఉపన్యాసాలతో ప్రధానమంత్రి పొద్దుపుచ్చుతుంటే, ఉన్న వ్యవస్థలూ రుజాగ్రస్తమైన తీరు- ఔత్సాహికుల ఆశల్ని చిదిమేస్తోంది. భారతావనిలో వైద్యసేవలకు మరో ఆరు లక్షలమంది డాక్టర్లు, పది లక్షలమంది నర్సులు, రెండు లక్షలమంది దంత చికిత్సా నిపుణుల అవసరం ఉందని ప్రణాళిక సంఘం నివేదికే ఇటీవల వెల్లడించింది. అంత భారీస్థాయిలో నిపుణ వైద్యుల్ని రూపొందించుకోవాలంటే- ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల స్థాయి పెంపుదల మొదలుకొని, కొత్త కాలేజీల ఏర్పాటు, మెరికల్లాంటి బోధన సిబ్బంది సమీకరణ, వనరుల లభ్యత తదితర కీలకాంశాలన్నింటిమీదా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దృష్టి సారించాలి. నిరుడు జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ సదస్సు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లను 250దాకా పెంచాలని నిర్ణయించడంతో కొత్తగా 1,300సీట్లు అందుబాటులోకొస్తాయని రాష్ట్ర విద్యార్థులు సంతోషించారు. 'హైదరాబాద్‌ డిక్లరేషన్‌'
ప్రాతిపదికన రాష్ట్రంలోని 23 ప్రైవేటు కాలేజీల్లో మరో 2,750సీట్లు పెరుగుతాయనీ అంచనాలు వెలువడ్డాయి. తీరా భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) ఇటీవల అనుగ్రహించిన సీట్లు- ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు కలిపి ఏడొందలు! ప్రభుత్వ కళాశాలల్లో కేవలం 150 సీట్లే పెరగడం యంత్రాంగం ఉదాసీనతకు పరాకాష్ఠగా నిలుస్తోంది. వైద్య విద్యా ప్రవేశాలకోసం రాష్ట్రంలో లక్షమంది 'ఎంసెట్‌' రాస్తుంటే- కొత్తగా వచ్చినవాటితో కలిపి మొత్తం ఉన్న సీట్లు అయిదున్నరవేలు! ప్రైవేటు కళాశాలల్లో 40శాతంగా ఉన్న యాజమాన్య కోటాలో ఒక్కోసీటూ అరకోటికిపైగా రేటు పలుకుతుండటంపై ఆందోళన ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టుకెక్కింది. కచ్చితమైన ప్రమాణాలే గీటురాయి అయితే, ఉస్మానియాలో ఉన్నసీట్లకూ ఎసరొస్తుందని మంత్రులే అంటుంటే, కాలేజీల నిర్వహణ భారం తలకు మించిన భారమవుతోందని ప్రైవేటు యాజమాన్యాలు మొత్తుకొంటున్నాయి. దానాదీనా వైద్య విద్యారంగమే బహుముఖంగా వ్యాధిగ్రస్తమై కుములుతోంది!

