శ్రీకాకుళం లో నకిలీ మందుల వ్యాపారము గురించి ప్రత్యేకం గా ఏమీ లేదు కాని .. రాష్ట్రము లో కొనసాగుతున్న అక్రమ నకిలీ మందుల అమ్మకాలు ఇక్కడా జరుగుతున్నాయి . . నాలుగు మునిసిపాలిటీలు , 38 మండలాలు ఉన్న శ్రీకాకుళం జిల్లలో ఎక్కువమంది గ్రామీణ ..అంతగా చదువులేని అమాకయక ప్రజలు , సగానికి పైగా గిరిజనులు ఉన్నారు . వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది మందుల వ్యాపారులు , మందులల కంపినీ ఏజెంట్లు నకిలీ మందులు చలామణి చేస్తున్నారు . చూడడానికి అసలైన మందులు లాగే ఉంటాయి ... పని మాత్రం ఉండదు .. జబ్బులు నయం కాదు .. డాక్టర్లకు తలనొప్పి , రోగులకు ప్రాణసంకటం .
అదొక కర్కశ వ్యాపారం.. చట్టాల 'నియంత్రణ'కు లొంగని వ్యవహారం.. రోగుల అమాయకత్వమే పెట్టుబడిగా సాగుతున్న మంచి వ్యాపారము .. నకిలీ ఔషధాలతో నిలువునా మోసం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుతున్న చెలగాటం.
భారత ఔషధ పరిశ్రమకు నకిలీ మందులు సవాలు విసురుతున్నాయి. ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చెడ్డపేరునూ తీసుకొస్తున్నాయి. దేశీయంగా అయితే.. అమ్ముడవుతున్న ప్రతి అయిదు ఔషధాల్లో ఒకటి నకిలీదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాశీనత, ఔషధ నియంత్రణ శాఖ అలసత్వం, ప్రజల అమాయకత్వం వెరసీ మార్కెట్‌లో నకిలీ ఔషధాల విక్రయాలు జోరుగా సాగిపోతున్నాయి.
నకిలీ'ల జోరుకు కారణాలివి..
* ఔషధాల నాణ్యతను సరిగ్గా నిర్థరించే ప్రయోగశాలలు ఎక్కువగా లేకపోవడం.
* ఔషధ తయారీ పరిశ్రమలకు ఇష్టారీతిగా అనుమతుల మంజూరు
నమ్మలేని నిజాలు..
* ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ప్రపంచం మొత్తంమ్మీద తయారవుతున్న నకిలీ మందుల్లో 35 శాతం భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి.
* ప్రపంచంలో చలామణీలో ఉన్న నకిలీ ఔషధాల్లో 75 శాతం ఇండియాలో కనపడతాయి. ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఒ.ఇ.సి.డి.) నివేదికలో చెప్పిన విషయమిది.
* 'అసోచామ్' అంచనా ప్రకారమైతే దేశంలో నకిలీ మందుల విక్రయాల వ్యాపారం ఏటా 25 శాతం వృద్ధి చెందుతోంది.
* మన దేశ మార్కెట్‌లో ఉన్న మందుల్లో ఎనిమిది శాతమే అనుమానించదగినవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. చి ఔషధ నియంత్రణ చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడం
* సిబ్బంది కొరత, కీలకమైన డ్రగ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులనూ భర్తీ చేయకపోవడం
* గడువు దాటిపోయిన మందుల్ని లేబుళ్లు మార్చేసి అమ్మేస్తున్నా పట్టించుకోని అధికారులు
వీటిన్నింటితో దేశంలో నకిలీ మందుల విక్రయాలు యథేచ్చగా జరుగుతున్నాయి.కొందరు అధికారులూ సహకరిస్తుండటంతో అక్రమార్కులకు అడ్డుకట్ట పడట్లేదు.
* రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు..
* ఔషధ తయారీ పరిశ్రమలు, విక్రయ కేంద్రాలకు లైసెన్సుల మంజూరు
* ఔషధ ప్రయోగశాలలకు లైసెన్సుల జారీ, డ్రగ్ ఫార్ములేషన్‌కు అనుమతి
* రాష్ట్రంలో తయారయ్యే, విక్రయాలు జరిగే మందుల నాణ్యతను పరీక్షించడం
* లైసెన్సుల మంజూరుకు ముందు, తర్వాత తనిఖీలు
* నాణ్యత లేని ఔషధాలను మార్కెట్ నుంచి ఉపసంహరింపచేయడం
వీటన్నింటిపై సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు చేయవచ్చు. సెక్షన్ 2(జె)(ii) ప్రకారం రికార్డుల తనిఖీకి కూడా అనుమతి కోరవచ్చు.
మనము - ఏం అడగొచ్చంటే..
రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖకు దరఖాస్తు చేసి ఈ కింది సమాచారం తీసుకోవచ్చు.
* లైసెన్స్‌డ్ బ్లడ్ బ్యాంకుల వివరాలు, నిషేధిత ఔషధాల జాబితా
* గుర్తించిన మందుల రేట్ల వివరాలు
* కెమిస్టులు, డ్రగ్గిస్టుల సేవలపై వచ్చిన ఫిర్యాదులు
* ఔషధాల నాణ్యత; మందుల దుకాణాలు, తయారీ కేంద్రాలపై చేసిన దాడులు,
* గుర్తించిన అవకతవకలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు
* వివిధ రకాల లైసెన్సుల మంజూరు, రెన్యూవల్‌కు అనుసరించిన ప్రాతిపదికలు
* డబ్ల్యూహెచ్ఓ జీఎంపీ, ఫ్రీసేల్, మార్కెట్ స్టాండింగ్, జీఎంపీ సర్టిఫికెట్ల జారీకి అనుసరించిన ప్రాతిపదికలకు సంబంధించిన సమాచారం
* మందుల నాణ్యతపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలు
మనమేం చేయాలంటే..
* గుర్తింపు పొందిన వైద్యుల సూచనల మేరకే ఔషధాలను వినియోగించాలి.
* అనుమతులున్న దుకాణం నుంచే మందులు కొనాలి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి.
* తయారీదారు పేరు, బ్యాచ్ నంబరు, గడువు ముగిసే తేదీ, ఎంఆర్‌పీ, డాక్టర్ పేరు, అర్హత, డ్రగ్ లైసెన్స్ నంబరు తదితరాలన్నీ బిల్లులో ఉండేలా చూసుకోవాలి.
* ఔషధానికి సంబంధించి అనుమానాలుంటే (నకలీ అని భావిస్తే), వినియోగించిన తర్వాత అనుకోని రియాక్షన్లు వచ్చినా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలి.
- ======================================================
No comments:
Post a Comment
Your comment is very important to improve this blog/site