Sunday, April 25, 2010

Blood banks in Srikakulam , రక్త నిధి శ్రీకాకుళం లో





  • మనుషుల నుండి రక్తాన్ని సేకరించి .. గ్రూఫుల ప్రకారము లేబుల్స్ రాసి ఎయిడ్స్ , పచ్చకామెర్ల , వి.డి.అర్.యల్, మొదలగు అంటువ్యాధులు కోసం పరీక్షలన్నింటినీ సంభందిత నిపుణులైన టెక్నీసియన్ల చే తనికీ చేయించి , నిలువచేసే ప్రదేశం నే రక్త నిధి లేక బ్లడ్ బ్యాంక్ అంటాము . అవసరాన్ని బట్టి రక్తాన్నీ ఉచితంగా గాని , కొంత డబ్బు తీసుకొని గాని సరఫరా చేయుదురు .
  • శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ది చెందినప్పటికీ కృత్రిమ రక్తాన్ని తయారు చేసేవీలు లేక అనసరమైన మేరకు రక్తాన్ని దానం ద్వారా మాత్రమే సేకరించే వీలు వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా ఎనిమది లక్షల యూనిట్‌ల రక్తం అవసరం కాగా అందులో 6లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే 208 బ్లడ్‌బ్యాంక్‌ల ద్వారా సేకరించగలుగుతున్నారు.
రక్తం ఎక్కించవలసిన కొన్ని సాదారణ పరిస్థితులు :
  • రోడ్ ప్రమాదాలలో గాయాలైన వారికి ,
  • ఆపరేషన్ సమయం లో శరీర లో రక్తం తగినంత లేనపుడు .
  • రక్తహీనన ఉన్న రోజులకు ,
  • కొన్ని రక్త సంభందిత కాన్క్ష్సర్ రోగులకు ,
  • గర్భిణీ స్త్రీలకు కా్నుపు సమయం లోనూ, రక్తత స్రావము జరిగినపుడు ,

శ్రీకాకుళం జిల్లాలో రక్తనిధి నిల్వ కేంద్రాలు -ఫోన్‌ నంబర్లు :

  • శ్రీకాకుళం జిల్లాలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం ఉంది. రిమ్స్‌ జనరల్‌ ఆసుపత్రిలో ఒక రక్తనిధి ఉంది. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో పాలకొండ ఏరియా ఆసుపత్రి, పాతపట్నం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో రక్తనిధి నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వాటి ఫోన్‌ నంబర్లు :



  • * రెడ్‌క్రాస్‌ రక్తనిధి - శ్రీకాకుళం -- 08942 2226555
  • * రిమ్స్‌ రక్తనిధి - శ్రీకాకుళం --- 9000273960
  • * పాలకొండ ఏరియా ఆసుపత్రి - 08941 220130
  • * పాతపట్నం సామాజిక ఆసుపత్రి రక్తనిధి కేంద్రం - ఫోను: 99487 65449
  • * రెడ్‌క్రాస్‌ రక్తనిధి ఉపకేంద్రం - రణస్థలం - ఫోను: 94411 59726



శ్రీకాకుళం పరిస్థితి :

  • జనాభా : ----------------25 లక్షల పైనే ,
  • జాతీయ రహదారి విస్తీర్ణం --195 కి.మీ.
  • ఏటా ప్రమాదాల సంఖ్య ----1700 ,
  • ఏటా కావలసిన రక్తం ----35,000 యూనిట్స్ ,
  • రెడ్ క్రాస్ , రిమ్సు (RIMS) సేకరణ్ --15 వేల యూనిట్లు ,