వైద్యవిద్య ఖరీదైన వ్యవహారం అనడంలో మరోమాట లేదు. సంక్షేమరాజ్య భావనకు గొడుగు పట్టాల్సిన ప్రభుత్వాలు సామాజిక బాధ్యతగా వైద్య కళాశాలల్ని పరిపుష్టీకరించి విస్తరించడం; ధార్మిక, ప్రైవేటు సంస్థలకు తగు ప్రోత్సాహకాలిచ్చి కొత్త కాలేజీల్ని ఏర్పాటు చేయించడంద్వారా వైద్యసేవల్ని ఇతోధికం చెయ్యడం- ప్రజలపట్ల నిబద్ధతతో సాగాల్సిన క్రతువు! కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్నవాటిలో సీట్ల పెంపుదలకు అనుసరించాల్సిన వ్యూహరచనకోసం రాష్ట్రప్రభుత్వం నిరుడు ఫిబ్రవరిలోనే ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. జస్టిస్‌ జీవన్‌రెడ్డి సూచనల్ని దృష్టిలో ఉంచుకొని వైద్యవిద్యా ప్రమాణాల్ని పెంచడానికి అనుసరించాల్సిన విధానాలు, మరో దశాబ్దకాలంపాటు వైద్య అవసరాలకు సరిపడా మానవ వనరుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకే ఉన్నతాధికార కమిటీ అంటూ హడావుడి చేసింది. ఆ కమిటీ నివేదిక నేటికీ అతీగతీ లేదు. ఈలోగా తనవంతు నిర్మాణాత్మక చొరవ చూపడంలో రాష్ట్రసర్కారు వైఫల్యం- సర్కారీ బోధనాసుపత్రుల దయనీయావస్థలో, కొత్తగా సీట్లు మంజూరుకాని వాస్తవంలో ప్రస్ఫుటమవుతూనే ఉంది. ఒక్కో సీటుకు కనీసం అయిదు పడకలుండాలన్నది నియమం. యాభైసీట్లు పెరగాలంటే కొత్తగా 250 పడకలు ఏర్పాటు చేయడం తప్పనిసరి. మందుల పద్దుకే
డబ్బులివ్వలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం- కనీసం కేంద్రం గ్రాంటుగా ఇచ్చిన మొత్తాన్ని అయినా సద్వినియోగం చేసుకోకపోవడమే విషాదం! అలా- ఏటా రూ.10వేల ఫీజుతో వైద్యవిద్యను అభ్యసించే సదవకాశం 1,100మంది ఎంసెట్‌ మెరికలకు దూరమైపోయింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ఎంసీఐ తమపని తాము సక్రమంగా చేస్తే- ప్రతిభకు గోరీ కడుతున్నారంటూ విద్యార్థిలోకం ఏటా గళమెత్తే దుర్గతి ఎందుకు దాపురిస్తుంది?

ఆరోగ్య రంగంమీద బాగా శ్రద్ధ చూపించే ఉక్రెయిన్‌, కిర్గిజిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, మధ్య అమెరికా దేశాలు, చైనా, రష్యాలాంటివీ పరిమిత ఫీజులతోనే వైద్యవిద్యను అందిస్తున్నాయి. డొనేషన్ల బాదరబందీ లేకుండా భారత విద్యార్థుల్నీ సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి. ఇండియా ఏటా 70వేలమంది డాక్టర్లను
రూపొందించుకోవాల్సి ఉందని అధ్యయనాలు చాటుతున్నా, దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ సీట్లు 45వేలు! ఆరోగ్యరంగంపై స్థూల దేశీయోత్పత్తిలో జర్మనీ 7.8శాతం వ్యయీకరిస్తుంటే, బ్రిటన్‌(7.2), అమెరికా(7.3), జపాన్‌(6.7), రష్యా(3.1), చైనా(2.0)లతో పోలిస్తే భారత్‌ ఖర్చు చేస్తున్నది కేవలం 1.4శాతం! ఈ అరకొర కేటాయింపులే దేశంలో వైద్యవిద్య విస్తరణకూ గండి కొడుతున్నాయన్నది నిష్ఠురసత్యం! ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ కళాశాలలు కచ్చితంగా తమ విధానాలనే అనుసరించాలని ప్రభుత్వం నిర్దేశించలేదంటూనే- వాటిలో కనీస ప్రమాణాలకు పెద్దపీట వేయాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు 2005నాటి తీర్పులో ప్రస్తావించింది. సీట్ల భర్తీ విషయంలో ప్రతిభ, పారదర్శకతలకు ప్రాధాన్యం దక్కాలనీ తీర్పు స్పష్టీకరిస్తోంది. యాజమాన్య కోటా ఫీజు అయిదున్నర లక్షల రూపాయలుగా నిర్ధారించిన ప్రభుత్వం- అంతకు పదింతల వసూళ్లు, సీట్ల భర్తీలో ప్రతిభకు తూట్లు వంటి అంశాలపై తనవంతుగా ఏనాడూ స్పందించనేలేదు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఒక్కో ఎంబీబీఎస్‌ విద్యార్థిమీదా ఏటా రూ.31లక్షల పైచిలుకు ఖర్చు చేస్తోందని ఆ సంస్థ అధ్యయనం చాటుతోంది. అత్యున్నత ప్రమాణాలతో వైద్యవిద్యను అందించడానికి అంతంత వ్యయం అవుతుందని తెలిసినప్పుడు- యాజమాన్య కోటా రుసుముల
నిర్ధారణలో ప్రభుత్వాలు శాస్త్రీయంగా వ్యవహరించాలి. ప్రతిభావంతుల్ని వైద్య విద్యారంగం అపర ధన్వంతరుల్లా తీర్చిదిద్దాలంటే- ప్రభుత్వాల విధానాలనుంచి ఎంసీఐ నిర్వహణ దాకా సమగ్ర క్షాళన జరిగి తీరాలి!

