Tuesday, April 9, 2013

Govt hospitals in Srikakulam district,శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు .





Total HealthCenters :
PHCs+Dispensaries= 85 ,
Sub Centers =514 (జిల్లాలో మొత్తం ఉపకేంద్రాలు ( SCs)

Community Health Centers_3    ,
1.Amadalavalasa   
2.Ponduru   
3.Seethampeta   

Mobile Medical Units_2    
1.Pathapatnam   
2.Itchapuram   

Area Hospitals_5    
1.Narasannapeta   
2.Palasa   
3.Palakonda   
4.Rajaam   
5.Tekkali   

Dist.HeadQuarters Hospital-1
RIMS college hospital - 1


----Ayurvedic Dispensaries:--------------

1.Neelanagaram 2.Baruva , 3.Sankili, 4.Kandyam, 5.Boorja, 6.Komarivanipeta, 7.Nivagam, 8. Nuvvularevu, 9. Poondi, 10.Timadam , 11. Singupuram , 12. Srikakulam , 13. Seetammpeta , 14. Harischandrapuram , 15. Jalumuru , 16. Nowpoda , 17. Shalantra.

-----Homeopathic Dyspensaries:---------

1.Srikakulam , 2. Mamidipalli , 3. Rajaam , 4. Srimukhalingam , 5. Chodavaram , 6. Jagathi , 7. Talavaram , 8. Rapaka , 9. Santhavuriti , 10. S.M Puram , 11. Thotada , 12. Bhanuru , 13. Brahmanatarla , 14. Korlakota, 15. Korasavaada , 16. Temburu , 17.Cheedipudi.

  • =========================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

శ్రీకాకుళం జిల్లాలో క్లస్తర్ ఆరోగ్య విధానము,Cluster health system in Srikakulam dist.

  •  

 ఉన్న ఆరోగ్య కేంద్రాలను పఠిస్ట పరచకుండా ఏదో కొత్త విధానము ప్రవేశ పెట్టినంత మాత్రాన మంచి జరుగుతాదనుకోవడం పొరపాటే అవుతుంది . మరి పొరపాటో లేక గ్రహపాటో జూన్‌ 2011 లో శ్రీకాకుళం ఆరోగ్య కేంద్రాలను , వాటి రూపు రేఖలను మార్పు చేసారు .

క్షేత్ర స్థాయిలో ప్రజరొగ్యం మెరుగు పరిచేందుకు ప్రభుత్వము ప్రజా ఆరొగ్య పౌష్టికాహార సముదాయాల (కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్‌ క్లస్టర్స్ ) ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేసినది . ఈ మేరకు సిబ్బంది నియమకాలు కూడా చేపట్టింది . ప్రస్తుతం ఉన్న విధానము కంటే మెరుగైన సేవలందించేందుకు ఈ సముదాయ విధానము అమలుచేస్తున్నట్లు వెళ్ళడించారు . వీటి గొడుగు కిందకు పి.హెచ్ .సి ల పాలన తీసుకురానున్నారు . గ్రామీణ ప్రాంతాల రోగులు పి.హెచ్.సి సేవలు వినియోగించుకోకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తుండడం తో ఆసుపత్రులలో రోజుల తాకిడి ఎక్కువైనది ... పి.హెచ్.సి లు వెలవెలబోతున్నాయి . ఈ విధానానికి స్వస్తి చెప్పి అటు పి.హెచ్.సి లకు ఇటు ప్రభుత్వ హాస్పిటల్స్ కు అనుసంధానము చెసేందుకు క్లస్తర్ విధానము అమలులోకి తీసుకువస్తున్నారు .

శ్రీకాకుళం జిల్లాలో 18 క్లస్టర్లను రూపొందించారు . . . వీటి పరిధి లోమి 76 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు వస్తాయి . క్లస్తర్లలో 104 వాహనాల సేవలు కూడా రానున్నాయి .

సిబ్బంది నియామకము :
క్లస్టర్ కేంద్రాలలో ఎస్.పి.హెచ్.ఓ. . ల నియామకాలు జరిగాయి . జిల్లావ్యాప్తముగా 18 క్లస్టర్లు గాను 12 S.P.H.O లను నియమించారు . వీరు కేవలము కార్యాలయాలకే పరిమితం కాకుండా వారానికి ఐదు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించవలసి ఉంటుంది . క్లస్తర్ పరిధిలోని పి.హెచ్.సి లలో కార్యకలాపాలు వేగవంతం చేయడం , సి.హెచ్.సి లకు కేసులు తరలించడం వంటి పనులలో పాల్గొనాల్సి ఉంటుంది . అలాగె పి.హెచ్.సి లలోని వైద్యులు వారానికి మూడు రోజులు పాటు 104 వాహనము తో పర్యటించాల్సి ఉంటుంది .



  • ================================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

Nursing college in RIMS-Srikakulam,రిమ్స్‌-శ్రీకాకుళం లోనర్సింగ్‌ కళాశాల




రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో ఈ ఏడాది నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేయనున్నందున రిమ్స్‌లో మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా బృందం ప్రొఫెసర్‌ విలియమ్స్‌, ప్రొఫెసర్‌ బాలామణి సోమవారం వచ్చారు. మొదట వీరు రిమ్స్‌ డైరెక్టర్‌ తెన్నేటి జయరాజ్‌ను కలసి తాము వచ్చిన విషయం వివరించి రిమ్స్‌లో కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్‌లో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.రెండు కోట్లు కేటాయించిందని రిమ్స్‌ ఆవరణలో భవన నిర్మాణం చేపట్టనున్నామన్నారు. ఏపీహెచ్‌ఎం.హెచ్‌ఐడీసీ అధికారులు భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ ఏడాది 50 సీట్లతో కళాశాల నిర్వహించనున్నందున భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు వైద్యకళాశాల రెండో అంతస్థులో తరగతులు నిర్వహించుకునేందుకు వీలు కల్పించామని చెప్పారు. జనరల్‌ ఆసుపత్రిని, వైద్య కళాశాలను పరిశీలించిన బృందం శ్రీకూర్మంలోని రిఫరల్‌ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అక్కడి నుంచి రిమ్స్‌కు వచ్చి వెళ్లిపోయారు. నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ జి.లోకేశ్వరి కళాశాల నిర్వహణకు రిమ్స్‌లో కల్పించిన సౌకర్యాలను బృంద  సభ్యులకు వివరించారు.

courtesy with Eenadu local news
  • =======================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -