Sunday, June 27, 2010

ఔషధ నియంత్రణ-శ్రీకాకుళం లో, Medicines Standards Control in Srikakulam







సాదారణము గా మందుల వ్యాపారము ఏరీతిలో ఉందంటే ...

8 శాతం మందులు పనిచేయవు
రోగం తగ్గుతుందన్న భరోసా లేదు
ప్రమాణాల్లో కంపెనీలు విఫలం
ఉత్తరాది ఫార్మాలు మరీ ఘోరం
ఔషధ నియంత్రణకు సిబ్బంది లేరు---------- ఇదీ మందుల మాయాజాలం.

శ్రీకాకుళం జిల్లాలో సుమారరు 800 రిటైల్ మందుల దుకాణాలు , 146 హోల్సేల్ దుకాణాలు , 4 మందుల తయారీ కంపెనీలు , రిమ్స్ రక్తనిధి , రెడ్ క్రాస్ రక్తనిది (మొత్తం రెండు ) కేంద్రాలు ఉన్నాయి . ఇందులో కొన్ని హోల్ సేల్ షాపులు . ఇన్ని మందుల షాపులు ప్రమాణాలు పాటిస్తున్నయో లేదో తనికీ చేయడానికి ఉన్నది ఒక్క డ్రగ్ ఇంస్పెక్టరే . ఎలా సాధ్య పడుతుంది ? .

ఇటీవలికాలంలో తరచుగా మందులు వాడుతున్నా జబ్బు తగ్గడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మందుల్లో నాణ్యత నిర్దేశించిన పరిమాణంలో లేకపోవడమే దీనికి కారణం. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఇతర రాష్ట్రాల్లో తయారైన మందుల నాణ్యత నిర్దేశిత ప్రమాణాల్లో లేదని తేలుతోంది. దేశవ్యాప్తంగా మందుల నాణ్యతను తనిఖీ చేసే వ్యవస్థ పటిష్ఠంగా లేదు. మార్కెట్లో ఉన్న మందుల్లో 8 శాతం అనుమానించ తగినవని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన దీనికి బలం చేకూరుస్తోంది. మందుల నాణ్యత నిర్ధారణలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమల్లో లేకపోవడంతో నాసిరకాన్ని గుర్తించడం క్లిష్టంగా మారుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన కొన్ని మందుల నాణ్యత నాసిరకంగా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు లేవు. మన రాష్ట్రంలోని ఔషధ నియంత్రణ శాఖలో తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాసిరకం మందులకు కళ్లెం వెయ్యలేకపోతున్నారు.

రాయితీలు : హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌లు ఔషధ పరిశ్రమలకు భారీగా రాయితీలను ప్రకటిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో 2001 నుంచి పరిశ్రమలపై ఎక్సయిజ్‌ డ్యూటీ, అమ్మకం పన్నును పూర్తిగా మినహాయించారు. రాయితీల వర్షంతో 3 రాష్ట్రాల్లో 600 ఔషధ పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఒక్క హిమాచల్‌లోనే 400కు పైగా కంపెనీలున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మందుల నాణ్యతను పరీక్షించడానికి కేవలం 10 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో మొక్కుబడి తనిఖీలు మాత్రమే జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌ల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. పంజాబ్‌లో నకిలీ మందుల తయారీ పరిశ్రమగా సాగుతోంది. వీటిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రెండేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

రాష్ట్రంలో తనిఖీ తీరు
మన రాష్ట్రంలో మందుల నాణ్యత పరీక్షలు నిరాశాజనకంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో 51 వేలకు పైగా మందుల దుకాణాలు, 1791 తయారీ సంస్థలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేయడానికి ప్రతీ 100 మందుల దుకాణాలకు ఒకరు చొప్పున 510 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు కావాలి. ప్రతీ 25 మందుల తయారీ సంస్థలపై ఒక ఇన్‌స్పెక్టర్‌ చొప్పున మరో 72 మంది ప్రత్యేక నిఘా అధికారులు అవసరం. మొత్తం 582 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు అవసరం కాగా పని చేస్తున్నది కేవలం 46 మంది. సిబ్బంది కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగా రెండేళ్ల కింద 75 పోస్టులు మంజూరు చేశారు. భర్తీ మాత్రం జరగలేదు. దాంతో రాష్ట్రంలోనూ ఆశించిన స్థాయిలో నాణ్యత పరీక్షలు జరగడం లేదు.

నిపుణుల సూచనలు
* మందుల నాణ్యత తనిఖీలకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాలను అమలు చేయాలి.
* ఉత్పత్తి అయిన మందుల నాణ్యత నిర్దేశించిన ప్రమాణాల్లో లేదని నిర్ధారణ అయితే సదరు సంస్థపై కఠిన చర్యలు తీసుకునే విధానం రావాలి.

* మందుల నాణ్యతను నిర్ధారించేందుకు తయారీ సంస్థలు సూచించే విధానాలను మాత్రమే ఔషధ నియంత్రణ అధికారులు అనుసరిస్తున్నారు. దీనివల్ల నాణ్యతా లోపాలను గుర్తించడం క్లిష్టంగా మారుతోంది.

* ఔషధాలపై పరిశోధనలు చేసే సంస్థలకు అనుబంధంగా నాణ్యత పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
* ఔషధ నియంత్రణ శాఖలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.
నిర్ధారణ :
* ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే నకిలీ మందుల్లో 35 శాతం భారత దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. - ప్రపంచ ఆరోగ్య సంస్థ
* దేశంలో నకిలీ మందుల అమ్మకం ఏటా 25 శాతం వృద్ధి చెందుతోంది. - అసోచామ్‌..
* మార్కెట్లోని మందుల్లో ఎనిమిది శాతం అనుమానించదగ్గవి --కేంద్ర ఆరోగ్య శాఖ.

News from Eenadu paper - 13-April -2011

కేంద్ర నిబంధనల ప్రకారం మన రాష్ట్రంలో 256 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు అవసరం. కానీ ఉన్నది 47 మందే. దేశం మొత్తంలోకీ దారుణమైన రీతిలో దాదాపు 900 షాపులకొక తనిఖీ అధికారితోనే సరిపెట్టేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఔషధ నియంత్రణ విభాగం పనితీరుకు ఉదాహరణ .


మందుల నాణ్యతా పరిరక్షణ, నకిలీ, ప్రాణాంతకమైన వాటిని కనిపెట్టడం, అధిక ధరలను, తప్పుడు వ్యాపార ప్రకటనలను నిరోధించడం.. ఔషధ నియంత్రణ విభాగం విధులు. కానీ, తగిన వనరుల్లేక అది కుంటినడక నడుస్తోంది. రాష్ట్రానికి రెండు దశాబ్దాల క్రితం 55 డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌(డీఐ) పోస్టులు మంజూరయ్యాయి. ఇప్పటికీ ఆ సంఖ్య పెరగకపోగా 8 ఖాళీ అయ్యాయి. రాష్ట్రంలో 198 బ్లడ్‌ బ్యాంకులు, 1,734 మందుల ఉత్పత్తి సంస్థలు, 51 వేలకుపైగా షాపులూ ఉన్నాయి. హాథి కమిషన్‌ సిఫార్సుల మేరకు ప్రతి 200 షాపులకొకరు, ప్రతి 26 ఉత్పత్తి సంస్థలకొకరు చొప్పున మొత్తం 256 మంది డీఐలు విధిగా ఉండాలని మూడేళ్ల క్రితం కేంద్రం ఆదేశించింది. కానీ దాన్ని అమలుచేయలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ చాలా వరకు దానిని పాటించినా ఇక్కడ స్పందన లేదు. గత మార్చిలో శాసనసభలో ఈ విషయమై ఆందోళన వ్యక్తమైనప్పుడు కాంట్రాక్టు పద్ధతిపై వెంటనే 50 మందిని తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అదీ జరగలేదు. శాశ్వత నియామకాల కోసం ఏపీపీఎస్సీకి లేఖ రాసి చేతులు దులుపుకొంది. దేశంలో ఎక్కడాలేని విధంగా డీఐలకు పనిభారం ఎక్కువ. అందుకు తగ్గట్లు వనరుల్లేవు. ప్రస్తుతం వీరికి ఫోన్‌ సౌకర్యం కూడా లేదు. పొదుపు పేరిట గత ఏడాది చివర్లో సెల్‌ఫోన్లను తొలగించారు. ఫలితంగా వినియోగదారులు నకిలీ మందుల సమాచారం అందించడానికీ వీలుకావడం లేదు. అత్యవసర సమయాల్లో దాడులకు అవసరమైన వాహన సౌకర్యమూ వీరికి లేదు. వనరుల లేమికి అవినీతి జాఢ్యం తోడవుతోంది. మందుల షాపుల నుంచి అధికారులకు మామూళ్లు ఆనవాయితీ అయ్యాయి. ఈ విభాగం ప్రధాన కార్యాలయానికి రెండు కార్లు, ప్రాంతీయ అధికారులకు నాలుగు జీపులు ఉన్నాయి. ఇవి పాతికేళ్ల కిందటివి. 15 ఏళ్ల వాహనాలను నిషేధించడంతో వీటికి కాలం చెల్లింది. అయినా విధిలేక వాటినే వాడుతున్నారు.
తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న మందులను పరీక్షించడానికి హైదరాబాద్‌, విజయవాడలలో మాత్రమే ప్రయోగశాలలున్నాయి. వీటిలోనూ సరైన సౌకర్యాలు లేక ఫలితాల కోసం నెలల తరబడి జాప్యం జరుగుతోంది. వీటిలో 6 జూనియర్‌ ఎనలిస్ట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌కోసం ప్రయోగశాలల్లో అధునాతన పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా ఒక్కో సీనియర్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ను, ముగ్గురేసి జూనియర్‌ ఎనలసిస్ట్‌లను అదనంగా నియమించడానికి కేంద్రం ముందుకొచ్చింది. కానీ వ్యయంలో 20% వాటా భరించడానికి రాష్ట్రం చొరవ చూపడం లేదు.
ఇన్ని సమస్యల నేపథ్యంలో ఉన్న సిబ్బంది విధులను సరిగా నిర్వర్తించలేని పరిస్థితి ఏర్పడింది. నిర్దేశిత కోటా శాంపిళ్ల సేకరణ మినహాయిస్తే విస్తృత స్థాయిలో మందుల షాపుల తనిఖీలు జరగడం లేదు. నాసిరకం మందుల ఆరోపణలు వచ్చినా మొక్కుబడిగా దాడులు జరుగుతున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో శాంపిళ్లతో పాటు నాసిరకం మందుల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి
  • ==================================
Visit My Website - >డా.శేషగిరి్రావు

