Tuesday, July 29, 2014

RIMS srikakulam news updates(Telugu)


రక్తపోటు, మధుమేహం అదుపుతో కిడ్నీ వ్యాధుల దూరం--రిమ్స్‌ డైరెక్టర్‌ తెన్నేటి జయరాజ్‌--28/07/2014

గుజరాతీపేట, (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లా ప్రజలు రక్తపోటు, మధుమేహం వ్యాధి బారిన పడకుండా ముందుజాగ్రత్త వహిస్తే కిడ్నీ వ్యాధికి దూరంగా ఉండవచ్చని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)డైరెక్టర్‌ తెన్నేటి జయరాజ్‌ అన్నారు. రిమ్స్‌లో పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) కింద నిర్వహిస్తున్న డయాలసిస్‌ కేంద్రం నాలుగో వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. 2008లో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు 39 వేల డయాలసిస్‌లు నిర్వహించారని చెప్పారు. మూత్రపిండాల వ్యాధి నిపుణులు డాక్టర్‌ రమేష్‌ చంద్ర, రిమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సృజన, రిమ్స్‌ ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్‌ ఇ.ఎస్‌.సంపత్‌కుమార్‌, డయాలసిస్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జి పైడి శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
  • ============================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

No comments:

Post a Comment

Your comment is very important to improve this blog/site