  • జిల్లాలో సుమారు 300 వరకూ రికగ్నైజెడ్ నర్సింగ్ హోములు ఉన్నాయి . ప్రభుత్వ పెద్దాసుపతులు ఉన్నాయి . కొన్ని రిజిస్టర్ కాని నర్సింగ్ హొమ్లు సుమారు 50 వరకూ ఉన్నాయి . ఇన్ని హాస్పిటల్స్ కు కావలసిన రక్తం బల్డ్ బ్యాంక్ లలో దొరకదు .
  • పూర్వము ప్రతి ప్రైవేటు హాస్పిటల్ లోనూ , నర్సింగ్ హోం లోనూ తగు జాగ్రత్తలతో రక్తం సేకరించి అవసరమైనపుడు ఎక్కించేవారు . దబ్బులు ఎంత తీసుకుంటున్నారు అనేది కాదు ... అవసరానికి రక్తం లోకల్ గా దొరికేది . కాని ఎయిడ్స్ , హెపటైటిస్ జబ్బులు రావడం తో ప్రభుత్వ పరంగా ఆంక్షలు ఎక్కువ అయినందున ... బ్లడ్ బ్యాంక్ నుండే రక్తం సరఫరా అవ్వాలని నిబందనలు ఉండడం తో రక్తం సరఫరా లొ సానుకూలత లేక కొరత యేర్పడినది . జిల్లాలొ ఒకేఒక "రెడ్ క్రాస్ " రక్త నిధి , రిమ్‌స్ హాస్పిటల్ లొ ఒక రక్తనిధి ఉన్నాయి . జిల్లా అంతటికీ సప్లై అవడం కస్టం . అందుకే దొంగతనం గా రక్తం ఎక్కించే కొన్ని నకిలీ బ్లడ్ బ్యాంక్ లు అక్కడక్కడ జిల్లాలో ఉన్నాయి . ఇటువంటివి 4 -5 వరకూ ఉన్నాయంటే ఆశ్చర్య పడనవసరం లేదు .


రక్తము దాతల -- అర్హతలు -- జాగ్రత్తలు :
  • రక్తదాతలు సంపూర్ణ ఆరోగ్యము కలిగిఉండాలి ,
  • 18 నుండి 60 యేళ్ళ చధ్య స్త్రీ ,పురుషులు ఎవరైనా రక్తదానము చేయవచ్చును ,
  • రక్తదాత 45 కేజీ ల బ్రువు పబడి ఉండాలి .
  • సాదారణ స్థాయిలొ బి.పి , సుగరు ఉండాలి ,
  • మూడు నెలల వ్యవధి లో యేడాదికి నాలుగు సార్లు రక్తదానము చేయవచ్చు ,
  • రక్తదానము చేయడానికి 12 గంటలు ముందు , తరువాత ఆల్కహాల్ తీసుకోకూడదు ,
  • స్త్రీలు రుతుక్రమము లోను , గర్భము దరించిన నుండి , బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .
శరీరం లో చాలినంత రక్తం లేకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు . శరీరం లొ 5 - 6 లీటర్ల రక్తం ఉంటుంది . అంటే శారీకక బరువులో ఇది 8 శాతము . ఒక కిలో శరీరము బరువుకు 80 ఎం.ఎల్ . చొప్పున్న ఉంటుందన్నమాట . శరీరం లోని అవయవాలు సక్రమం గా పనిచేయడానికి సరిపడ రక్తం అవసరము .

  • రక్తం లో ఏమి ఉంటాయి :
  • 55 శాతము ప్లాస్మా ,
  • 45 శాతము సెల్స్ .... ఉంటాయి .
  • ప్లాస్మాలో 91% నీరే , 8% ఆర్గానిక్ మాలిక్యూల్స్ , 1% ఇనర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి .
  • సెల్స లో ఎర్రరక్తకణాలు (RBC),తెల్లరక్తకణాలు(WBC) , ప్లేట్ లెట్స్(platlets) ఉంటాయి .
  • ఒక లీటరు రక్తం లో --- ఎర్ర రక్తకణాలు =5-6 మిలియన్లు -ఆక్షిజన్ సరఫరా కు తోడ్పడతాయి ,
  • --------------------తెల్లరక్త కణాలు =4-11 మిలియన్లు ,--శరీరం లొ ఇంఫెక్షన్ పై దాడి చేసి రక్షణ కల్పిస్తాయి .
  • -------------------ప్లేట్ లెట్స్ కణాలు=1.5 - 4 మిలియన్లు ఉంటాయి -- రక్తం గడ్డ కట్టడానికి సహకరిస్తాయి .
  • ఎర్రరక్త కణాలు తగ్గితే అనీమియా అంటారు . ఎర్ర కణాలు శరీరము లో ఆక్షిజన్ సరఫరాకు ఉపయోగ పడతాయి . ఐరన్ , ఫోలిక్ ఆసిడ్ , విటమిను బి12 , విటమిను సి , తగినంత పోటీన్లు లేకపోవడం వలన రక్తహీనత ఏర్పడుతుంది .

రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో కణవిభజన కేంద్రం-- ఒక యూనిట్‌ రక్తంతో నలుగురికి ఉపకారం --- 05/Sept/2011



  • జిల్లాలో విస్తారమైన జాతీయ రహదారి ఉంది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో రోగులను కాపాడేందుకు ఏడాదికి 40వేల యూనిట్ల రక్తం అవసరం. స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్‌, రిమ్స్‌ ఆసుపత్రి, రక్తదాన శిబిరాల నుంచి 15 వేల యూనిట్లు మాత్రమే వస్తోంది. రక్త కణ విభజన కేంద్రం ప్రారంభమైతే ఒక యూనిట్‌ రక్తం నలుగురికి ఉపయోగపడుతుంది.


జిల్లాలో రక్త కణ విభజన (బ్లడ్‌ కాంపోనెన్ట్స్‌) కేంద్రం లేకపోవడంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో ఇటీవల డెంగీ జ్వరాలతో బాధపడుతున్న వారు అవసరమైన రక్తఫలికలు లభించకపోవడంతో మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఏడాది కిందట రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో కణ విభజన కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం లభించినప్పటికీ దస్త్రం దశలో నిలిచిపోయింది. రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు జగన్మోహనరావు జిల్లాలో దీని అవసరాన్ని వివరిస్తూ పదేపదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు స్పందించింది. ఈ వ్యవస్థ ప్రారంభించేందుకు అవసరమయ్యే ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన చేయాలని ఆదేశాలు రావడంతో.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్‌క్రాస్‌ రక్తనిధిపై భాగంలో రక్తకణ విభజనకు అవసరమయ్యే భవనాన్ని పూర్తి చేశారు. కణవిభజనకు అవసరమయ్యే వైద్య పరికరాలను ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ అందజేసేందుకు ముందుకు వచ్చింది. తదనంతరం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) జనరల్‌ఆసుపత్రిలో కూడా రక్త కణవిభజన కేంద్రం ఏర్పాటుకు అసవరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి అవసరమయ్యే పరికరాలు అమర్చినప్పటికీ కేవలం రక్తనిధికి రెన్యువల్‌ చేయలేదన్న సాకుతో నిలిచిపోయింది. ఆ పరికరాలు వృథాగా పడి ఉన్నాయి.


  • ఒక యూనిట్‌తో నలుగురికి మేలు-ఇప్పటి వరకు ఒక యూనిట్‌ రక్తంఒక్కరికే ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో రోగికి కావాల్సిన కణాలు తప్పా మిగతావన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. రక్తకణ విభజన కేంద్రం అందుబాటులోకి వస్తే ఒక యూనిట్‌ రక్తంతో నలుగురికి ప్రాణదానం చేయవచ్చు. రక్తంలో ఎర్ర రక్తకణాలు(Red blood cells), తెల్లరక్తకణాలు(WBC), రక్తఫలికలు(platelets), ప్లాస్మా ఉంటుంది(plasma). అందరికీ ఇవన్నీ అవసరం ఉండవు. రక్తకణవిభజన వల్ల రోగి అవసరాలకు అనుగుణంగా కణాలను వినియోగించి ప్రాణాపాయం నుంచి కాపాడుతారు.


కణవిభజన..

  • * గుండెనొప్పితో బాధ పడేవారికి ఎర్రరక్తకణాలు అవసరం.
  • * వ్యాధినిరోధకశక్తితో బాధ పడేవారికి తెల్లరక్తకణాలు అవసరం.
  • * పౌష్టికారలోపం ఉన్నవారికి ప్లాస్మా అవసరం.
  • * డెంగీ, తదితర జ్వరాలతో బాధ పడేవారికి రక్తఫలికలు అవసరం.
  • * ఇవన్నీ ఒక యూనిట్‌ రక్తం ఉండడం వల్ల దేనికది విభజించి ప్యాకెట్ల రూపంలో అందుబాటులోకి తీసుకువస్తే ప్రాణాపాయంలో ఉన్న ఎంతో మందిని రక్షించే అవకాశం ఉంది.


