Sunday, July 15, 2012

ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీటు rETu 2012 ,MBBS management Quota seat rate 2012





ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీటు రేటు రూ.30-70 లక్షలుయాజమాన్య కోటా భర్తీపై స్వచ్ఛందసంస్థ అభ్యంతరం--ప్రైవేట్‌ కళాశాలలు, ఎన్టీఆర్‌ వర్సిటీని వివరణ కోరిన హైకోర్టు.---- ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్య కోటాలోని ఒక్కో ఎంబీబీఎస్‌ సీటును రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు బహిరంగంగా అమ్ముకుంటున్నాయని.. ఈ ధోరణిని అడ్డుకోవాలని రాష్ట్ర హైకోర్టును హైదరాబాద్‌కు చెందిన సేవా మెరిట్స్‌ సొసైటీ అభ్యర్థించింది. వైద్యకళాశాలల్లో సీట్ల భర్తీని పర్యవేక్షించాల్సిన ఎన్టీఆర్‌ ఆరోగ్యశాస్త్రాల విశ్వవిద్యాలయం తగిన చర్యలు తీసుకోవటం లేదని, ఫలితంగా ఇంటర్‌లో 90 శాతం మార్కులు సాధించిన ప్రతిభావంతులకు కూడా వైద్య కోర్సుల్లో సీట్లు లభించటం లేదని తెలిపింది. 2012-13 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర వైద్యకోర్సుల్లో యాజమాన్య కోటా సీట్లను ప్రతిభ ఆధారంగా భర్తీ చేసేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ సేవా మెరిట్స్‌ సొసైటీ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సేవా మెరిట్స్‌ సంస్థ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వైద్యకోర్సుల్లో యాజమాన్యకోటా సీట్ల భర్తీకి సంబంధించిన జీవో 136లో నిర్దేశించిన నిబంధనలను కానీ, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కానీ ప్రైవేటు వైద్యకళాశాలలు పట్టించుకోవట్లేదని తెలిపారు. ఈ వ్యాజ్యంపై తీర్పు వెలువడేంత వరకు ప్రవేశాల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ప్రైవేటు కళాశాలల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. యాజమాన్య కోటాలో ఇప్పటికే మూడువేలవరకు సీట్లు భర్తీ అయ్యాయని, నిబంధనల ప్రకారమే అభ్యర్థుల జాబితా ఖరారైందని తెలిపారు. పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సేవా మెరిట్స్‌ సంస్థ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయకుండానే సీTu కోటా ప్రవేశాలు పూర్తయ్యాయని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర వైద్యకోర్సుల్లో యాజమాన్యకోటా సీట్లకేటాయింపునకు సంబంధించి వివరణతో కూడిన కౌంటర్‌ దాఖలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శిని, ఎన్టీఆర్‌ ఆరోగ్యశాస్త్రాల విశ్వవిద్యాలయాన్ని, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలను ఆదేశించింది. తీర్పు వచ్చేవరకు ప్రవేశాల ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

source : Eenadu news paper
  • ===========================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

No comments:

Post a Comment

Your comment is very important to improve this blog/site