పశువైద్య వృత్తి ఒక ప్రత్యేకమైన వృత్తి. సవాళ్లతో కూడుకున్న వృత్తి. ఎందుకంటే, అనారోగ్యంతో వైద్యశాలకు వచ్చే మూగజీవాలు (పశువులు, జంతువులు) బాధను, భావాలను వ్యక్తపరచలేవు. వాటి యజమానులు కూడా జంతువుల అవస్థను, వివరాలను పశువైద్యులకు పూర్తిగా అందించలేరు. మరోవైపు వ్యాధి నిర్ధారణకు
సంబంధించి, మనుషుల వైద్యశాలలో ఉండేటన్ని పరికరాలు కానీ, సౌకర్యాలు కానీ పశువైద్యశాలలో ఉండవు. ఇలాంటి ప్రతికూల పరిస్థితితో వ్యాధిని అర్ధం చేసుకుని, రైతు ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా, సత్వర చికిత్సను అందించవలసిన క్లిష్టతరమైన బాధ్యత పశువైద్యులది
పశువులకు వైద్యసేవలు అందించేందుకు వీలుగా మండలకేంద్రాలలో పశువైద్యశాలలు , గ్రామీణ ప్రాంతాలలో ఉపకేంద్రాలు ఏర్పాటుచేసారు . వీటిద్వారా వందలాది మూగజీవులు మృత్యువాత పడకుండా కాపాడుతున్నారు .
శ్రీకాకుళం జిల్లాలో 38 మండలాలలో 57 ప్రధాన పశువైద్య కేంద్రాలు , 123 ఉపకేంద్రాలు ఉన్నాయి. వీటిద్వారా కోట్లాది పశువులు ఉదా: ఆవులు , ఎద్దులు , గేదెలు , దున్నలు , మేకలు , గొర్రెలు , కుక్కలు , పక్షులు మున్నగు మూగజీవులు లభ్దిపొందుతున్నాయి .
సాదారణముగా పశువులకు ...సోకే జబ్బులలో గొంతువాపు వ్యాది , జబ్బవాపు వ్యాది , గాలికుంటు వ్యాధి లు ముఖ్యమైనచి . కుక్కలకు ' రాబీస్ ' వ్యాధి అతి భయకరమైనది
పశువైద్యశాలల ముఖ్యమైన విధులు :
- పశు రోగాలను నయం చేయడం ,
- వ్యాధినిరోధక టీకాయలు వేయడం ,
- వ్యవసాయ రైతులకు పశు సంపద , సహాయం అందజేయడం ,
- పాడిపరిశ్రమను అభివృద్ధి కి దోహదం పడడం ,
- పశుసంపద అభివృద్ది, గోజాతి, పెంపుడు, అడవి జంతువులు, పక్షులు, గుర్రాలలో సాధారణ వచ్చు ఉత్పత్తి, అంటు వ్యాధుల వైద్య0.
- ================================
Hello and Welcome to our King Street Family Dental Centre
ReplyDeletewebsite. Our state of the art dental practice is located in Kitchener -
Waterloo, central to both cities for your convenience.