Thursday, May 6, 2010

రెడ్-క్రాస్ దంతవైద్యశాల శ్రీకాకుళం లో , Red cross Dental hospital in Srikakulam


మే 05 , 2010 న శ్రీకాకులం పట్నం పొట్టిశ్రీరాములు జెంక్షన్క్ష్ సమీపమలో గల రెడ్ క్రాస్ కార్యాలయం నందు దంత వైద్యశాలను కలక్టర్ శ్రీకాంత్ గారు ప్రారంభించారు . దీన్ని శ్రికాకుళం రెడ్క్రాస్ అసోసియేషన్క్ష్ ఉపాద్య్హాక్షులు మగటపల్లి వెంకటరమణ సహకారము తో నడిపిస్తున్నారు . ఈయన ఒక లక్ష రూపాయిలు విరాళముగా వైద్యశాల నిర్వహణ కోసం ఇచ్చారు . రెడ్ క్రాస్ అధ్యక్షులు డా. జగన్మోహన్రావు పర్యవేక్షణలో దీనిని నడిపిస్తారు .

దంత వైద్యశాల ప్రతి ఆదివారము 9 గం . నుంది 12 గం .ల వరకు పనిచేస్తుంది . తెలుపు రేషం కార్డ్ ఉన్న వారికి ఉచితం గా వైద్యం అందిస్తారు . మిగతా వారికి నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు . భవిష్యత్తులో ప్రతిరోజూ పనిచేసేటట్లు చర్యలు తీసుకుంటారు . దంత వైద్యుల సంఘం అధ్యక్షులు బాన్న సంజీవరావు దీనిని నడిపించేందుకు ముందుకు వచ్చారు .
  • ========================================
Visit My Website - > dr.seshagirirao.com/

Wednesday, May 5, 2010

Medical education Process in India , భారతదేశం లో వైద్య విధ్యావిధానము .



సమాజం లో డాక్టర్ కు వృత్తిపరం గా ఎనలేని గౌరవం ఉన్నది . డాక్టర్ , వైద్యేతర సిబ్బంది తో సమాజానికి పటిస్టమైన సేవచేయడానికి వీలు కలుగుతుంది . ఇది ఒక "టీం వర్క్" ఏ ఒక్కరు దీనిలో అధికులు కారు . ఈ టీం వర్క్ నే " ట్రై పాడ్ ఒఫ్ హెల్త్ కేర్ " (Tripod of Health Care) అంటారు . దీనిలో
  • డాక్టర్లు తో కూడుకున్న వయ్వస్థ (Doctors fraternities ) ,
  • మందుల తయారీ ఓ కూడుకున్న వ్యవస్థ (Pharma industry includin med.shops),
  • వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు (Diagnostic Centers) ,
ఉంటాయి .

భారతదేశం లో మొతం మెడికల్ కాలేజీలు --- 450 .
మొత్తం సీట్ల సంఖ్య ---------- 30,000.
ప్రతి సమ్వత్సరము సీట్ల కోసం ప్రయత్నం చేసే విద్యార్ధులు సుమారు ఒక లక్ష పైనే ఉంటారు . పోటీ రేషియో 1:3 .

జాతీయ స్థాయిలో ..........
AIMS , JIPMER , AFME, CMC , MGIMS , BHU .... మొదలైనవి . ఇవి ప్రతిస్టాత్మకమైన సంస్టలు . వీటిలొ ప్రవేశం కోసం ఆయా సంస్టహలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి .

జాతీయ స్థాయి వైద్య విద్యా కాలేజీలఎ - ప్రవేష పరీక్షలు

name of exam
seats
website
  1. AIIMS
72www.aiims.ac.in/
www.aiims.edu/
2.. AFMC 130 www.armedforces.nic.in/
3. JIPMER 100 www.jipmer.edu/
4. BHU 84 www.bhu.ac.in/
5. AMU 150 www.amu.ac.in/
6. CMC 60 www.cmch-vellore.edu/
7. MGIMS 65 www.mgims.in/
8. MAHE 1058 www.manipal.edu /






ఆంధ్ర ప్రదేశ్ రాస్ట్రం లో
మొత్తం మెడికల్ కాలేజీలు ------------ 33 .
మొత్తం లబిస్తున్న MBBS సీట్లు ------- 4,400 .
ప్రతిసంవస్తరమూ సీటు కోసం ప్రయత్నం చేసే విద్యార్ధులు ---30 నుండి 35 వేలు . పోటీ రేషియో 1:6 .

రాస్టం లో ఎంసెట్ ద్వారా లబిస్తున్న కోర్సులు


Num.of Colleges


Num. of Seats .


name of faculty
Govt.
private
Total
Govt.
Private
Total
Medical (MBBS)
13
20
33
1800
2600
4400
Dental (BDS)
3
18
21
180
1650
1830
Ayurveda(BAMS)4
3
7
170
150
320
Homeopathy(BHMS)4
1
5
180
50
230
Unaani (BUMS)
1
1
2
75
50
125
Physiotherapy (BPT)
0
38
38
01815
1815
Medial Lab Tech(Bsc M.L.T)
1
45
46
20
1885
1905
Naturopathy
1
1
2
30
100
130
Nursing
2+3
(2YDC)
189
194
222
9710
9932
Nutrition1
0
1
2
0
2
Pharma D.
0
15
15
0
450
450


ఎం.బి.బి.ఎస్ :

బ్యాచ్ లర్ ఒఫ్ మెడిసిం అండ్ బ్యాచ్ లర్ ఒఫ్ సర్జరీ అనేది సంక్షిప్త రూపము . ఎం.బి.బి.ఎస్ చేస్తె సాధారణ డాక్టర్ (వైద్యుడు) అవుతారు . ఇంకా ఎన్నో స్పెసాలిటీసు ఇందులో ఉన్నాయి . కోర్సు కాలవ్యవధి నాలుగున్నర సమ్వత్సరాలు , ఏడాది పాటు ' ఇంటర్నీషిప్ ' చేయాలి .

బి.డి.ఎస్. :
రాస్ట్రం లో ఎంసెట్ రాసే వారిలో ఎక్కువమంది ఎం.బి.బి.ఎస్. వైపు మొగ్గుచూపుతారు . తరువాతే మిగిలిన వాటివైపు దృస్టి సారిస్తారు . వాటిలో మొదతి ప్రాధాన్యం బి.డి.ఎస్ .కే దక్కుతోంది . .. " బ్యాచ్ లర్ ఒఫ్ డెంటల్ సైన్సెస్స్ " పూర్తి రూపము . ఈ కోర్సు కాలవ్యవధి నాలుగు సమ్వత్సరాలు . . . ఏడాది కాలము ' ఇంటర్నీషిప్ ' చేయాలి . ఇంకా స్పెసాలిటీసు కావాలంటే ఎం.డి.ఎస్ . చేయాలి అర్థోడెంటిక్స్ , డెంటో-ఫేషియల్ ఆర్థోపిడిక్స్ , డెంటల్ పబ్లిక్ హెల్త్ అనే స్పెసాలితీలు ఉన్నాయి .