జిల్లా కేంద్రంలోని రక్తనిధిలో రక్తకణ విభజన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భవన నిర్మాణం పూర్తి అయ్యింది. సంబంధిత వైద్య పరికరాలు రాగానే ప్రభుత్వ ఆమోదంతో కలెక్టర్‌ మార్గనిర్దేశంతో దీన్ని ప్రారంభిస్తాం.----- జగన్మోహనరావు, రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు

  • update on 04/Jan/2013

ఏడాదికి ఒకసారైనా రక్తదానం చేయండి-యువతకు జిల్లా కలెక్టరు పిలుపు :
 యువత అంతా కనీసం ఏడాదికోసారైనా రక్తదానం చేసి సమాజ సేవలో పాలు పంచుకోవాలని జిల్లా కలెక్టరు సౌరభ్‌గౌర్‌ పిలుపు ఇచ్చారు. మండల పరిధిలోని చల్లవానిపేట వంశధార డిగ్రీ కళాశాల ఆవరణలో గురువారం ఆయన రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా యువకులు చైతన్యవంతులని, వీరంతా గ్రామీణ ప్రాంతాలలో రక్తదానంపై అవగాహన తీసుకురావాలని కోరారు. రక్తదానంతో ఎలాంటి నష్టం ఉండదన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న వివేకానంద సూక్తి స్ఫూర్తితో యువత మానవసేవ చేయాలని సూచించారు. విద్యార్థినులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. శిబిరంలో మొత్తం 70 మంది పాల్గొన్నారు. ప్రిన్సిపల్‌ లోకనాథం రక్తదానం చేసినవారికి ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు, సభ్యులు నిక్కు అప్పన్న, కమిటీసభ్యులు నిక్కు హరి సత్యనారాయణ, జాతీయ యువజన గ్రహీత చైతన్యకుమార్‌, తహశిల్దారు ఎం.కాళీప్రసాద్‌, సెట్‌శ్రీ మేనేజరు మురగయ్య, వంశధార డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ మధుబాబు, గీతాశ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు 45వేల యూనిట్ల రక్తం అవసరం--రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు
 జిల్లాలో 45 వేల యూనిట్‌ల రక్తం అవసరంకాగా, ప్రస్తుతం రక్తదాన శిబిరాలతో కేవలం 10 వేల యూనిట్ల రక్తం మాత్రమే సేకరించగలుగుతున్నామని రెడ్‌క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌ జగన్మోహనరావు అన్నారు. చల్లవానిపేటలో గురువారం జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రసవాల సమయాల్లో అవసరమైన రక్తం లేక ఎక్కువ మంది గర్భిణీలు చనిపోతున్నారని, గ్రామీణ ప్రాంతాలలో ఈ తరహా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని ఉన్నాయని అన్నారు. ప్రసవ సమయంలో కనీసం 700 మి.లీ. రక్తం పోతుందని, ఒకరి నుంచి 300 మి.లీ రక్తం సేకరిస్తున్న నేపథ్యంలో ఇద్దరు రక్తదానం చేస్తే ఒక గర్భిణికి సరిపోతుందన్నారు. జిల్లా కేంద్రంలో రెండు రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయని, వీటితో పాటు పాలకొండలో ఒక కేంద్రం ఉందని వివరించారు. ఇప్పటి వరకు 152 శిబిరాలు నిర్వహించి 7వేల యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నేత్ర సేకరణ కేంద్రం కూడా ఏర్పాటు చేశామని, జిల్లాలో 167 మంది నేత్రదానం చేయడంతో 306 మందికి కంటి చూపు దక్కిందని చెప్పారు. నేత్రదానంపై యువత గ్రామీణుల్లో అవగాహన పెంచాలని కోరారు.

--చల్లవానిపేట(జలుమూరు),న్యూస్‌టుడే
  • ===========================
visit my website - > Dr.seshagiriao-MBBS

No comments:

Post a Comment

Your comment is very important to improve this blog/site