పీజీ కోర్సుల కోసం యత్నం
జూనియర్ డాక్టర్లు పీ.జి. కోర్సులు చేసేందుకు ఇతర వైద్యకళాశాలలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. మొదటి బ్యాచ్ విడుదలైన నేపధ్యంలో రిమ్స్‌లోనే పీజీ కోర్సులు స్థాపనకు అవసరమయ్యే కసరత్తును ప్రారంభించామమని గత నెలలో తనతో పాటు కొంత మంది ఒక బృందంగా కడపలోని రిమ్స్ వైద్య కళాశాలకు వెళ్లి అక్కడ నిర్వహిస్తున్న పీజీ కోర్సులు, వాటికి సంబంధించిన మౌళిక సదుపాలయను పరిశీలించామన్నారు. అక్కడి నుంచి వచ్చాక స్థానిక రిమ్స్‌లో అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించి మొత్తం 13 విభాగాల్లో పీజీ కోర్సులు ప్రారంభించేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు ఉన్నట్టు గుర్తించి వైద్యవిద్య సంచాలకులకు తెలియజేశారు.
భారతీయ వైద్య మండలికి నివేదన
రిమ్స్‌లో ఉన్న 21 విభాగాల్లో 13 వాటిల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)కి సమగ్ర వివరాలతోనివేదించామన్నారు. మెడిసిన్, సర్జరీ, స్త్రీ, ప్రసూతి వైద్యం, (చెవి, ముక్కు, గొంతు), నేత్ర వైద్యం, ఛాతీ వైద్యం, చిన్నపిల్లల వైద్యం, ఫిజియాలజీ. అనాటమీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ,కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల్లో ప్రారంభించనున్నామని వివరించారు. ఆరునెలల్లో ఎం.సి.ఐ. బృందం రిమ్స్ పరిశీలించి అనుమతి ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
మెరుగైన వైద్యం అందిస్తాం
రిమ్స్‌కు వచ్చేది నిరుపేదలేనని వారంతామంచి వైద్యం అందుతుందని ఎంతో ఆశతో వస్తారని వారి విశ్వాసం కాపాడతామన్నారు. ఈక్రమంలో వైద్యులు, సిబ్బంది ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. ఇప్టటికే అన్ని విభాగాలకు తగు ఆదేశాలు జారీ చేశామని, అన్ని వార్డుల్లో నర్శింగ్ సూపరింటెండెంట్లకు తగు మార్గదర్శకాలు జారీచేశామన్నారు. రోగులను ప్రేమతో చూడటంవలన సగం వ్యాధి నయం అవుతుందని ఈవిషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలని ఆదేశించామన్నారు.
ప్రిలిమినరీ హెల్త్ చెకప్ సెంటర్లు
వైద్యకళాశాలలో ప్రస్తుతం ఉన్న అవుట్‌పేషంట్ విభాగంలో సమూల మార్పులుచేసి జూనియర్‌డాక్టర్లతో ప్రిలిమినరీ హెల్త్ చెకప్ సెంటర్లు అయిందింటిని ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానం వలన రోగి వ్యాధి గుర్తించి నేరుగా సంబంధిత వైద్యనిపుణుని వద్దకు పంపించడంతో జాప్యం నివారించబడుతుందన్నారు. ఎమర్జన్సీ విభాగంలో కొంత మార్పులు చేయడంతో పాటు ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో మౌళిక సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
30వేల డయాలసిస్‌లు
ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు 30వేల పైబడి డయాలసిస్‌లు పూర్తి చేశామన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు 400 పైబడి శస్త్ర చికిత్సలు చేసి ఆరోగ్య మంతులను చేస్తున్నామని వివరించారు. రిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రిమ్స్‌లోనిర్మాణంలో ఉన్న భవన నిర్మాణాలు పూర్తి అయిన వెంటనే అదనపు వైద్య సీట్ల కోసం భారతీయ వైద్య మండలికి దరఖాస్తు చేస్తామన్నారు. తనకు అన్ని విభాగాల అధిపతులు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, నర్శింగ్ సిబ్బంది, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు అంతా సహకరిస్తున్నారని వివరించారు. రిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు.
Courtesy with : న్యూస్‌టుడే-గుజరాతీపేట.
- =======================