బి.వి.ఎస్సి . అండ్ ఎ.హ్ :

బ్యాచ్ లర్ ఒఫ్ వెటర్నరీ సైన్సెస్స్ అండ్ యానిమల్ హజ్ బండరీ అనేది పూర్తి రూపము . కాల వ్యవధి 5 సంవత్సరాలు . భారతదేశం లొ పశువైద్య విద్యను వెటర్నరీ కౌన్క్ష్సిల్ ఒఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది . ఈ కోర్సు చేసినవారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ .

బి.ఎ.ఎం.ఎస్ :

బ్యాచ్ లర్ ఒఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్క్ష్ అండ్ సర్జరీ అనేది సంక్షిప్త నామము . ఔషద మొక్కలు వాతి విలువలు తెలియజేసే వైద్యవిధానము . దీని కాలపరిమితి 5 సం.లు . ఏడాది పాటు ఇంటర్నీషిప్ చేయాలి . రాస్ట్రం లొ ఉన్న కాలేజీలకోసం పైన పట్టిక చూడండి .

బి.ఎహ్.ఎం.ఎస్. :

బ్యాచ్ లర్ ఒఫ్ హోమియో మెడిసిన్క్ష్ అండ్ సర్జరీ అనేది దీని అసలు రూపము . కాలపరిమితి 5 సం.లు . ఒక సం. ఇంటర్నీషిప్ చేయాలి . ఉద్యోగ అవకాశాలు తక్కువ . ప్రవేటు ప్రాక్టిస్ లో మంచి పేరు ఉన్న వైద్యవిధానము .

బి.యు.ఎం.ఎస్ .>

బ్యాచ్ లర్ ఒఫ్ యునాని మెడిసిం అండ్ సర్జరీ అనేది పూర్తి రూపము . లోహాసంభందమైన ఔషద గుణాలతో కూడుకున్న వైద్యవిధానము . కాలపరిది 5 సం.లు . ఒక సం . ఇంటర్నీషిప్ ..

నేచురోపతి :

ప్రకృతి అంశాలను ఆధారము గా చేసుకొని చైద్యం చేసే విధానము . మూలికలు , కూరలు . పండ్లు . వాడి వ్యాధులను నయం చేసేది . కాలపరిది 5 సం . లు . ఏడాది ఇంటర్నీషిప్ . కాలేజీల కోసం పై పట్టీక చూడండి .

ఫార్మా-డి . :

ఫార్మాస్యూటికల్ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృస్టిలో ఉంచుకుని క్లినికల్ , రిసెర్చ్ రంగాల్లో నిపుణులను తయారుచెయడానికి వీలుగా ఈ కోర్సును రూపొందించారు . ఫార్మసీ కౌంసిల్ ఒఫ్ ఇండియా 2008 లో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సు ఇది .
కాలవ్యవది ఆరు (6) సం.లు . మూడు సం. లు కాలేజీ చదవాలి . 2 సం.లు ఫా్ర్మాస్యూటికల్ పరిశ్రమ లో ఇంటర్నీషిప్ చేయాలి . చివరి సం. పరిశోధన ఉంటుంది . కాలేజీల కోసం పట్టిక చూడండి .

బి.ఫార్మశీ :

మెడికల్ షాపులలో మందులు ఎవరు బడితే వారు ఇవ్వడం కాకుండా నిపుణులైన వారు ఉందాలన్న ఉద్దేశం తో బి.ఫార్మశీ కోర్సును రూపొందించారు . కాలవ్యవధి నాలుగు సం.లు . రాస్ట్రం లో ఫార్మశీ కాలేజీలు సుమారు 69 దాకా ఉన్నాయి .

బి.ఎం.ఎల్.టి. :

దీన్ని " బ్యాచ్లర్ ఒఫ్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ " అని అమంటాము . బి.ఎస్. దిగ్రీ తో సమానము . అనేక మెడికల్ కాలేజీలలో ఈ కోర్సు ఉన్నది . జబ్బుల నిర్దారణ తనికీలన్నీ వీరు చేయ గలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు . కాలవ్యవది 3 సం.లు 6 మాసాలు . కాలేజీలు 46 మన రాస్టం లో ఉన్నాయి . మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి .

బి.పి.టి . :

దేశం లొ పలు మెడికల్ కాలేజీలలో ఈ కోర్సులు ఉన్నాయి . ఎన్నో ప్రవేటు కాలెజీలూ ఉన్నాయి . మన రాస్టం లొ 38 కాలేజీలు లో 1815 మంది విద్యార్ధులు సం.నకు జాయిన్క్ష్ అవుతారు . కోర్సు కాలపరిమితి 4 1/2 సం.లు . అల్లోపతి వైద్యానికి ఇది సహాయకారిణి గా ఉంటుంది . ఉద్యోగ అవకాశాలు ఎక్కువ .

అగ్రికల్చర్ : (బి.ఎస్సి.ఎజి ):

వ్యవసాయానికి సంబంధిన వృత్తివిద్యా కోర్సు ఇది . మన రాస్టం లొ ఆచార్య రంగా యూనివర్సిటీ అధ్వర్యం లొ ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి .

ఎ.జి.బి.ఎస్చి కోర్సులు


college
seats
B.Sc, (Ag)
8
500
B.Tech (Ag.Engg)
2
90
B.Sc (Ca & BM)
1
40
B.Tech (Food Science)
2
90
B.Sc. Hons (Home Science)
1
80
Total
14
800




  • ===========================================
Visit My Website - > http://dr.seshagirirao.tripod.com/

Thursday, April 29, 2010

రెడ్‌క్రాస్‌ మెడిసిన్‌ బ్యాంకు శ్రీకాకుళం లో , Redcross Medicine Bank in Srikakulam




జ్వరం, జలుబు, దగ్గు, దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్‌, కిడ్నీ తదితర వాటితో బాధపడే వారికి అవసరమైన మందుల విషయంలో నేనున్నానంటూ అభయం ఇస్తోంది ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలో నిర్వహిస్తున్న మెడిసిన్‌ బ్యాంకు. శ్రీకాకుళం పట్టణంలో 2006 నవంబరు 9న ప్రారంభించారు. ఇప్పటివరకు మెడిసిన్‌ బ్యాంకు ద్వారా 7,062 మందికి అల్లోపతి (ఇంగ్లీషు), హోమియో మందులు పంపిణీ చేశారు. శనివారం (01 మే 2010)ప్రత్యేకంగా స్త్రీ సంబంధమైన వ్యాధుల కోసం సేవలు అందిస్తారు. నిరుపేదలు ఈ బ్యాంకుకు వెళ్లి తమ తమ వ్యాధులు వివరిస్తే చాలు,, అక్కడి వైద్యులు అవసరమైన పరీక్షలు చేయించి నివారణకు ఉపయోగపడే మందులు ఉచితంగా అందజేస్తారు. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు సేవలు పొందుతున్నారు. అవసరాన్ని బట్టి అల్లోపతి, హోమియోపతి మందులు అందజేస్తారు. ఈ బ్యాంకులో పలువురు వైద్యులు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుండటం అభినందనీయం.

మందుల సేకరణ

మెడిసిన్‌ బ్యాంకుకు పలువురు వైద్యులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు, తదితరులు తమ వంతు సాయంగా వివిధ వ్యాధుల నివారణకు అవసరమయ్యే మందులు అందజేస్తుంటారు. వీటిని అవసరమయ్యే రోగులకు పంపిణీ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడి కొచ్చే వారిలో ఎక్కువగా వృద్ధులు ఉంటున్నారు. కీళ్ల నొప్పులు, జ్వరం, దగ్గు, నిస్సత్తువ, తదితర రోగాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.


వివిధ వ్యాధులకు సంబంధించి మందులు వాడుతున్న వారు కొన్ని సందర్భాల్లో ఆ కోర్సు ఆపేసి కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మందులు పనికిరానివిగా భావించి బయట పారేస్తుంటాము. ఇలా చేయకుండా వాటిని రెడ్‌క్రాస్‌కు అందజేస్తే వైద్యులు అవి ఏ వ్యాధికి పనికొస్తాయి, ఎప్పటివరకు వాటి వాడకం తేదీ ఉందో క్షుణ్ణంగా పరిశీలించి ఆయా మందులను ఒకచోట జాగ్రత్తచేస్తారు.

