Tuesday, April 9, 2013

శ్రీకాకుళం జిల్లాలో క్లస్తర్ ఆరోగ్య విధానము,Cluster health system in Srikakulam dist.

  •  

 ఉన్న ఆరోగ్య కేంద్రాలను పఠిస్ట పరచకుండా ఏదో కొత్త విధానము ప్రవేశ పెట్టినంత మాత్రాన మంచి జరుగుతాదనుకోవడం పొరపాటే అవుతుంది . మరి పొరపాటో లేక గ్రహపాటో జూన్‌ 2011 లో శ్రీకాకుళం ఆరోగ్య కేంద్రాలను , వాటి రూపు రేఖలను మార్పు చేసారు .

క్షేత్ర స్థాయిలో ప్రజరొగ్యం మెరుగు పరిచేందుకు ప్రభుత్వము ప్రజా ఆరొగ్య పౌష్టికాహార సముదాయాల (కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్‌ క్లస్టర్స్ ) ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేసినది . ఈ మేరకు సిబ్బంది నియమకాలు కూడా చేపట్టింది . ప్రస్తుతం ఉన్న విధానము కంటే మెరుగైన సేవలందించేందుకు ఈ సముదాయ విధానము అమలుచేస్తున్నట్లు వెళ్ళడించారు . వీటి గొడుగు కిందకు పి.హెచ్ .సి ల పాలన తీసుకురానున్నారు . గ్రామీణ ప్రాంతాల రోగులు పి.హెచ్.సి సేవలు వినియోగించుకోకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తుండడం తో ఆసుపత్రులలో రోజుల తాకిడి ఎక్కువైనది ... పి.హెచ్.సి లు వెలవెలబోతున్నాయి . ఈ విధానానికి స్వస్తి చెప్పి అటు పి.హెచ్.సి లకు ఇటు ప్రభుత్వ హాస్పిటల్స్ కు అనుసంధానము చెసేందుకు క్లస్తర్ విధానము అమలులోకి తీసుకువస్తున్నారు .

శ్రీకాకుళం జిల్లాలో 18 క్లస్టర్లను రూపొందించారు . . . వీటి పరిధి లోమి 76 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు వస్తాయి . క్లస్తర్లలో 104 వాహనాల సేవలు కూడా రానున్నాయి .

సిబ్బంది నియామకము :
క్లస్టర్ కేంద్రాలలో ఎస్.పి.హెచ్.ఓ. . ల నియామకాలు జరిగాయి . జిల్లావ్యాప్తముగా 18 క్లస్టర్లు గాను 12 S.P.H.O లను నియమించారు . వీరు కేవలము కార్యాలయాలకే పరిమితం కాకుండా వారానికి ఐదు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించవలసి ఉంటుంది . క్లస్తర్ పరిధిలోని పి.హెచ్.సి లలో కార్యకలాపాలు వేగవంతం చేయడం , సి.హెచ్.సి లకు కేసులు తరలించడం వంటి పనులలో పాల్గొనాల్సి ఉంటుంది . అలాగె పి.హెచ్.సి లలోని వైద్యులు వారానికి మూడు రోజులు పాటు 104 వాహనము తో పర్యటించాల్సి ఉంటుంది .



  • ================================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

No comments:

Post a Comment

Your comment is very important to improve this blog/site