source : Telugu News papers

  • =================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Medical Education in Foreign countries -Awareness,విదేశీ వైద్య విద్య-అవగాహన



వైద్యవిద్యలో ప్రవేశం కోసం మన రాష్ట్రంలో ఏటా దాదాపు లక్షమంది ఎంసెట్‌ రాస్తున్నారు. కానీ సీట్లు చూస్తే... చాలా పరిమితం. అందుకే ఎంబీబీఎస్‌ చదవాలనీ ఆసక్తి ఉండీ, అవకాశం లభించనివారు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇలా నిరాశపడే విద్యార్థులు ప్రత్యామ్నాయంగా విదేశీ వైద్యవిద్యవైపు చూస్తున్నారు!

విదేశీ వైద్యవిద్యలో డొనేషన్లు కానీ, ప్రవేశ పరీక్షలు కానీ లేకపోవడం మన విద్యార్థులకు బాగా కలిసొస్తున్న అంశం. లక్షలు వెచ్చించాల్సిన పనిలేదు. ఇక్కడ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో, ఏసీ క్యాంపస్‌లలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకయ్యే ఏడాది ఖర్చు కంటే కాస్త ఎక్కువ వ్యయం చేయటానికి సిద్ధపడితే- విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేయవచ్చు.

అత్యల్ప జనాభా కలిగి, ప్రాథమిక ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ చూపే కిర్గిజిస్థాన్‌, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌, మధ్య అమెరికాలూ; అత్యధిక జనాభా ఉన్నా మౌలిక వసతులు కల్పించడంలో ముందున్న చైనా, ఇంకా రష్యా వంటి దేశాలు వైద్యవిద్యను పరిమిత ఫీజుతోనే బోధిస్తున్నాయి. విదేశీ విద్యార్థులను సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. ఇవన్నీ మన దేశ విద్యార్థులను సహజంగానే ఆకర్షిస్తోన్నాయి.. అధికారిక, మాతృభాష కాకపోయినా ఆ దేశాల్లో ఆంగ్లంలోనే వైద్య విద్యాబోధన లభిస్తోంది. దీంతో మన విద్యార్థులు అక్కడి వైద్య కళాశాలలు ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతున్నారు. తమ కలలను నిజం చేసుకో గలుగుతున్నారు.

  • స్క్రీనింగ్‌ టెస్టు ఉత్తీర్ణులతో పెరిగిన నమ్మకం
విదేశాల్లో వైద్యవిద్యను పూర్తి చేసుకొని మనదేశానికి తిరిగొచ్చిన విద్యార్థులు ఓ వడపోత పరీక్ష రాయాల్సివుంటుంది. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ద్వారా భారతీయ వైద్యమండలి (ఎంసిఐ) నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్‌ టెస్టు ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ అవగాహనతోనే మన విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. ఆంగ్ల భాష బోధన మెరుగ్గా ఉన్న కాలేజీలనే ఎంపిక చేసుకుంటున్నారు. స్క్రీనింగ్‌ టెస్టు ఉత్తీర్ణులైన
పూర్వ విద్యార్థులను సంప్రదించి విశ్వవిద్యాలయాల్లో బోధన, వసతుల పట్ల పూర్తిస్థాయిలో సమాచారాన్ని తెలుసుకునే వీలు కూడా ఉంటోంది. ఇన్ని అనుకూలతల మధ్య విదేశాలకు వెళ్లి ఎంబీబీఎస్‌ చదవటానికి మొగ్గు చూపుతున్నారు.

విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకొని మొదటి ప్రయత్నంలోనే స్క్రీనింగ్‌ టెస్టు ఉత్తీర్ణులవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ఇంటర్మీడియట్‌ (బైపీసీ) ఉత్తీర్ణులై డాక్టర్లుగా రూపొందాలనే బలీయమైన కాంక్ష ఉన్న విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది.

  • గుర్తించడం తేలిక
భారతీయ వైద్య మండలి (మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఎం.సి.ఐ.) నిబంధనలూ, సూచనల పట్ల పూర్తి సమాచారం తెలుసుకొని విదేశాల్లో కళాశాలలను ఎంపిక చేసుకోవాలి.

* మొదటి నిబంధన: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వైద్య నిఘంటువులో ఆయా దేశాల వారీగా నమోదయిన మెడికల్‌ కాలేజీల పట్టికలో

అనుకూలమైన కాలేజీని/ యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలి. (http://avicenna.ku.dk/database/medicine/

* లేదా, రెండో నిబంధన: ఎంపిక చేసుకున్న కాలేజీకి ఆ దేశ ప్రభుత్వం గుర్తింపు తప్పనిసరి.
* లేదా, మూడో నిబంధన: ఎంచుకున్న కాలేజీని ఆ దేశంలో మన దేశానికి చెందిన ఎంబసీ ఉన్నట్లయితే- మీరు చదివిన కాలేజీ సర్టిఫికెట్లపై భారతీయ అంబాసిడర్‌ సంతకం ఉన్నా సరిపోతుంది. పై నిబంధనల్లో ఏ ఒక్కటి ఉన్నా మన భారతీయ వైద్య మండలి అక్కడ చదివేందుకు అనుమతిస్తోంది.

ఇక చైనా విషయానికొస్తే- ప్రపంచ ఆరోగ్య సంస్థలో నమోదయిన కాలేజీలన్నింటినీ మన భారతీయ వైద్యమండలి గుర్తించడం లేదు. ఈ ఏడాదికి అనుమతించిన కాలేజీల వివరాలను భారతీయ వైద్య మండలి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వాటి సంఖ్య 50.
(www.mciindia.org/Mediaroo m/ListofchinaColleges.aspx)


  • వీరు అర్హులు
మన రాష్ట్రంలో ఇంటర్‌ తరవాత ఎంసెట్‌కు వర్తించే అర్హతలే విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు కూడా వర్తిస్తాయి. ఇంటర్‌మీడియట్‌ లేదా తత్సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలి. ప్లస్‌టూ ఉత్తీర్ణులై ఉండాలి. బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ పాఠ్యాంశాలతో పాటు ఇంగ్లిషు ఒక బోధనాంశమై ఉండాలి. ఈ పరీక్షలో లాంగ్వేజి సబ్జెక్టులకు వచ్చే మార్కులు మినహా గ్రూప్‌లో కనీసం 50 శాతం ఉత్తీర్ణత తప్పనిసరి. షెడ్యూల్డ్‌ జాతులు (ఎస్‌సి), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్‌సి), వెనుకబడిన తరగతి (బిసి), విద్యార్థులకు 40 శాతం మార్కులు ఉన్నా కూడా అర్హులే! కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైనవారూ అర్హులే! విద్యార్థి వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. (ఈ వయసును విదేశాల్లో అడ్మిషను తీసుకున్న ఏడాది డిసెంబరు 31 నాటికి)

  • భారతీయ వైద్య మండలి వెబ్‌సైట్‌ (www.mciindia.org)

ఎంబీబీఎస్‌తో సమానం
మెడిసిన్‌ చదవాలని విదేశాలకు వెళుతున్న విద్యార్థులు తగిన అర్హతలతో, గుర్తింపు ఉన్న కళాశాలలో ప్రవేశం పొందాలి. స్టడీ సర్టిఫికెట్లూ, పాస్‌పోర్టు కలిగి స్టూడెంట్‌ వీసాను పొందిన తరవాత ఢిల్లీలో ఉన్న ఎంసిఐని సంప్రదించి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తుతో పాటు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు బోర్డు ఆఫ్‌ ఇంటర్‌మీడియట్‌ పేరుతో వంద రూపాయల డి.డి.ని. పొందుపరిచి దరఖాస్తుతో
జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పరిశీలించిన తరవాత ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ నేరుగా విద్యార్థి ఇంటి చిరునామాకు స్పీడు పోస్టులో చేరుతుంది. కోర్సు పూర్తి చేసిన తరవాత ఇదే సర్టిఫికెట్‌ ఆధారంగా స్క్రీనింగ్‌ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఉత్తీర్ణులు కాని విద్యార్థులు నేరుగా ప్రాక్టీసు చేసుకోవడానికి వీలులేదు. ఇదే విషయాన్ని ఈ ఏడాది మార్చి నెలలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. విదేశీ ఎంబీబీఎస్‌ డిగ్రీలతో వచ్చిన భారతీయ వైద్యులు నేరుగా ప్రాక్టీస్‌ చేయడానికి వీల్లేదనీ, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ వడపోత పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉందనీ తెలిపారు.

స్క్రీనింగ్‌ టెస్టు కఠినంగా ఉంటుందనే అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. అయితే ఈమధ్య విదేశాల్లో మెడికల్‌ కోర్సు పూర్తి చేసుకుని అదే సంవత్సరం ఆ పరీక్షకు మొదట దఫా హాజరై ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు దీన్ని కొట్టివేస్తున్నారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే ఈ పరీక్ష రెండు విడతలుగా, ఉదయం మధ్యాహ్నం జరుగుతుంది. మొత్తం మార్కులు 300కు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ఈ పరీక్షలో నెగిటివ్‌ మార్కులు ఉండవు.

విదేశాల్లో ఏ కాలేజీలో కానీ, ఏ దేశంలో కానీ మెడిసిన్‌ చదివినా ఈ పరీక్ష రాయటం తప్పనిసరి. ఏ దేశానికీ/ ఏ విదేశీ కాలేజీకీ ఎటువంటి మినహాయింపూ లేదు. ఈ పరీక్షను ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ పరీక్ష (ఎఫ్‌.ఎం.జి.ఇ.)గా వ్యవహరిస్తున్నారు.
మన రాష్ట్రంలో సికిందరాబాద్‌లో, విశాఖపట్నంలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలున్నాయి. వీటికి అనుబంధంగా మరికొన్ని సేవాకేంద్రాల కార్యాలయాలు ఈ మధ్యనే ప్రారంభమయ్యాయి. దీంతో పాస్‌పోర్టు వెతలు కొంతమేరకు తగ్గే అవకాశముంది. హైదరాబాదులో మూడు సేవాకేంద్రాల కార్యాలయాలు బేగంపేట, అమీర్‌పేట, టోలీచౌక్‌లలో ఏర్పడ్డాయి. నిజమాబాద్‌, తిరుపతి, విజయవాడలో కూడా కొత్తగా ఏర్పాటు చేశారు.

  • పాస్‌పోర్టు పొందగోరే విద్యార్థులు కావలసిన పత్రాలు

1. జనన ధ్రువీకరణ సర్టిఫికెట్‌ (మ్యునిసిపాలిటీ/గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి) పొందాలి. 2. ఇంటి చిరునామా తెలిపే పత్రాలు. పూర్తివివరాల కోసం పాస్‌పోర్టు కార్యాలయం వెబ్‌సైట్‌ను పరిశీలించండి. (www.ap.nic.in/passport/)

  • ముఖ్యమైన జాగ్రత్తలు
* విదేశాల్లో వైద్య విద్యను చదువుకోవడానికి వెళుతున్న విద్యార్థి ఆ దేశ పరిస్థితులు, బోధన, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. కన్సల్టెన్సీలు చెప్పిన సమాచారంతో పాటు పూర్వ విద్యార్థులతో నేరుగా కలిసి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.

* విద్యార్థులు తాము విదేశాల్లో ఉంటున్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఆయా దేశాల చట్టాలను, కాలేజీలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలి.