తోడ్పడండి: జగన్మోహనరావు(అధ్యక్షులు రెడ్ క్రాస్ -శ్రీకాకుళం )

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వినియోగించగా మిగిలిపోయిన మందులను పారేయకుండా పొట్టిశ్రీరాములు కూడలిలో గల జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యాలయానికి, బాపూజీ కళామందిర్‌ వద్ద ఉన్న రెడ్‌క్రాస్‌ రక్తనిధికి అందజేయాలని అధ్యక్షులు పి.జగన్మోహనరావు కోరారు. ఇప్పటివరకు 7,062 మందికి మందులు అందజేసినట్లు తెలిపారు. నిరుపేదలైన వారికి ఆరోగ్యకార్డులు అందజేస్తామని చెప్పారు. పట్టణ పరిధిలో 400 మందికి ఇప్పటికే వీటిని ఇచ్చినట్లు వెల్లడించారు. మెడిసిన్‌ బ్యాంకుకు విరాళంగా మందులు ఇవ్వదలచుకున్నవారు 9440195900 సెల్‌కు ఫోన్‌చేసి సంప్రదించాలని కోరారు.



  • =================================================
Visit My Website - > Dr.Seshagirirao-MBBS

Sunday, April 25, 2010

సెల్ ఫోన్ మెసేజ్లు వల్ల వచ్చే అనారోగ్యము , celphone SMS health hezard - Infomania





ప్రతి ఒక్కరి దగ్గర సుమారుగా ఒక సెల్ ఫొన్ ఉండడం సర్వ సాధారణమయిపోయినది . యువత అయితే -ఎస్ .ఎం.ఎస్ - లు అదేపనిగా చేస్తూఉంటారు . ఫొను అనేది ముఖ్యమైన సమాచారము పంపించేందుకు వినియోగించాలి కాని అతిగా వాడకూడదు . దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి .

శ్రీకాకులం జిల్లాలో దాదాపు 7 లక్షల మంది సెల్ ఫోన్ వినియోగదారులు ఉండగా అందులో అధిక శాతం వినియోగదారులు కుర్రకారులే . వీరంతా సెల్ ఫొన్లు అవసరానికి మించి వినియోగిస్తుండడం , రోజంతా అదేపనిగా ఎస్.ఎం.ఎస్. లు పంపిస్తూ కాలం గడుపూ ఉండడంతో " ఇన్ఫోమేనియా" వ్యాధి బారిన తెలియకుండానే పడుతున్నారు . అలాగే గత కొన్నేళ్ళుగా జిల్లాలో ఇంటర్నెట్ వినియోగం కుడా బాగా పెరిగింది .ఈంతో వారు కూడా ఈ-మెయిల్ లు అదే పనిగా చేస్తూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు .. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ఇన్ఫోమేనియా వల్ల అనేక అనర్దాలు ఉన్నాయి .

సాధారణం గా యువతరం సెల్ఫోన్లలో మాట్లాడడం కంటే సంక్షిప్త సందేశాల ద్వారా చాటింగ్ చేసుకోవడానికే అధిక పాధాన్యత ఇస్తున్నారు . ఈ బ్లహీనతను ఆసరాగా వివిద సెల్ఫోన్ల కంపెనీలు ఎస్.ఎం.ఎం పాకేజీలను అందిస్తున్నాయి . మరికొన్ని సంస్థలు అయితే ఏకంగా నెలకు వేలల్లో ఉచిత ఎస్.ఎం.ఎస్ ల సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి . దీంతో యువత అంతా బిజీ బిజీ గా ఉంటున్నారు .

అనర్ధాలు :
  • జ్ఞాపక శక్తి పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది . ధూమ పానం చేసేవారు , మత్తుపదార్ధాలుకు బానిస అయినవారి కంటే ఈ ఇంఫోమేనియా లొ పర్తిభా శక్తి తగ్గుతుంది .
  • ప్రధానం గా నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తి ఆరోగ్యం పై తీవ్రప్రభావము చూపుతుంది .
  • ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది . ఫలితంగా చదువుపై శ్రద్ద పెట్టలేని పరిస్థితి యేర్పడుతుంది .
  • అనవస ఆందోళన , చిరాకు , తలనొప్పీ వంటివి తరచుగా కనిపిస్తూ ఉంటాయి .
  • రొమాంటిక్ ఎస్.ఎం.ఎస్. లు వలన ప్రేమ వ్యవహారాలు , లౌవ్ ఫైల్యూర్లు వలన కొన్ని జీవితాలులో కలకలం రేగుతుంది . హత్య ... ఆత్మహత్యా ప్రయత్నాలు ఎక్కువవుతాయి .
  • చాలామంది పంపిన ఎస్.ఎం.ఎస్ లకు సమాదానాలు రావడం ఆలస్యమైనా . రాకపోయినా డిప్రషన్ కు లోనై కస్టాలలో పడతారు .
  • విలువైన కాలాన్ని వృదా అవడం వల్లా ... , అన్నారోగ్య పాలై ... చదువుపై శ్రద్ధ తక్కువై తమ కెరీర్ నే పాడుచేసుకుంటున్నారు .

  • =============================================
Visit My Website - > dr.seshagirirao-MBBS

Blood banks in Srikakulam , రక్త నిధి శ్రీకాకుళం లో





  • మనుషుల నుండి రక్తాన్ని సేకరించి .. గ్రూఫుల ప్రకారము లేబుల్స్ రాసి ఎయిడ్స్ , పచ్చకామెర్ల , వి.డి.అర్.యల్, మొదలగు అంటువ్యాధులు కోసం పరీక్షలన్నింటినీ సంభందిత నిపుణులైన టెక్నీసియన్ల చే తనికీ చేయించి , నిలువచేసే ప్రదేశం నే రక్త నిధి లేక బ్లడ్ బ్యాంక్ అంటాము . అవసరాన్ని బట్టి రక్తాన్నీ ఉచితంగా గాని , కొంత డబ్బు తీసుకొని గాని సరఫరా చేయుదురు .
  • శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ది చెందినప్పటికీ కృత్రిమ రక్తాన్ని తయారు చేసేవీలు లేక అనసరమైన మేరకు రక్తాన్ని దానం ద్వారా మాత్రమే సేకరించే వీలు వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా ఎనిమది లక్షల యూనిట్‌ల రక్తం అవసరం కాగా అందులో 6లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే 208 బ్లడ్‌బ్యాంక్‌ల ద్వారా సేకరించగలుగుతున్నారు.
రక్తం ఎక్కించవలసిన కొన్ని సాదారణ పరిస్థితులు :
  • రోడ్ ప్రమాదాలలో గాయాలైన వారికి ,
  • ఆపరేషన్ సమయం లో శరీర లో రక్తం తగినంత లేనపుడు .
  • రక్తహీనన ఉన్న రోజులకు ,
  • కొన్ని రక్త సంభందిత కాన్క్ష్సర్ రోగులకు ,
  • గర్భిణీ స్త్రీలకు కా్నుపు సమయం లోనూ, రక్తత స్రావము జరిగినపుడు ,

శ్రీకాకుళం జిల్లాలో రక్తనిధి నిల్వ కేంద్రాలు -ఫోన్‌ నంబర్లు :

  • శ్రీకాకుళం జిల్లాలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం ఉంది. రిమ్స్‌ జనరల్‌ ఆసుపత్రిలో ఒక రక్తనిధి ఉంది. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో పాలకొండ ఏరియా ఆసుపత్రి, పాతపట్నం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో రక్తనిధి నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వాటి ఫోన్‌ నంబర్లు :



  • * రెడ్‌క్రాస్‌ రక్తనిధి - శ్రీకాకుళం -- 08942 2226555
  • * రిమ్స్‌ రక్తనిధి - శ్రీకాకుళం --- 9000273960
  • * పాలకొండ ఏరియా ఆసుపత్రి - 08941 220130
  • * పాతపట్నం సామాజిక ఆసుపత్రి రక్తనిధి కేంద్రం - ఫోను: 99487 65449
  • * రెడ్‌క్రాస్‌ రక్తనిధి ఉపకేంద్రం - రణస్థలం - ఫోను: 94411 59726



శ్రీకాకుళం పరిస్థితి :

  • జనాభా : ----------------25 లక్షల పైనే ,
  • జాతీయ రహదారి విస్తీర్ణం --195 కి.మీ.
  • ఏటా ప్రమాదాల సంఖ్య ----1700 ,
  • ఏటా కావలసిన రక్తం ----35,000 యూనిట్స్ ,
  • రెడ్ క్రాస్ , రిమ్సు (RIMS) సేకరణ్ --15 వేల యూనిట్లు ,



  • జిల్లాలో సుమారు 300 వరకూ రికగ్నైజెడ్ నర్సింగ్ హోములు ఉన్నాయి . ప్రభుత్వ పెద్దాసుపతులు ఉన్నాయి . కొన్ని రిజిస్టర్ కాని నర్సింగ్ హొమ్లు సుమారు 50 వరకూ ఉన్నాయి . ఇన్ని హాస్పిటల్స్ కు కావలసిన రక్తం బల్డ్ బ్యాంక్ లలో దొరకదు .
  • పూర్వము ప్రతి ప్రైవేటు హాస్పిటల్ లోనూ , నర్సింగ్ హోం లోనూ తగు జాగ్రత్తలతో రక్తం సేకరించి అవసరమైనపుడు ఎక్కించేవారు . దబ్బులు ఎంత తీసుకుంటున్నారు అనేది కాదు ... అవసరానికి రక్తం లోకల్ గా దొరికేది . కాని ఎయిడ్స్ , హెపటైటిస్ జబ్బులు రావడం తో ప్రభుత్వ పరంగా ఆంక్షలు ఎక్కువ అయినందున ... బ్లడ్ బ్యాంక్ నుండే రక్తం సరఫరా అవ్వాలని నిబందనలు ఉండడం తో రక్తం సరఫరా లొ సానుకూలత లేక కొరత యేర్పడినది . జిల్లాలొ ఒకేఒక "రెడ్ క్రాస్ " రక్త నిధి , రిమ్‌స్ హాస్పిటల్ లొ ఒక రక్తనిధి ఉన్నాయి . జిల్లా అంతటికీ సప్లై అవడం కస్టం . అందుకే దొంగతనం గా రక్తం ఎక్కించే కొన్ని నకిలీ బ్లడ్ బ్యాంక్ లు అక్కడక్కడ జిల్లాలో ఉన్నాయి . ఇటువంటివి 4 -5 వరకూ ఉన్నాయంటే ఆశ్చర్య పడనవసరం లేదు .


రక్తము దాతల -- అర్హతలు -- జాగ్రత్తలు :
  • రక్తదాతలు సంపూర్ణ ఆరోగ్యము కలిగిఉండాలి ,
  • 18 నుండి 60 యేళ్ళ చధ్య స్త్రీ ,పురుషులు ఎవరైనా రక్తదానము చేయవచ్చును ,
  • రక్తదాత 45 కేజీ ల బ్రువు పబడి ఉండాలి .
  • సాదారణ స్థాయిలొ బి.పి , సుగరు ఉండాలి ,
  • మూడు నెలల వ్యవధి లో యేడాదికి నాలుగు సార్లు రక్తదానము చేయవచ్చు ,
  • రక్తదానము చేయడానికి 12 గంటలు ముందు , తరువాత ఆల్కహాల్ తీసుకోకూడదు ,
  • స్త్రీలు రుతుక్రమము లోను , గర్భము దరించిన నుండి , బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .
శరీరం లో చాలినంత రక్తం లేకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు . శరీరం లొ 5 - 6 లీటర్ల రక్తం ఉంటుంది . అంటే శారీకక బరువులో ఇది 8 శాతము . ఒక కిలో శరీరము బరువుకు 80 ఎం.ఎల్ . చొప్పున్న ఉంటుందన్నమాట . శరీరం లోని అవయవాలు సక్రమం గా పనిచేయడానికి సరిపడ రక్తం అవసరము .

  • రక్తం లో ఏమి ఉంటాయి :
  • 55 శాతము ప్లాస్మా ,
  • 45 శాతము సెల్స్ .... ఉంటాయి .
  • ప్లాస్మాలో 91% నీరే , 8% ఆర్గానిక్ మాలిక్యూల్స్ , 1% ఇనర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి .
  • సెల్స లో ఎర్రరక్తకణాలు (RBC),తెల్లరక్తకణాలు(WBC) , ప్లేట్ లెట్స్(platlets) ఉంటాయి .
  • ఒక లీటరు రక్తం లో --- ఎర్ర రక్తకణాలు =5-6 మిలియన్లు -ఆక్షిజన్ సరఫరా కు తోడ్పడతాయి ,
  • --------------------తెల్లరక్త కణాలు =4-11 మిలియన్లు ,--శరీరం లొ ఇంఫెక్షన్ పై దాడి చేసి రక్షణ కల్పిస్తాయి .
  • -------------------ప్లేట్ లెట్స్ కణాలు=1.5 - 4 మిలియన్లు ఉంటాయి -- రక్తం గడ్డ కట్టడానికి సహకరిస్తాయి .
  • ఎర్రరక్త కణాలు తగ్గితే అనీమియా అంటారు . ఎర్ర కణాలు శరీరము లో ఆక్షిజన్ సరఫరాకు ఉపయోగ పడతాయి . ఐరన్ , ఫోలిక్ ఆసిడ్ , విటమిను బి12 , విటమిను సి , తగినంత పోటీన్లు లేకపోవడం వలన రక్తహీనత ఏర్పడుతుంది .

రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో కణవిభజన కేంద్రం-- ఒక యూనిట్‌ రక్తంతో నలుగురికి ఉపకారం --- 05/Sept/2011



  • జిల్లాలో విస్తారమైన జాతీయ రహదారి ఉంది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో రోగులను కాపాడేందుకు ఏడాదికి 40వేల యూనిట్ల రక్తం అవసరం. స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్‌, రిమ్స్‌ ఆసుపత్రి, రక్తదాన శిబిరాల నుంచి 15 వేల యూనిట్లు మాత్రమే వస్తోంది. రక్త కణ విభజన కేంద్రం ప్రారంభమైతే ఒక యూనిట్‌ రక్తం నలుగురికి ఉపయోగపడుతుంది.


జిల్లాలో రక్త కణ విభజన (బ్లడ్‌ కాంపోనెన్ట్స్‌) కేంద్రం లేకపోవడంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో ఇటీవల డెంగీ జ్వరాలతో బాధపడుతున్న వారు అవసరమైన రక్తఫలికలు లభించకపోవడంతో మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఏడాది కిందట రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో కణ విభజన కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం లభించినప్పటికీ దస్త్రం దశలో నిలిచిపోయింది. రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు జగన్మోహనరావు జిల్లాలో దీని అవసరాన్ని వివరిస్తూ పదేపదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు స్పందించింది. ఈ వ్యవస్థ ప్రారంభించేందుకు అవసరమయ్యే ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన చేయాలని ఆదేశాలు రావడంతో.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్‌క్రాస్‌ రక్తనిధిపై భాగంలో రక్తకణ విభజనకు అవసరమయ్యే భవనాన్ని పూర్తి చేశారు. కణవిభజనకు అవసరమయ్యే వైద్య పరికరాలను ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ అందజేసేందుకు ముందుకు వచ్చింది. తదనంతరం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) జనరల్‌ఆసుపత్రిలో కూడా రక్త కణవిభజన కేంద్రం ఏర్పాటుకు అసవరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి అవసరమయ్యే పరికరాలు అమర్చినప్పటికీ కేవలం రక్తనిధికి రెన్యువల్‌ చేయలేదన్న సాకుతో నిలిచిపోయింది. ఆ పరికరాలు వృథాగా పడి ఉన్నాయి.


  • ఒక యూనిట్‌తో నలుగురికి మేలు-ఇప్పటి వరకు ఒక యూనిట్‌ రక్తంఒక్కరికే ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో రోగికి కావాల్సిన కణాలు తప్పా మిగతావన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. రక్తకణ విభజన కేంద్రం అందుబాటులోకి వస్తే ఒక యూనిట్‌ రక్తంతో నలుగురికి ప్రాణదానం చేయవచ్చు. రక్తంలో ఎర్ర రక్తకణాలు(Red blood cells), తెల్లరక్తకణాలు(WBC), రక్తఫలికలు(platelets), ప్లాస్మా ఉంటుంది(plasma). అందరికీ ఇవన్నీ అవసరం ఉండవు. రక్తకణవిభజన వల్ల రోగి అవసరాలకు అనుగుణంగా కణాలను వినియోగించి ప్రాణాపాయం నుంచి కాపాడుతారు.


కణవిభజన..

  • * గుండెనొప్పితో బాధ పడేవారికి ఎర్రరక్తకణాలు అవసరం.
  • * వ్యాధినిరోధకశక్తితో బాధ పడేవారికి తెల్లరక్తకణాలు అవసరం.
  • * పౌష్టికారలోపం ఉన్నవారికి ప్లాస్మా అవసరం.
  • * డెంగీ, తదితర జ్వరాలతో బాధ పడేవారికి రక్తఫలికలు అవసరం.
  • * ఇవన్నీ ఒక యూనిట్‌ రక్తం ఉండడం వల్ల దేనికది విభజించి ప్యాకెట్ల రూపంలో అందుబాటులోకి తీసుకువస్తే ప్రాణాపాయంలో ఉన్న ఎంతో మందిని రక్షించే అవకాశం ఉంది.


జిల్లా కేంద్రంలోని రక్తనిధిలో రక్తకణ విభజన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భవన నిర్మాణం పూర్తి అయ్యింది. సంబంధిత వైద్య పరికరాలు రాగానే ప్రభుత్వ ఆమోదంతో కలెక్టర్‌ మార్గనిర్దేశంతో దీన్ని ప్రారంభిస్తాం.----- జగన్మోహనరావు, రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు

  • update on 04/Jan/2013

ఏడాదికి ఒకసారైనా రక్తదానం చేయండి-యువతకు జిల్లా కలెక్టరు పిలుపు :
 యువత అంతా కనీసం ఏడాదికోసారైనా రక్తదానం చేసి సమాజ సేవలో పాలు పంచుకోవాలని జిల్లా కలెక్టరు సౌరభ్‌గౌర్‌ పిలుపు ఇచ్చారు. మండల పరిధిలోని చల్లవానిపేట వంశధార డిగ్రీ కళాశాల ఆవరణలో గురువారం ఆయన రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా యువకులు చైతన్యవంతులని, వీరంతా గ్రామీణ ప్రాంతాలలో రక్తదానంపై అవగాహన తీసుకురావాలని కోరారు. రక్తదానంతో ఎలాంటి నష్టం ఉండదన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న వివేకానంద సూక్తి స్ఫూర్తితో యువత మానవసేవ చేయాలని సూచించారు. విద్యార్థినులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. శిబిరంలో మొత్తం 70 మంది పాల్గొన్నారు. ప్రిన్సిపల్‌ లోకనాథం రక్తదానం చేసినవారికి ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు, సభ్యులు నిక్కు అప్పన్న, కమిటీసభ్యులు నిక్కు హరి సత్యనారాయణ, జాతీయ యువజన గ్రహీత చైతన్యకుమార్‌, తహశిల్దారు ఎం.కాళీప్రసాద్‌, సెట్‌శ్రీ మేనేజరు మురగయ్య, వంశధార డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ మధుబాబు, గీతాశ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు 45వేల యూనిట్ల రక్తం అవసరం--రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు
 జిల్లాలో 45 వేల యూనిట్‌ల రక్తం అవసరంకాగా, ప్రస్తుతం రక్తదాన శిబిరాలతో కేవలం 10 వేల యూనిట్ల రక్తం మాత్రమే సేకరించగలుగుతున్నామని రెడ్‌క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌ జగన్మోహనరావు అన్నారు. చల్లవానిపేటలో గురువారం జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రసవాల సమయాల్లో అవసరమైన రక్తం లేక ఎక్కువ మంది గర్భిణీలు చనిపోతున్నారని, గ్రామీణ ప్రాంతాలలో ఈ తరహా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని ఉన్నాయని అన్నారు. ప్రసవ సమయంలో కనీసం 700 మి.లీ. రక్తం పోతుందని, ఒకరి నుంచి 300 మి.లీ రక్తం సేకరిస్తున్న నేపథ్యంలో ఇద్దరు రక్తదానం చేస్తే ఒక గర్భిణికి సరిపోతుందన్నారు. జిల్లా కేంద్రంలో రెండు రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయని, వీటితో పాటు పాలకొండలో ఒక కేంద్రం ఉందని వివరించారు. ఇప్పటి వరకు 152 శిబిరాలు నిర్వహించి 7వేల యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నేత్ర సేకరణ కేంద్రం కూడా ఏర్పాటు చేశామని, జిల్లాలో 167 మంది నేత్రదానం చేయడంతో 306 మందికి కంటి చూపు దక్కిందని చెప్పారు. నేత్రదానంపై యువత గ్రామీణుల్లో అవగాహన పెంచాలని కోరారు.

--చల్లవానిపేట(జలుమూరు),న్యూస్‌టుడే
  • ===========================
visit my website - > Dr.seshagiriao-MBBS

Saturday, April 24, 2010

ఉద్దానములో కిడ్నీ వ్యాదులు , Kidney diseases in Uddanam of Srikakulam dist






మూత్రపిండాల వ్యాధులు ఉద్దాన ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. గతంలో 25 శాతం వ్యాధిగ్రస్థులున్నట్లు తేల్చగా తాజా సర్వే ప్రకారం 40 నుంచి 50 శాతం వరకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించడం కలవరానికి గురిచేస్తోంది. ప్రభుత్వం ఒక పక్క సర్వేలు, సమీక్షల పేరిట కాలం గడుపుతుండగా ఎటువంటి వైద్య సహాయం అందక రోగులు మరణిస్తున్నారు. అమెరికాకు చెందిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల బృందం ఇటీవలే సర్వే నిర్వహించింది. నీటి నమూనాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో క్రిమి సంహారక మందుల వినియోగం అధికంగా ఉండటం వల్లే ఈ వ్యాధి ప్రబలుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.

పరిస్థితి

* గుణుపల్లికి చెందిన 25 ఏళ్ల యువకుడు చొక్కర దేవరాజు వివాహానికి సిద్ధమయ్యారు. ఇటీవల పెళ్లిచూపులు జరిగాయి. దురదృష్టవశాత్తు మూత్రపిండాల వ్యాధితో మృతిచెందాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. వారిని పెంచి పోషిస్తాడనుకున్న వ్యక్తి మృత్యు ఒడికి చేరడంతో తల్లిదండ్రులు మాకమ్మ, అప్పన్నలకు వేదనే మిగిలింది.

* కొండపల్లికి చెందిన ఎంపల్లి మోహన్‌రావు (35) కిడ్నీ వ్యాధితో నాలుగు రోజుల కిందట మృతిచెందాడు. మెట్టూరుకు చెందిన దాసిర డిల్లమ్మ ఇదే వ్యాధితో ఇటీవల మృతిచెందారు. బైపల్లికి చెందిన 18 ఏళ్ల యువకుడు చీకటి ప్రసాద్‌ అయిదు నెలల కిందట మృత్యుపాలయ్యాడు.

* అక్కుపల్లికి చెందిన లండ వెంకటమ్మ (55)కు కాళ్ల పొంగులు రావడంతో విశాఖపట్నం వెళ్లి వైద్యం చేయించుకోగా కిడ్నీ వ్యాధి ఉందని నిర్ధరించారు. నాలుగు నెలలకే వ్యాధి తీవ్రతతో ఆమె మంచం పట్టి మృత్యువుతో పోరాడుతోంది. యు.ఆర్‌.కె.పురం, గుణుపల్లి, మెట్టూరు, గడూరు, అక్కుపల్లి, సైనూరు, తదితర గ్రామాలకు చెందిన వారు ఏటా పదుల సంఖ్యలో తనువు చాలిస్తున్నారు.


ఏటా సర్వేల పేరిట ప్రత్యేక వైద్య బృందాలు వచ్చి వెళ్తున్నాయి తప్ప ఫలితాలు లేవంటూ ఉద్దానం, తీర ప్రాంతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికీ ఆరుసార్లు చేపట్టిన సర్వేలు ఎందుకూ పనికిరాకుండా పోయాయంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రక్త, నీటి నమూనాలు సేకరించి వెళ్లినా వ్యాధికి గల కారణాలు గుర్తించలేకపోయారంటూ గుణుపల్లికి చెందిన తిర్రి లక్ష్మినారాయణ, కె.నిరంజన్‌, జి.ఆనంద్‌, టి.భాస్కరరావులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల అమెరికాకు చెందిన వైద్య బృందం మెట్టూరు వచ్చి వెళ్లారు.

డయాలసిస్‌ కేంద్రాలు

కిడ్నీ వ్యాధిగ్రస్థులు డయాలసిస్‌ చేసుకునేందుకు రూ.వేలు అప్పులు చేస్తూ విశాఖపట్నం కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్తున్నారు. వీరికి అవసరమైన డయాలిసిస్‌ యూనిట్లను శ్రీకాకుళం రిమ్స్‌లో ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య గతంలో ప్రకటించారు. నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు.

బాధితులకు అందని సాయం
ఉద్దానంలో మృత్యుఘంటికలు మోగుతునే ఉన్నాయి. 2000లో మూత్రపిండాల వ్యాధి లక్షణాలు కొన్ని గ్రామాల్లో కనిపించే సరికి సాధారణ విషయంగానే వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కొట్టి పారేశారు. ఆ తర్వాత తీవ్రతను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. పదేళ్లలో ప్రభుత్వ లెక్కల ప్రకారం కిడ్నీ వ్యాధితో చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని పేర్కొన్నా వాస్తవానికి మృతుల సంఖ్య వేలల్లో ఉంది. కవిటి, వజ్రపుకొత్తూరు, కంచిలి, సోంపేట, మందస, పలాస మండలాల పరిధిలో మృతుల సంఖ్య పదివేలకు పైబడి ఉంటుందని భావిస్తున్నారు. అప్పటి విశాఖ కె.జి.హెచ్‌. సూపరింటెండెంట్‌ రవిరాజు నేతృత్వంలో అధికారుల బృందం 2006లో కవిటి, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని వ్యాధి ఉద్ధృతి అధికంగా ఉన్న గ్రామాల్లో పర్యటించింది. రోగులతో పాటు ఆరోగ్యంగా ఉన్న వారి నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరించింది. తాగునీరు, ఆహార అలవాట్లు, వంశపారంపర్య వ్యాధుల గురించి వివరాలు తీసుకొని అమెరికాకు చెందిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో అక్కడి నిపుణులతో కలిపి అధ్యయనం చేయించింది. అదే సమయంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, అమెరికాలోని స్టోనీబ్రూక్‌ విశ్వవిద్యాలయాలు వ్యాధి ఉద్ధృతిపై అధ్యయనం చేశాయి.

క్రిమి సంహారక మందుల ప్రభావం

తాజా విశ్లేషణల ప్రకారం తాగునీటిలో సమస్యలు పెద్దగా లేవని, క్రిమి సంహారక మందుల వినియోగం ఎక్కువగా ఉండటం మూలంగానే వ్యాధులు ఎక్కువైనట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే దీన్ని వారు ధ్రువీకరించడంలేదు. విశాఖపట్నంలో డయాలసిస్‌ కేంద్రాలున్నా స్థానికులకు పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. విశాఖపట్నానికి రానుపోను దూరం 200 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అందని సాయం
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారు వైద్యం పొందాలంటే నెలకు నగదు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చు అవుతుంది. వైద్య పరీక్షలు, మధుమేహం, రక్తపోటు నియంత్రణ, పౌష్ఠికాహారానికి నెలకు కనీసం రూ.3 వేలకు వరకు ఖర్చు అవుతుంది. ప్రారంభదశలో వ్యాధిని గుర్తిస్తే క్రమం తప్పకుండా మందులు వాడితే మరికొంత కాలం జీవించే అవకాశముంటుంది. పేద, మధ్య తరగతి ప్రజలు వాటిని భరించే స్థితిలో లేరు. ఈ ప్రాంతంలో అందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రత్యేక చర్యలు
ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధిపై ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా చర్యలు ప్రారంభించనుంది. వ్యాధికి గల కారణాలపై ఇప్పటికే వైద్య బృందాలు ఉద్దానంలో సర్వే ప్రారంభించింది.

మూలము = విజయసారథి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి, శ్రీకాకుళం.

రిమ్స్ లో డయాలిసిస్ కేంద్రము (Dialysis in Srikakulam )

దివంగత ముఖ్యమంత్రి డా. రాజసేఖర రెడ్డి పుణ్యమా అని. . శ్రీకాకుళంలో RIMS medical college పెట్టడం జరిగినది . అన్ని వైద్యసదుపాలల్తో పాటు డయాలిసిస్ కూడా నెలకొల్పడం దానిమూలంగా సుమారు సమ్వత్సరానికి వందలాది మూత్రపిండాల వ్యాదిగ్రస్తులు ముఖ్యము గా ఉద్దానము ప్రాంతం వారు లబ్దిపొందుతున్నారు .
ఎలా సంప్రదించాలి :
కిడ్నీ రోగులు రిమ్‌స్ లో ఒ.పి. విభాగము లో పేరు నమోదు చేయించుకుంటే మడికల్ వార్డ్కు పంపిస్తారు . అక్కడ " క్రియాటినిన్‌ , బ్లడ్ యూరియా తదితర పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారించి డయాలిసిస్ అవసరమా లేదా మందులతో తగ్గించవచ్చా? అనేది నిర్ణయిస్తారు . డయాలిసిస్ విభాగము చీప్ అధ్వర్యము లో అవసరమైనవారికి నిర్ధేశిత పట్తిక ప్రకారము చికిత్స ప్రారంభిస్తారు . ఈ క్రమములో రోగుల జీవన ప్రమాణము పెంచుతూ ఉంటారు . ఒక పేసెంటుకి అవసరాన్ని బట్టి నెలకు 08 సార్లు డయాలిసిస్ చేస్తారు .
మూత్ర పిండాలు ఎలా పనిచేస్తాయో అవగాహన :
మానవ శరీరములో వెన్నెముకకు ఇరువైపులా రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఒక్కోక్కటి 10 నుండి 12 సెంటీమీటర్లు చుట్టుకొలత , 150 గ్రాముల బరువు ఉంటుంది. రోజుకి మొత్తం మీద 1.5 నుంచి 2.0 లీటర్ల వరకు మూత్రాన్ని తయారుచేస్తాయి . రక్తాన్ని వడపోసి యూరియా , క్రియాటినిన్‌ వంటి మలిన పదార్ధాలను మూత్రం ద్వారా బయటకు విసర్జిస్తాయి. శరీరములో నీటిశాతాన్ని , లవణ పరిమాణాన్ని క్రమబద్దీకరిస్తాయి.
చెడిపోవడానికి కారణాలు - అవగాహన :
మధిమేహము , రక్తపోటు , ఉబ్బుకామెర్ల , అధికమొత్తం లో నొప్పినివారణ మాత్రలు తినడము , మూత్రపిండాలలో రాళ్లు , పుట్టుకతో వచ్చే కిడ్నీ వ్యాధులు , మూత్రకోశ , మూత్రనాళ వ్యాధులు , ఎక్కువ వాంతులు , విరోచనాలు వల్ల కలిగే డిహైడ్రేషన్‌ , మలేరియా మున్నగునవి .
నివారణ చర్యల అవగాహన :
రక్తపోటు , మధుమేహ వ్యాధులు అదుపులో ఉంచుకోవడము ,
తీసుకునే ఆహారములో ఉప్పును క్రమబద్ధీకరించుకోవడం ,
రోజూ తగు మోతాదులో నీరు త్రాగడం,
కుటుంబకులో ఎవర్కైనా కిడ్నీవ్యాదు ఉంటే మిగిలినవారు వైద్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం ,
వ్యాధి లక్షణాలు - అవగాహంకోసం :
అధిక రక్తపోటు , నిష్షత్తువుగా ఉండడం , ఆకలి మందగించడం , వాంతులు , దురద , ఒళ్ళు నొప్పులు , శరీరంతా వాపు , మూత్రము ఎక్కువసార్లు రావడం , చిన్న పిల్లలలో ఎదుగుదల లేకపోవడం , మూత్రం లో మంట , మూత్రం ఎరుపురంగులో పడ్డం , మున్నగునవి .... ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి .

  • =========================================
Visit My Website - > dr.seshagirirao-MBBS

Thursday, March 18, 2010

నకిలీ మందులు వ్యాపారము శ్రీకాకుళం లో , Spurious(Duplicate)Medical Business in Srikakulam





శ్రీకాకుళం లో నకిలీ మందుల వ్యాపారము గురించి ప్రత్యేకం గా ఏమీ లేదు కాని .. రాష్ట్రము లో కొనసాగుతున్న అక్రమ నకిలీ మందుల అమ్మకాలు ఇక్కడా జరుగుతున్నాయి . . నాలుగు మునిసిపాలిటీలు , 38 మండలాలు ఉన్న శ్రీకాకుళం జిల్లలో ఎక్కువమంది గ్రామీణ ..అంతగా చదువులేని అమాకయక ప్రజలు , సగానికి పైగా గిరిజనులు ఉన్నారు . వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది మందుల వ్యాపారులు , మందులల కంపినీ ఏజెంట్లు నకిలీ మందులు చలామణి చేస్తున్నారు . చూడడానికి అసలైన మందులు లాగే ఉంటాయి ... పని మాత్రం ఉండదు .. జబ్బులు నయం కాదు .. డాక్టర్లకు తలనొప్పి , రోగులకు ప్రాణసంకటం .

అదొక కర్కశ వ్యాపారం.. చట్టాల 'నియంత్రణ'కు లొంగని వ్యవహారం.. రోగుల అమాయకత్వమే పెట్టుబడిగా సాగుతున్న మంచి వ్యాపారము .. నకిలీ ఔషధాలతో నిలువునా మోసం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుతున్న చెలగాటం.

భారత ఔషధ పరిశ్రమకు నకిలీ మందులు సవాలు విసురుతున్నాయి. ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చెడ్డపేరునూ తీసుకొస్తున్నాయి. దేశీయంగా అయితే.. అమ్ముడవుతున్న ప్రతి అయిదు ఔషధాల్లో ఒకటి నకిలీదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాశీనత, ఔషధ నియంత్రణ శాఖ అలసత్వం, ప్రజల అమాయకత్వం వెరసీ మార్కెట్‌లో నకిలీ ఔషధాల విక్రయాలు జోరుగా సాగిపోతున్నాయి.

నకిలీ'ల జోరుకు కారణాలివి..

* ఔషధాల నాణ్యతను సరిగ్గా నిర్థరించే ప్రయోగశాలలు ఎక్కువగా లేకపోవడం.
* ఔషధ తయారీ పరిశ్రమలకు ఇష్టారీతిగా అనుమతుల మంజూరు

నమ్మలేని నిజాలు..

* ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ప్రపంచం మొత్తంమ్మీద తయారవుతున్న నకిలీ మందుల్లో 35 శాతం భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి.
* ప్రపంచంలో చలామణీలో ఉన్న నకిలీ ఔషధాల్లో 75 శాతం ఇండియాలో కనపడతాయి. ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఒ.ఇ.సి.డి.) నివేదికలో చెప్పిన విషయమిది.
* 'అసోచామ్' అంచనా ప్రకారమైతే దేశంలో నకిలీ మందుల విక్రయాల వ్యాపారం ఏటా 25 శాతం వృద్ధి చెందుతోంది.
* మన దేశ మార్కెట్‌లో ఉన్న మందుల్లో ఎనిమిది శాతమే అనుమానించదగినవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. చి ఔషధ నియంత్రణ చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడం
* సిబ్బంది కొరత, కీలకమైన డ్రగ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులనూ భర్తీ చేయకపోవడం
* గడువు దాటిపోయిన మందుల్ని లేబుళ్లు మార్చేసి అమ్మేస్తున్నా పట్టించుకోని అధికారులు

వీటిన్నింటితో దేశంలో నకిలీ మందుల విక్రయాలు యథేచ్చగా జరుగుతున్నాయి.కొందరు అధికారులూ సహకరిస్తుండటంతో అక్రమార్కులకు అడ్డుకట్ట పడట్లేదు.

* రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు..
* ఔషధ తయారీ పరిశ్రమలు, విక్రయ కేంద్రాలకు లైసెన్సుల మంజూరు
* ఔషధ ప్రయోగశాలలకు లైసెన్సుల జారీ, డ్రగ్ ఫార్ములేషన్‌కు అనుమతి
* రాష్ట్రంలో తయారయ్యే, విక్రయాలు జరిగే మందుల నాణ్యతను పరీక్షించడం
* లైసెన్సుల మంజూరుకు ముందు, తర్వాత తనిఖీలు
* నాణ్యత లేని ఔషధాలను మార్కెట్ నుంచి ఉపసంహరింపచేయడం

వీటన్నింటిపై సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు చేయవచ్చు. సెక్షన్ 2(జె)(ii) ప్రకారం రికార్డుల తనిఖీకి కూడా అనుమతి కోరవచ్చు.

మనము - ఏం అడగొచ్చంటే..

రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖకు దరఖాస్తు చేసి ఈ కింది సమాచారం తీసుకోవచ్చు.
* లైసెన్స్‌డ్ బ్లడ్ బ్యాంకుల వివరాలు, నిషేధిత ఔషధాల జాబితా
* గుర్తించిన మందుల రేట్ల వివరాలు
* కెమిస్టులు, డ్రగ్గిస్టుల సేవలపై వచ్చిన ఫిర్యాదులు
* ఔషధాల నాణ్యత; మందుల దుకాణాలు, తయారీ కేంద్రాలపై చేసిన దాడులు,
* గుర్తించిన అవకతవకలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు
* వివిధ రకాల లైసెన్సుల మంజూరు, రెన్యూవల్‌కు అనుసరించిన ప్రాతిపదికలు
* డబ్ల్యూహెచ్ఓ జీఎంపీ, ఫ్రీసేల్, మార్కెట్ స్టాండింగ్, జీఎంపీ సర్టిఫికెట్ల జారీకి అనుసరించిన ప్రాతిపదికలకు సంబంధించిన సమాచారం
* మందుల నాణ్యతపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలు

మనమేం చేయాలంటే..

* గుర్తింపు పొందిన వైద్యుల సూచనల మేరకే ఔషధాలను వినియోగించాలి.
* అనుమతులున్న దుకాణం నుంచే మందులు కొనాలి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి.
* తయారీదారు పేరు, బ్యాచ్ నంబరు, గడువు ముగిసే తేదీ, ఎంఆర్‌పీ, డాక్టర్ పేరు, అర్హత, డ్రగ్ లైసెన్స్ నంబరు తదితరాలన్నీ బిల్లులో ఉండేలా చూసుకోవాలి.
* ఔషధానికి సంబంధించి అనుమానాలుంటే (నకలీ అని భావిస్తే), వినియోగించిన తర్వాత అనుకోని రియాక్షన్లు వచ్చినా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలి.

  • ======================================================
Visit My Website - > http://dr.seshagirirao.tripod.com/

Sunday, March 14, 2010

Fire Protection in Private Hospitals






In Srikakulam district ...
There are about 200 private hospitals are present .
There are about 120 multi storied hospitals present .


Is it necessary to protect against accidental fire in private hospitals ? yes it is necessary only in 10% of private hospitals ... i.e in big poly nursing homes of multi-storied buildings . In clinics and single-owned nursing homes with only ground-floor buildings less than 10 in-patients beds it is not necessary.

There is only one instance of accidental fire deaths so far in medical / hospital history . . . i.e in Park hospital - Hyd. where 3 persons died.

The inspecting authority is given to a non-medical fire services who have nil knowledge of hospital maintainence . . that gives some mental disturbance to those doctors where there is no necessity of fire protection .

It is the Govt.hospitals and corporate hospitals fire protection is needed ... where more number of patients admitted and having lot of machinery equipment is present .

Exclude from fire protection rules :
  1. all clinics ,
  2. Hospitals with only Ground floor buildings ,
  3. hospitals with 10 & less than 10 in-patients beds ,
  4. All single doctor nursing homes ,
డాక్టర్లకు వేదింపులు : దశ విధ దండం .
  1. మునిసిపాలిటి పన్ను అధికారుల వడ్డింపులు ... వ్యాపార సంస్థలు గా పరిగనించబడినందున అధిక మొత్తం లోపన్నులు .
  2. నాలా పన్ను వసూలుచేసే రెవిన్యు వారి చీదరింపులు ,
  3. కాలుష్య నివారణ ఆఫీసర్ల (AntiPolutionInspectingOfficers) తనికీ వేదింపులు... లంచాలకోసం ,
  4. సేల్ టాక్ష్ అధికార్ల నోటీసులు ... ప్రొఫిషనల్ టాక్ష్ కోసం ,
  5. ఇన్కం టాక్ష్ అధికార్ల వేధింపులు ... అకౌంట్స్ కోసం ,
  6. చెత్త ఎత్తే " మరిడి" సంస్థ తనికీలు బెడ్ నంబర్ కోసం .. బెడ్ కి నెలకి 100 రూపాయిలు కట్టాలి ,
  7. డి.యం.& ఎహ్.ఓ . తనికీలు -- హాస్పిటల్ రిజిస్ట్రేషన్ & ఫీజు రేట్లు బోర్డులు పెట్టనందుకు ,
  8. డ్రగ్ ఇన్స్పెక్టర్ మేమోలు ... పేసేన్ట్లకు బిల్లులు లేకుండా ఫ్రీగా మందులిచ్చినందుకు , ఫ్రిజ్ పనిచేయనందుకు , మందులు నిలవా ఉంచినందుకు ,
  9. ఎలెక్ట్రికల్ ఇన్స్పెక్టర్ నోటిసులు , సర్వీస్ కట్ చేస్తామని బెదిరింపులు ... ఎర్త్-వైర్ సరిగా లేనందుకు , బిల్లులు సరియైన టైం కి కట్టినా వాళ్ళ నోటీసుకు రానందుకు ,
  10. పసేంట్లు చనిపోతే బందువుల దగ్గరనుండి వేదింపులు & తన్నులు తినడం , కన్జుమార్ కోర్టుల వడ్డింపులు చెల్లించడం ,
దీనికి తోడూ ఫైర్ ఆఫీసర్ల కొత్త వేదింపులు , చిరుబుర్లు , చిరాకులు ... అగ్ని ప్రమాద నివారణ యంత్రాలు లేవని .
  • ===============================================
Visit My Website - > dr.seshagirirao