ఎంసెట్ ద్వారా ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ- ఎ సీట్లు మాత్రమే భర్తీ చేస్తారు. కేటగిరీ- బి, సి సీట్లను మేనేజ్‌మెంట్ కమిటీ వేరొక ప్రవేశపరీక్ష నిర్వహించుకుని ఆ భర్తీ చేస్తుంది.
తెలంగాణలో అయితే బి కేటగిరీకి రూ.9 లక్షలు, సి కేటగిరీకి రూ.11 లక్షల ఫీజు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బి కేటగిరీకి రూ.11.50 లక్షలు, సి కేటగిరీకి బి కేటగిరీ ఫీజుకు 5రెట్ల వరకు అనేవిధంగా నిర్ధారణ చేశారు. తెలంగాణలో 850 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 1025 సీట్లు ఈ ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. దీనిమీద స్పష్టత ఏర్పరచుకుంటే మిగిలిన సీట్ల గురించి కేటాయింపులు అర్థమవుతాయి.
తెలంగాణ
తెలంగాణలో మొత్తం 20 వైద్య కళాశాలలున్నాయి. వీటిలో మొత్తం సీట్లు 2850. ఈ 20 కళాశాలల్లో ఓ మెడికల్ కళాశాలకు సీట్ల కేటాయింపు లేదు. అంటే 19 కళాశాలలే ఉన్నట్లు. వీటిలో డెక్కన్, షాదన్ రెండూ మైనారిటీ కళాశాలలు. వీటిలోని సీట్ల సంఖ్య 300 తీసివేస్తే ఇక మిగిలిన సీట్లు 2550.
తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రభుత్వ, 3 మైనారిటీ (ఒక కళాశాలకు సీట్ల కేటాయింపు లేదు), 12 ప్రైవేటు మెడికల్ కళాశాలలున్నాయి. 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 850 సీట్లున్నాయి. 12 ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లు 1700. వీటిలో 50% కేటగిరీ- ఎ, మిగిలిన 50% కేటగిరీ బి, సి. అంటే కౌన్సెలింగ్‌లో వచ్చే సీట్లు 850 మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా నింపే సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో 850, ప్రైవేటు కళాశాలల్లో 850. అంటే కౌన్సెలింగ్‌కు వచ్చే సీట్ల సంఖ్య మొత్తం 1700 మాత్రమే.
ఈ ఏడాది తొలి కౌన్సెలింగ్‌లో ప్రతి విభాగంలోనూ గత సంవత్సరంతో పోల్చితే ర్యాంకు తగ్గే అవకాశముంటుంది.
ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలలు తెలంగాణలో ఉండడం వల్ల ఇక్కడ చాలా ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోనే మెడికల్ సీట్లు ఎక్కువ. గత సంవత్సరం కటాఫ్ ర్యాంకు ఆధారంగా కొంతవరకు చెప్పవచ్చు. కానీ విశ్లేషకులు అనుకున్నదానికంటే కటాఫ్ ర్యాంకులు తెలంగాణలోనే బాగా తగ్గే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 మెడికల్ కళాశాలలున్నాయి. వీటిలో శ్రీకాకుళం కళాశాలలో సీట్లు కేటాయించలేదు. కాబట్టి 25గానే తీసుకోవచ్చు. ఈ 25 మెడికల్ కళాశాలల్లో కడపలోని ఫాతిమా కళాశాల మైనారిటీ, ఆడపిల్లలకు మాత్రమే. దీన్ని కౌన్సెలింగ్‌లో కలపవలసిన అవసరం లేదు. మిగిలిన 24 కళాశాలల్లో 12 ప్రభుత్వ మెడికల్, 12 ప్రైవేటు మెడికల్ కళాశాలలు. 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 1900 సీట్లున్నాయి. అంటే తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు రెట్టింపు సీట్లున్నాయి. మిగిలిన 12 ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 1900 సీట్లున్నాయి. వీటిలో 50% సీట్లు అంటే 950 సీట్లు కేటగిరీ- ఎ అవుతాయి. వీటిని కౌన్సెలింగ్‌లో నింపుతారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌లో ప్రభుత్వ 1900, ప్రైవేటు 950 కలిపి 2850 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌లో కూడా ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువ భాగం ఉస్మానియా పరిధిలో ఉన్నారు. ఈ అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విద్యార్థులకు లాభం చేకూరుస్తాయి. తెలంగాణ ఎంసెట్ కటాఫ్ ర్యాంకు కంటే ఏపీ ఎంసెట్ కటాఫ్ ర్యాంకు బాగా ఎక్కువగా ఉండే అవకాశముంది.
ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో గత సంవత్సరం కౌన్సెలింగ్‌లో తుది ర్యాంకులు ఇచ్చారు (పట్టిక చూడండి). అయితే అవి రెండో కౌన్సెలింగ్ తర్వాత కాబట్టి తొలి కౌన్సెలింగ్‌లో ప్రతి విభాగంలోనూ గత సంవత్సరంతో పోల్చితే ర్యాంకు తగ్గే అవకాశముంటుంది.
బీడీఎస్
ఎంబీబీఎస్ తరువాత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది డెంటల్‌కే. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 12 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2 ప్రభుత్వ, 12 ప్రైవేటు; తెలంగాణలో ఒక ప్రభుత్వ, 11 ప్రైవేటు డెంటల్ కళాశాలలు. ఆంధ్రప్రదేశ్‌లో 1300, తెలంగాణలో 1080 సీట్లున్నాయి. వీటికి కూడా కేటగిరీ- ఎ వరకు మాత్రమే ప్రైవేటు డెంటల్ కళాశాలల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరుగుతుంది.
మెడికల్, డెంటల్ కళాశాలలు ఎప్పుడు ప్రారంభమైందో తెలియటం వల్ల ఒక అంచనా ఏర్పరచుకోవచ్చు. పోస్టుగ్రాడ్యుయేషన్ ఉన్నదీ లేనిదీ గ్రహించటం ముఖ్యం. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ సూపర్ స్పెషాలిటీలో ఉన్న కళాశాలల్లో చదవడం వల్ల విద్యార్థులకు తర్వాత అధిక లాభం చేకూరుతుంది.
--PVRK murty Director -- Sri Gayatri education institutions
- =========================
No comments:
Post a Comment
Your comment is very important to improve this blog/site