* ఫీజు, ఇతరత్రా ఖర్చుల విషయంలో ఏడాదికి ఎంత అవుతుందన్నది తల్లిదండ్రులు వారి బడ్జెట్‌ పరిధిని బేరీజు వేసుకోవాలి. విద్యారుణం ఆధారంగా విదేశాల్లో వైద్యవిద్యను చదవగోరే తల్లిదండ్రులు ముందుగానే బ్యాంకర్‌ను సంప్రదించి విద్యార్థి విదేశాలకు వెళ్లే సమయానికల్లా అందే విధంగా హామీ తీసుకోవాలి.

* తెలుగు మీడియం విద్యార్థులు తాము చదవగోరే కాలేజీలో ఆంగ్ల బోధన తమకు అర్థమయ్యే స్థాయిలో ఉంటుందా లేదా అనేది పూర్వ విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి.

* కొన్ని దేశాల్లో విద్యార్థి స్టూడెంట్‌ వీసా కోసం మనదేశంలో ఉన్న వారి ఎంబసీ అధికారుల ముందు హాజరు కావలసి ఉంటుంది. అటువంటి దేశాలు ఫిలిప్పీన్స్‌, రష్యా, ఉక్రెయిన్‌. చైనా, కిర్గిజిస్థాన్‌లలో విద్యార్థి స్వయంగా హాజరు కావల్సిన అవసరం లేదు.

* విదేశాలకు వెళ్లే ముందు జీవిత బీమా, ప్రయాణ బీమా చేయించుకోవాలి. ప్రయాణాల్లో లగేజీ పోయినా, విదేశాల్లో అనారోగ్యానికి గురయినా బీమా ఉపయోగపడుతుంది.

* సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు జలుబు, తలనొప్పి, జ్వరం వంటి సూక్ష్మ రుగ్మతలకు డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులను కొని తీసుకెళ్లాలి. విదేశాల్లో మీరు ఎంపిక చేసుకున్న దేశం లేదా ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో వైద్యుని సలహాలు తీసుకోండి.

* ఇంటివద్ద తినే ఆహారం ఆ దేశంలో లభించే అవకాశం లేకుంటే అందుకు మానసికంగా సిద్ధపడి ప్రత్యామ్నాయం ఆలోచించండి.
  • =======================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Monday, July 2, 2012

ఆంధ్రప్రదేశ్ లో ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు , Increase in MBBS seats in A.P





రాష్ట్రానికి 750 ఎంబీబీఎస్‌ సీట్లు,
ప్రభుత్వ కళాశాలల్లో 150,
ప్రైవేటు కళాశాలల్లో 600 సీట్లు,

ఎంబీబీఎస్‌లో ఈ ఏడాది 750 సీట్లు అదనంగా దక్కాయి. విశాఖపట్టణం, విజయవాడ, కర్నూలు వైద్యకళాశాలల్లో 50 సీట్ల చొప్పున పెరిగాయి. ప్రైవేటులో నాలుగు కళాశాలల్లో ఒక్కో చోట 50 చొప్పున సీట్లను అదనంగా మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మూడు ప్రైవేటు కళాశాలలకు అనుమతులు ఇవ్వడంతో 400 సీట్లు వచ్చాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో కొత్త కళాశాలల అనుమతులతో పాటు అదనపు సీట్ల మంజూరుపై జులై 15 వరకు అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతి విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పక్షాన సీనియర్‌ మంత్రి దీని కోసం కృషి చేస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకులతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని వైద్యవిద్యాశాఖ అధికారులు చెప్పారు. అదనపు సీట్ల మంజూరులో గత రెండేళ్లుగా భారతీయ వైద్యమండలి అధికారులు చిన్నపాటి సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్‌ సీట్ల పెంపు విషయంలో కేంద్రంపై రాజకీయపరంగా ఒత్తిడి పెంచాల్సిన ఉందన్నారు.

  • ఎంబీబీఎస్‌ సీట్లు వివరాలు :
* ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం 1,900 సీట్లున్నాయి. ఈ ఏడాది వీటికి అదనంగా ఆంధ్ర వైద్యకళాశాల, విశాఖపట్టణం(50); సిద్ధార్థ వైద్యకళాశాల, విజయవాడ(50); ప్రభుత్వ వైద్యకళాశాల, కర్నూలు(50)లో మొత్తం 150 సీట్లు పెరుగుతున్నాయి.

* ప్రైవేటులో ప్రస్తుతం 2,850 సీట్లున్నాయి. విశాఖపట్టణంలో ఒకటి, హైదరాబాద్‌లో రెండు కొత్త ప్రైవేటు కళాశాలలకు అనుమతులు వచ్చాయి. వీటిలో 400 సీట్లు మంజూరయ్యాయి. వీటికి అదనంగా అల్లూరి సీతారామరాజు వైద్యవిజ్ఞాన సంస్థ(ఏలూరు), కాటూరి వైద్యకళాశాల(గుంటూరు), మహరాజ వైద్యవిజ్ఞాన సంస్థ(విజయనగరం), మెడిసిటీ(హైదరాబాద్‌)లోని ప్రైవేటు కళాశాలల్లో ఒక్కో చోట 50 చొప్పున 200 సీట్లు పెరిగాయి.

* ప్రస్తుతానికి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 5,500 సీట్లున్నాయి. గతేడాదిలో పోలిస్తే 750 సీట్లు పెరిగాయి.

  • భారతదేశము లో
మరో 3,595 వైద్య సీట్లు ,1,442 పీజీ సీట్లు కూడా -ఎంసీఐ ఆమోదం
వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ ఏడాది కొత్తగా 3,595 ఎంబీబీఎస్‌ సీట్లు, 1,442 పీజీ వైద్య సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే 20 కళాశాల్లో 2,400 ఎంబీబీఎస్‌ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) పేర్కొంది. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో అదనంగా 1,195 సీట్ల భర్తీకి ఆమోదం తెలిపినట్లు ఎంసీఐ వర్గాలు పీటీఐ వార్తాసంస్థకు తెలిపాయి. ఇప్పటికే కొత్తగా ఏర్పాటయ్యే ఆరు 'ఏయిమ్స్‌' తరహా సంస్థల్లో 300 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. మరోవైపు పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచుతూ ఎంసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లోనే అదనంగా 1,326 ఎండీ/ఎంఎస్‌ సీట్లు, 116 డీఎం/ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కళాశాల: ఎంసీఐ ఆమోదం పొందిన నూతన కళాశాలల్లో తొమ్మిది ప్రభుత్వ రంగానికి చెందినవి, 11 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో కొత్త కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 335 కళాశాలల్లో 41,569 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఎంసీఐ తీసుకున్న తాజా నిర్ణయాలతో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 45 వేలు దాటింది.

ఏడు రాష్ట్రాల్లోనే 69 శాతం సీట్లు!: దేశంలోని 69 శాతం వైద్య సీట్లు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్‌, గోవాలో ఉన్నాయి. మధ్య భారతంలో కేవలం 5 శాతం సీట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఈశాన్య భారతంలో 3 శాతం, ఉత్తర భారతంలో 16 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయి.


ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాజమాన్య కోటాలో ఒక్కో సీటుకు రూ.5.50 లక్షలు తీసుకోవాలనే నిబంధన ఉన్నా ప్రైవేటు యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు . నిబంధనల ప్రకారం... యాజమాన్య కోటాలోని ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ విషయంలో దరఖాస్తు చేసుకోవడానికి అందరికీ అవకాశం కల్పించాలి. ఒక్కో కళాశాలకు వచ్చిన దరఖాస్తుల నుంచి మెరిట్‌ జాబితాను తయారుచేసి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు తీసుకుని సీట్లు ఇవ్వాలి. ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. సీట్ల భర్తీలో అక్రమాలకు తావులేకుండా చేయడానికి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకునే విధానాన్ని అమలు చేయడం చక్కటి పరిష్కారమని వైద్య విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వ సాగదీత వైఖరి 'సీటుకు రేటు' విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగానే ఉందనే విమర్శలొస్తున్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం అమల్లోకి రాకుండా చేయడానికి మరోవైపు ప్రైవేటు యాజమాన్యాలు ఉన్నత స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
  • ==========================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -