Sunday, October 28, 2012

Srikakulam School going children health -శ్రీకాకుళం జిలా విద్యార్థుల ఆరోగ్యం అవగాహన



  •  
  • పరిచయం : అందరూ అనుకున్నంతగా శ్రీకాకులం లో పేదవారు లేరనే చెప్పాలి. రోజూ పని , తగిన రోజువారీ కూలీ దొరుకుతున్నందున , ప్ర్కృతి చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా శరీరంలో ఇనుము ధాతువు లోపించి పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని గుర్తించిన ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.2012 Octo 30, 31,నవంబరు నెల 2, 3 తేదీల్లో మండల స్థాయి అధికారులకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 3678 పాఠశాలల్లో ఉన్న 4.5 లక్షల మంది పిల్లలకు దీని వల్ల ఉపయోగం కలగనుంది. వారానికి ఒకసారి ఐరన్‌ ఫోలిక్‌ మాత్రల పంపిణీకి చర్యలు.

ఇదీ పరిస్థితి
శ్రీకాకుళం జిల్లా లో అనేక ప్రకృతివనరులు ఉన్నాయి. సకాలములో వర్షాలలు పడుతునాయి . వాటిని  వినియోగించుకోలేక పోతునారు .రాజకీయ ప్రయోజనాలు కోసం భూమిలేనివాడికి భూమి అంటూ నీటితో కళకళ లాడే చెరువులన్ని ఆక్రమింఛడం వలన నీటిని నిలువచేసే స్థలాలే లేవు . ఓటు బ్యాంక్ రాజకీయ పథకాలు ద్వారా కష్టించే పేదప్రజలను సోమరుపోతులుగా తయారుచేస్తున్నారు. గవర్నమెంట్ ఆశ్రమ పాఠశాలలు అంటూ పసిపిల్లను తల్లిదండ్రులకు దూరము చేయుచునారు , వ్యాపార ధోరణి లో పండ్లు ,కారగాయలు రసాయనాల మూలంగా కలుషితమైపోతున్నాయి... ఇలా ఎన్నోకారణాలు మూలంగా పిల్లలో పోషకాహార లోపానికి గురి అవుతునారు. పిల్లల శరీరంలో ఇనుపధాతువు లోపిస్తే చాలానష్టాలు ఉన్నాయి. శరీరంలో శక్తిలోపిస్తుంది. అనారోగ్యానికి గురవుతారు. ఆకలి తగ్గుతుంది. నిస్సత్తువ ఏర్పడుతుంది. ఆయాసం కలుగుతుంది. దీంతో వీరు ఏపనీ చేయలేని స్థితికి చేరుకుంటారు. బడికి వెళ్తున్న పిల్లలు చదువులో వెనుకబడతారు. దీనిని గమనించిన ప్రభుత్వం తప్పనిసరిగి పాఠశాలల్లో ఐరన్‌ ఫోలిక్‌ మాత్రలను వారానికి ఒకసారి పిల్లలతో మింగించే విధంగా చర్యలు తీసుకుంటోంది.దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించడము సరియైన రీతిలో జరుగడము లేదు .

తీరికలేని యాంత్రిక జీవనములో ఎదుగుతున్న పిల్లలు అప్పటికప్పుడు దొరికే ఆహారము కోసము పరుగెడుతూ ఇంట్లో అమ్మ చేసిన కమ్మని ఆహారాన్ని వదిలేస్తున్నారు . బయట తినే టిఫిన్‌ కన్నా రాత్రి పాలలో తోడు పెట్టిన అన్నము తింటే ఉత్సాహము, శక్తి కలుగుతాయి పోషకాహార లోపము అంటే : మనలోని జీవకణాలకు శక్తికి కావలసిన ఆహార సారము అందకపోవడము లేదా జీవకణాల శక్తికి అందబడుతున్న ఆహారసారము (Nutrients) మధ్య ఉన్న వ్యత్యాసము పోషకాహారలోపము గా గుర్తించబడుతుంది . ఈ వ్యత్యాసము ఎదుగుతున్న పిల్లలలోనూ , మధ్య వయస్సు వారిలోనూ , ముఖ్యము గా పిల్లలను కనే వయసు లో ఎక్కౌవ ప్రభావము చూపిస్తుంది . ప్రపంచ వ్యాప్తము గా 54% శిశు మరణాలు ఈ ఆహారలోపము వల్ల వచ్చే వ్యాధుల వలననే పరిశోదనలలో తేలినది . ముఖ్యము గా ప్రోటీన్ల లోపము వల్ల పిల్లలలో వచ్చే ప్రోటీ ఎనర్జీ & మాల్ నూట్రిషన్‌ (P & M ) ప్రమాధకరమైనది . ఇది దారిద్ర్యపురేఖ అడుగున ఉన్న వాళ్ళలోనే కాదు అన్ని వున్న అవగాహన లేనివాళ్ళల్లోకూడా ఉన్నది . బయట బండ్ల పై దొరికే పదార్ధల్లలో చుట్టూ ఉన్న అనారోగ్య పరిసరాలు , దుమ్మి , ధూళి లలో ఉన్న సూక్ష్మ జీవులు వలన ఆహారము కలుషితమై కొత్త జీర్ణ సమస్యలను , పోషకాహారలోపము ను కలుగజేయును .

అధిక జనాభా ఉన్న దేశాలలో ఆహారాన్ని ఒక పద్దతి ప్రకారము తీసుకోక పోవడము వలం క్వాషియార్కార్ (kwasiyarkar) లేదా మెరాస్మాస్ (Marasmos) వంటి వ్యాధులు తరచుగా కనిపిస్తాయి. మన శరీరములో తనకి శక్తి కావాలనే కోరికను వ్యక్తము చేసే సూచన ''ఆకలి '' అలా ఆకలి పగలు ఆరు గంటలకొకసారి వేయాలి. అప్పుదు ప్రోటీన్లు , పిందిపదార్ధములు , మినరల్స్ ఉన్న పప్పు , ఆకు కూరలు , విటమిన్లు ఉన్న కాయకూరలు , జీర్ణానికి ఉపయుక్తమైన చారు, పులుసు , జీర్ణాశయాన్ని సమతుల్యము చేసే  మజ్జిక , పోషకత్వం నిచ్చే ఋతువులను అనుసరించి పంటే పండ్లు తీసుకుంటే ఆకలి తృప్తిపడుతుంది ... పోషకాలు అందుతాయి ... శరీరములో సమస్త జీవకణాలు శక్తిని పుంజుకుటాయి. ఈ పోషకాహార లోపం వల్ల వచ్చే స్థితిని " శోష " అంటారు . శరీరములో మాంసము ఎండిపోయి సన్నము గా అయి పనిచేసే సామర్ద్యము కోల్పోవడము , చిరాకు , కోపము వస్తాయి. మీకు శక్తి స్థాయిలు తగ్గుతున్నా , తొందరగా అలసి పోతున్నా , చర్మము పొడిబారుతున్నా , పళ్ళు చిగుళ్ళు వాసి రక్తము వస్తున్నా , బరువు తగ్గుతున్నట్లు అనిపించినా , కడుపు ఉబ్బరిస్తున్నా , మాటిమాటికి జలుబో , జ్వరమో , విరోచనాలో వస్తున్నా పోషక విలువలు లోపము ఉన్నట్లు భావించి మంచి డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి .

శరీరంలో ఇలా..
ఎర్రరక్త కణాల్లోని హిమోగ్లోబిన్‌లోఇనుపధాతువు(ఐరన్‌ఫోలిక్‌) ఉంటుంది. పచ్చని చెట్లు విడుదలచేసే ఆక్సిజన్‌ శరీరంలో రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఆక్సిజన్‌తోపాటు ఇనుపధాతువు శరీరంలోని అన్ని భాగాల్లోకి చేరుతుంది. ఆ సమయంలో ఐరన్‌ తగ్గితే ఆక్సిజన్‌ తగ్గుతుంది. దీంతో అనారోగ్యానికి గురికావలసి వస్తుంది. ఆరు నెలల నుంచి ఆరేళ్ల మధ్య పిల్లలకు 11 గ్రాములు, ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు వారికి 12 గ్రాములు, 14 ఏళ్లు పైబడిన మగ పిల్లలకు 13 గ్రాములు, ఆడ పిల్లలకు 12 గ్రాములు, గర్భిణిలకు 11 గ్రాములు ఇనుపధాతువు శరీరంలో ఉంటే ఎటువంటి నష్టం ఉండదు. అంతకంటే తగ్గితే విధిగా దానిని వృద్ధిచేసేందుకు చర్యలు తీసుకోవాలి. బి.కాంప్లెక్ష్ విటమిను లోపము వలన అనేక రోగాల బారిన పడుతున్నారు.వ్యాధినిరోదకశక్తి సన్నగిల్లుతుంది .ప్రధానంగా 15 ఏళ్ల వయస్సు లోపు వారికే పోషకాహార  కార్యక్రమం చేపడుతున్నారు. ఇనుపధాతువు నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

వీటిలో ఇనుపధాతువు
ద్రాక్ష, కమల, నిమ్మ, ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, గోధుమలు, మొలకెత్తిన పప్పుగింజలు, సజ్జలు, వేరుసెనగ, నూలు, బెల్లం, ఎండిన పండ్లు, కార్జం, గుడ్లు, మాంసం, చేప వంటి ఆహార పదార్థాల్లో అధికంగా ఇనుపధాతువు ఉంటుంది. వీటిని తినడం వల్ల ఈలోపాన్ని భర్తీ   చేసుకోవచ్చును. మాత్రల కోసం చూడాల్సిన పరిస్థితి తప్పుతుంది. కాఫీ, టీలలోనూ ఇది ఉంటుంది.

త్వరలో శిక్షణ
శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి మండలం నుంచి వైద్యాధికారి, ఐసీడీఎస్‌ పీవో, మండల విద్యాశాఖ అధికారితోపాటు విద్యాశాఖ నుంచి మరొకరిని తీసుకొనిజిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరు మండలంలో ఒకఆరోగ్యకార్యకర్త, ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి మాత్రలు పంపిణీ చేపడతారు.

అవగాహన కల్పించాలి
ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రామాల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. వీఆర్వోలు, పంచాయతీకార్యదర్శులు, సాక్షర భారత్‌ సమన్వయకర్తలు, క్షేత్ర సహాయకులను భాగస్వాములను చేస్తే ఆశించిన ప్రయోజనం దక్కుతుంది. ప్రతి ఒక్కరూ ఈ మాత్రలను మింగుతారు. ప్రతివారం బాధ్యతగా మాత్రలు పంపిణీ చేపడితే ఐరన్‌ఫోలిక్‌ బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.--మెండ ప్రవీణ్‌, బాలల ఆరోగ్య రక్ష, జిల్లా సమన్వయకర్త.

అంటువ్యాదులు ప్రబలకుండా జాగ్రత్త పడడము ముఖ్యము . శ్రీకాకుళం జిల్లాలో రక్షిత మంచినీరు త్రాగాలన్న అవగాహనలేదు . ఎక్కువగా చెరువునీరు, బావినీరు నే వాడుతున్నారు. ప్రతి గ్రామము లోను ఆరుబయట మలవిసర్జన చేయడం జరుగుతూ ఉన్నది . వానలము , వరదలకు ఈ అపరిశుబ్రత అంటా చెరువులు , బావులు లలో చేరుతుంది . అదే నీరు త్రాగడము అనేక రోగాలకు కారణము అవుతుంది. రాజకీయ వాగ్దానాలు ఇక్కడ ఉపయోగపడవు . సామూహిక కార్యదీక్ష , అవగాహన , వనరుల సమీకరణ , కఠోర పరిశ్రమ , నిరంతర నియంతా విధానాలు అవసరము .అది మన కాంట్రాక్ట్ పనివిధానము లో జరగడము సాధ్యము కాదు. నిస్వార్ధ సేవాదృక్పదము ఉండాలి . కొన్ని కఠినమైన శాసన విధానాలు అవసరము .ఉదా: ఇల్లు కట్టేవాడు ... అది గుడిసైనా . పూరి పాకైనా , మేడ అయినా , భవంతి అయినా తప్పనిసరిగా మరుగుదొండ్లు ఉండాలన్న నియమము ఉండాలి . దానిని  అమలు పరిచే అధికాలూ ఆత్మవిశ్వాసముతో పనిచేయాలి.  అప్పుడే ఆరోగ్య సమాజము నిర్మితమవుతుంది.
  • =======================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -