రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఈ ఏడాది నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయనున్నందున రిమ్స్‌లో మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం ప్రొఫెసర్ విలియమ్స్, ప్రొఫెసర్ బాలామణి సోమవారం వచ్చారు. మొదట వీరు రిమ్స్ డైరెక్టర్ తెన్నేటి జయరాజ్‌ను కలసి తాము వచ్చిన విషయం వివరించి రిమ్స్‌లో కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్‌లో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.రెండు కోట్లు కేటాయించిందని రిమ్స్ ఆవరణలో భవన నిర్మాణం చేపట్టనున్నామన్నారు. ఏపీహెచ్‌ఎం.హెచ్‌ఐడీసీ అధికారులు భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ ఏడాది 50 సీట్లతో కళాశాల నిర్వహించనున్నందున భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు వైద్యకళాశాల రెండో అంతస్థులో తరగతులు నిర్వహించుకునేందుకు వీలు కల్పించామని చెప్పారు. జనరల్ ఆసుపత్రిని, వైద్య కళాశాలను పరిశీలించిన బృందం శ్రీకూర్మంలోని రిఫరల్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అక్కడి నుంచి రిమ్స్‌కు వచ్చి వెళ్లిపోయారు. నర్సింగ్ సూపరింటెండెంట్ జి.లోకేశ్వరి కళాశాల నిర్వహణకు రిమ్స్‌లో కల్పించిన సౌకర్యాలను బృంద సభ్యులకు వివరించారు.
courtesy with Eenadu local news
- =======================
No comments:
Post a Comment
Your comment is very important to improve this blog/site