ఆంధ్రప్రదేశ్‌లోని సామాన్య ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలందించడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక పథకం ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’. ఈ పథకానికి సంబంధించి రోగులకు వైద్యసేవలు అందించే ఆసుపత్రుల ఎంపిక ప్రక్రియ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు అందించే వైద్య సేవల నాణ్యతపై నిరంతరం దృష్టిసారించేందుకుగాను ముఖ్య వైద్యాధికారి ఉంటారు. ఆసుపత్రుల ఎంపికకు సంబంధించిన జాబితా రూపకల్పన మరియు క్రమశిక్షణా కమిటీ (Empanelment and Disciplinary Committee - EDC)కి ముఖ్య వైద్య గణకాధికారి (Chief Medical Auditor) నేతృత్వం వహిస్తారు. ఆసుపత్రుల్లో తగిన మేరకు మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సామగ్రి తగినంతగా ఉండేలా చూసే బాధ్యతను EDC వహిస్తుంది. ఈ ఆసుపత్రుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెల్ల రేషన్కార్డులున్న నిరుపేదలంతా 1999 జూలై
17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో
ఆరోగ్యశ్రీ ఒకటి, రెండు పథకం క్రింద ఉచితంగా శస్త్రచికిత్సలు
చేయించుకోవడానికి అర్హులవుతారని ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర
రెడ్డి చెప్పారు. ఈ వినూత్న పథకానికి యుపిఎ అధ్యక్షురాలు
సోనియాగాంధీ ఒంగోలులో ప్రారంభిస్తారు. ఆరోగ్యశ్రీ 1 పథకాన్ని మరో ఐదు
జిల్లాలకు విస్తరింప చేయడంతో పాటు, 18 జిల్లాల్లో కొత్తగా మరిన్ని
రుగ్మతలకు శస్త్రచికిత్స అవకాశం కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ 2
పథకాన్ని అమలుచేస్తారు. బుధవారంనాడు సచివాలయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని
ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆరోగ్యశ్రీ 1 క్రింద తెల్ల రేషన్కార్డులున్న
వారు అనేక రుగ్మతలకు చికిత్స, శస్త్ర చికిత్సలు బీమా పద్ధతిలో
పొందుతుండగా, ఆరోగ్యశ్రీ 2 క్రింది మరిన్ని దాదాపు అన్ని రుగ్మతలకు
ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచితంగా చికిత్స సౌకర్యం పొందుతారు.
అందుకయ్యే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ దృష్ట్యా ఆరోగ్యశ్రీ
క్రిందకు రాని పింక్ రేషన్కార్డులు ఉన్న వారికి మాత్రమే ఇకపై ముఖ్యమంత్రి
సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యశ్రీ 2 పథకం క్రింద మొదటి
పథకంలోని 330 రుగ్మతలు కాకుండా మరో 370 కొత్త రుగ్మతలకు శస్త్రచికిత్సలు,
149 రకాల రుగ్మతలకు చికిత్సా సౌకర్యం కల్పించనున్నారు. ఈ రుగ్మతల జాబితాను
ముఖ్యమంత్రి బుధవారంనాడు ఆమోదించారు.
ఆధారం : (ఆంధ్రప్రభ
ప్రతినిధి) ,
హైదరాబాద్.
జిల్లాలో నెలకు ఐదు మెగా వైద్యశిబిరాలు
ఇకపై జిల్లాలో నెలలో ఐదు మెగా వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశ్రీ మేనేజరు వెల్లడించారు. గతంలో నెలకు 30 ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలు నిర్వహించడం జరిగేవని, వీటిని కుదించి ఐదు మెగా వైద్య శిబిరాలుగా నిర్వహిస్తామన్నారు. ఈ వైద్య శిబిరాల్లో కనీసం 50 మంది ఓపీ ఉండే రెండు కార్పొరేటు ఆసుపత్రులు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొంటారన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఎప్పటివలే 938 జబ్జులు ఉన్నాయని, వీటిల్లో 138 జబ్బులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని నిర్దేశించినట్లు తెలిపారు. ఈ జబ్బులకు కేటాయించిన నిధులు ప్రభుత్వ ఆసుపత్రుల ఖాతాల్లోకి జమ చేస్తారన్నారు. ఆరోగ్యశ్రీకింద వైద్యం పొందేందుకు తెలుపు రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఉండాలన్న నిబంధన ఏమీ లేదన్నారు. ఆర్‌హెచ్‌పీ, టీఏపీ పథకాల ద్వారా కూడా ఈ వైద్యానికి అర్హులేనన్నారు. కొత్తగా సీఎంసీవో ద్వారా వైద్యం పొందవచ్చన్నారు. ఇందుకోసం తహశిల్దారు ధ్రువీకరిస్తే.. సరిపోతుందన్నారు.
- ===================